DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉదయనిధి, ప్రియాంక్ ఖర్గేలపై ఉత్తర ప్రదేశ్ లో ఎఫ్‌ఐఆర్ నమోదు

*ఉదయనిధి పై దేశ వ్యాప్తంగా మండిపడుతున్న హిందూ సమాజం*
    
*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖపట్నం, సెప్టెంబర్ 6, 2023 ( డిఎన్ఎస్) :* సనాతన ధర్మంపై డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై యావత్ హిందూ సమాజం మండిపడింది. 

తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌,

కర్ణాటక మంత్రి ప్రియాంక్‌ ఖర్గే లపై ఉత్తప్రదేశ్ లోని రాంపూర్ సివిల్‌ పోలీసు లైన్స్‌ పోలీసు స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. 
సనాతన ధర్మంపై ఉదయనిధి విద్రోహ వ్యాఖ్యలు చేయడం పై దేశవ్యాప్తంగా హిందూ సమాజం అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు, కర్ణాటక

మంత్రి ప్రియాంక్‌ ఖర్గే సమర్థించారు. దీంతో వీరిద్దరిపై తక్షణం చర్యలు తీసుకోవాలి అని న్యాయవాదులు హర్ష గుప్తా, రామ్‌ సింగ్‌ లోధి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది. 

సెక్షన్‌ 295ఏ (మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు చేయడం), సెక్షన్‌ 153 ఏ (వివిధ మత గ్రూపుల మధ్య

శత్రుత్వాన్ని ప్రోత్సహించడం) కింద ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు. 

గత శనివారం తమిళనాడులో ఓ కార్యక్రమం లో ఉదయనిధి సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియా వ్యాధులతో పోల్చారు. ఈ వ్యాఖ్యలను అతను సమర్ధించుకున్నాడు. దీన్ని కాంగ్రెస్ నేతలు కూడా సమర్ధించారు. 

బచ్చాగాడి వ్యాఖ్యలకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి :

జివిఎల్  

రాజకీయ బచ్చాగాడు చేసిన విపరీత వ్యాఖ్యలను సమర్ధించిన కాంగ్రెస్ పార్టీ మొత్తం క్షమాపణ చెప్పాలని రాజ్యసభ సభ్యులు జి వి ఎల్ నర్శింహారావు డిమాండ్ చేసారు. 

మీ క్రైస్తవం, ఇస్లాం పుట్టక ముందు నుంచి సనాతనం ఉంది:..

సనాతన ధర్మం ఈ భూమిపై క్రైస్తవ మతం, ఇస్లామిక్ మతం రాకముందే ఉందని, సనాతన

ధర్మం' అంటే శాశ్వతమైన, కాలాతీతమైన ధర్మం అని తమిళనాడు బీజేపీ అధ్యక్షులు, పూర్వ ఐపీఎస్ అధికారి, తమిళ సింగం కె. అన్నామలై అని మండిపడ్డారు. 

సనాతన ధర్మాన్ని నిర్మూలించవలసి వస్తే, మీరు అన్ని దేవాలయాలను మరియు ప్రజలకు అవసరమైన మతపరమైన ఆచారాలను ముగించాలి. సనాతన ధర్మాన్ని రద్దు చేయడానికి ఉదయనిధి స్టాలిన్ ఎవరు?

అని హెచ్చరించారు.  డిఎంకె మంత్రి చేసిన ఈ చర్య అది హిందూ వ్యతిరేక పార్టీ అని, వారికి హిందువులపై ద్వేషం ఉందని తెలియజేస్తోందన్నారు. 

ఇది ఒక పధకం ప్రకారం చేస్తున్న కుట్ర: బీజేపీ  

భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది మాట్లాడుతూ, ఐ.ఎన్‌.డి.ఐ.ఎ. కూటమి సమావేశం ముగిసిన 24 గంటల తర్వాత,

ఉదయనిధి ఈ ప్రకటన చేశారని, ఇది అతని సొంతంగా ఇచ్చిన ప్రకటన కాదని, ఇది పూర్తి పర్యవసాన క్రమాన్ని కలిగి ఉందన్నారు. ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు 'మొహబ్బత్ కి దుకాన్' అసలు ముఖాన్ని బయటపెట్టాయని త్రివేది అన్నారు.

ఈ విష నాగుని అరికట్టాల్సింది: యుపి సీఎం యోగి 

భారతదేశంలో ఈ పాము విషపు విషాన్ని మనం

అరికట్టాలి అని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి, గోరఖ్ నాధ్ మఠం అధ్యక్షులు యోగి ఆదిత్యనాధ్ పిలుపునిచ్చారు. రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసిన వాడు నోటికి వచ్చిన వ్యాఖ్యలు చేస్తున్నాడు అంటే అతనికి భారత రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం లేనట్టేనన్నారు. ఇలాంటి వాళ్ళని కట్టడి చెయ్యాల్సిందేనన్నారు.  

హిందూ ధర్మాన్ని నీ

ఇంట్లో అడ్డుకో: మహిళా మోర్చా చీఫ్  

నీ సొంత కుటుంబంలోనే నీ తల్లి సనాతనధర్మాన్ని పాటించడం ఆపలేని నువ్వు సనాతన ధర్మాన్ని రూపుమాపుతాను అనడం తమాషాగా ఉంది అని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతీ శ్రీనివాసన్ ఎద్దేవా చేశారు. 

దేశవ్యాప్తంగా హిందూ సమాజం  నిరసనలు, ధర్నాలు

చేస్తోంది. ప్రతి జిల్లా కేంద్రంలోనూ పొలిసు కేసులు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam