DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అయోధ్యలో కరసేవకుల బలిదానం ఎంతమందికి గుర్తు ఉంది?

*వాళ్లపై మరణకాండ చేసిన రావణ వారసులు గుర్తు ఉన్నారా?*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖ పట్నం, జనవరి 15, 2024 (డి ఎన్ ఎస్):* దేశ విదేశాల్లో నేడు విస్తృతంగా వినిపిస్తున్న పేరు అయోధ్య రామ మందిరం. జనవరి 22, 2024 వ తేదీన అయోధ్యలో రామ జన్మభూమిలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట తో రామాలయం ఆవిష్కృతం కానుంది.

అయితే ఈ ఆలయం ఈ దశకు రావడానికి లక్షలాది మంది బలిదానం జరిగిన విషయం ఎంతమందికి గుర్తు ఉంది. వీళ్లపై మరణ కాండ సాగించిన రావణాసుర వారసులు ఎంతమందికి గుర్తు ఉన్నారు. ఈ అంశాలపై కూడా దృష్టి సారించవలసిన అవసరం ఉంది. 

1989 - 92  మధ్య కాలంలో జరిగిన కరసేవకుల ఉద్యమం లో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం చూపించిన కర్కశ మారణహోమం

మరిచిపోయిన వాళ్ళని చరిత్ర క్షమించదు. రోడ్లపై రామనామం చేస్తూ నిరసన చేస్తున్న కరసేవకులపై తెల్లని బాష్పవాయువు ప్రయోగించి, రామ భక్తులను పట్టుకుని నేరుగా తలలపై తుపాకులతో కాల్చిన సన్నివేశాలు చాలామంది మరిచిపోయినా. . . వారి కుటుంబ సభ్యులు ఎలా మరిచిపోగలరు. నాటి పాలకులు నేటికీ నోటికి వచ్చిన విమర్శలు చేస్తూ. . .శునకానందం

పొందుతూనే ఉన్నారు. అయితే అధికారం కోసం బీజేపీ చేస్తున్న కొన్ని తప్పిదాల కారణంగా చాలామంది బలి అవుతున్నవిషయం కూడా తెలిసిందే. 

హిందూ వ్యతిరేకులకు సైతం ఆలయ ప్రారంభానికి ఆహ్వానం పలుకుతున్న నిర్వాహకులు, ఎంతమంది కరసేవకుల కుటుంబాలను ఆహ్వానించారు?

బీజేపీ కాకుంటే గుడికి పునాదే పడేది

కాదు:

దాదాపు 500 ఏళ్ళ పోరాటం తదుపరి ఈ ఆలయం నిర్మాణం రూపుదాల్చడానికి గల ప్రధాన కారణం అటు కేంద్రం లోను, ఇటు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోనూ కరుడుకట్టిన సనాతన వాదులు అధికారం లో ఉండడమే. సుప్రీం కోర్టు రామాలయం కోసం తీర్పు ఇచ్చినా. . కేంద్రం లో గానీ, యుపి లో గానీ ప్రతిపక్షాలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉండి

ఉంటె కచ్చితంగా రామాలయం నిర్మాణం జరగనివ్వదు. ఆ పార్టీ హిందువులను కేవలం ఓటు బ్యాంకు గానే చూసింది తప్ప, ఏనాడూ హిందూ మనోభావాలకు విలువ ఇవ్వలేదు. దానికి ప్రధాన నిదర్శనమే నేడు రామాలయం ప్రారంభానికి రావాలని ఆహ్వాన కమిటీ ఆ పార్టీ అధిష్టాన నేతలకు ఆహ్వానం పంపితే. . మేము రాము అని నిష్కర్షగా ప్రకటించడం వ్యతిరేకత కాకుంటే

మరేంటి?
ఇదే వ్యక్తులు ఉజబికిస్తాన్ లోని బాబర్ పుట్టిన చోటుని, ఆఫ్గనిస్తాన్ లోని బాబర్ సమాధిని చూసేందుకు ప్రత్యేకంగా వెళ్లడం గమనార్హం. 
అంతకు మించి. . .సుప్రీం కోర్టు లో రామాలయం పై తుది తీర్పు వచ్చిన రోజున ఇదే కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు నల్ల గుడ్డలు వేసుకుని పార్లమెంట్ కు హాజరవ్వడం వాళ్ళ హిందూ వ్యతిరేకత కు

ప్రత్యక్ష నిదర్శనం. 

అక్కసు ఇలా వెళ్ళక్రక్కుతున్నారు. .:
 
ఇలాంటి వాళ్ళని నమ్మి దేశాన్ని ఆరు దశాబ్దాల కాలం అప్పగించిన హిందువులు కొన్ని తరాల పాటు నరకం చూసే ఫలితాన్ని పొందారు. వీళ్ళ అక్కసు అంతటి తో తీరలేదు. నేడు రామాలయ ప్రారంభోత్సవానికి అవాంతరాలు ఎలా కలిగించాలా అని కుట్రలు పన్నుతూనే ఉన్నారు. ఒకడు

అక్షతలు పంపిణీ ని బియ్యం అంటాడు, ఇంకొకడు మెం యాదాద్రి లో బియ్యం పంచి ఉంటె. .మల్లి అధికారం లోకి వచ్చే వాళ్ళం అంటాడు. ఇంకొక సైతాను ..శృతిమించి  త్వరలోనే ఈ కట్టిన గుడిని కచ్చితంగా కూల్చి తీరతాం అంటాడు. మరొక రాక్షసుడు ఏకంగా సనాతన హిందూ ధర్మాన్ని నిర్మూలించేస్తా అంటాడు. 

హిందూ ధర్మం పై ఎవరుపడితే వాడు ఇలా

నోటికి వచ్చిన ప్రేలాపనలు చేస్తుంటే. .కట్టడి చేసేందుకు చట్టాలు కూడా అమలు కాకపోవడం గమనార్హం. ప్రస్తుతం ప్రారంభమవుతున్న బాల రాముడు ఈ రాక్షసుల వారసులకు అడ్డుకట్ట వెయ్యాలి అని కోరుకుందాం. 

కళ్ళు మూసుకున్న మీడియా. . .

అనవసరమైన అంశాలపై కడుపు చించుకు పడే మీడియా. . అయోధ్య కరసేవకుల పై జరిగిన మరణ కాండ పై

కనీసం సానుభూతి కూడా చూపేందుకు ఆసక్తి చూపక, కళ్ళు మూసుకుపోయింది అనే విమర్శలు ఉన్నాయి. ఇతర దేశాల్లో జరిగే ఘటనలపై పేపర్ మొత్తం కధనాలు వ్రాసే సూడో మీడియా, కరసేవకుల మరణ దృశ్యాలను పట్టించుకోక పోవడం గమనార్హం అని నాటి ఘటన ను చూసిన సగటు హిందువుల అభిప్రాయం. 

పదవి దాహం కోసమే పాశవిక చర్యలు . .

అయోధ్య లో

కరసేవకులపై జరిగిన మారణకాండ కు ప్రధాన కారణం అధికార, పదవి దాహం అని చెప్పాలి. మైనారిటీల ఓట్ల కోసం నాటి ఎస్పీ, కాంగ్రెస్ లు చేసిన మరణ కాండ లు హిందువులపై చూపించాయి అనడానికి నాటి ఘటనలే నిదర్శనం. నాటి ఇందిర తన పదవి కోసం ఎమర్జెన్సీ విధించడంతో పాటు, అంతకు ముందు ఢిల్లీ లో వందలాది మంది సాధువులు, గో వులపై మారణకాండ జరిగింది.

అధికారం కోసం యుపి   లో ములాయం సింగ్ కరసేవకులపై దారుణ మారణకాండ జరిపారు అనడానికి ప్రత్యక్ష దృశ్యాలే నిదర్శనం.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam