DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కన్యాకుమారి లో మోడీ ధ్యానం పై కుహనా పార్టీల కడుపుమంట

*వివేకానందరాక్ పై  నరేంద్రుని ధ్యానం పై ఈసీ కు ప్రతిపక్షాల ఫిర్యాదు* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖపట్నం, మే 31, 2024 (డి ఎన్ ఎస్):* దేశ వ్యాప్తంగా ఎన్నికలు ముగుస్తున్న వేళ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనశాంతి కోసం కన్యాకుమారి వివేకానంద మందిరం వద్ద ధ్యానం చేసుకునేందుకు వెళ్లడం కుహనా

పార్టీలకు కడుపుమంటగా తయారయ్యింది. దేశవ్యాప్త పర్యటన అనంతరం ఏకాంతం లో గడిపేందుకు మోడీ వివేకానంద రాక్ మెమోరియల్ కు వెళ్లారు. తమిళనాట ఎన్నికలు మొదటి దశ లోనే ముగిసాయి. ఒక్కొక్కరు వారి ప్రశాంతతను ఒక్కో విధంగా కోరుకుంటారు. ఇలాంటి కేంద్రం లో ప్రధానికి అనుమతి ఎలా ఇచ్చారు అంటూ కుహనా ప్రతిపక్ష పార్టీలు మండిపడుతూ కేంద్ర

ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు కూడా చేసాయి. కన్యాకుమారి లోని సముద్రం మధ్యలో ఉన్న ఈ వివేకానంద రాక్ మెమోరియల్ కేంద్రం వివేకానంద కేంద్ర అనే ఒక ప్రైవేట్  సంస్థ చే నిర్వహించబడుతోంది. దీనికి ప్రభుత్వ అనుమతులు అవసరం లేదు. ఇదే విషయం కన్యాకుమారి జిల్లా కలెక్టర్ ప్రకటించడం జరిగింది. 

అయితే ప్రతిపక్షాలకు మోడీ

ఏకాంతం లో ఉండడం ద్వారా ప్రపంచ యుద్దాలు వచ్చేస్తాయి అనే భావన లో మోడీ ప్రయాణం పై కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దీనిపై దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలకు చీవాట్లు పెట్టారు. పైగా మోడీ బస చేసిన రాక్ మెమోరియల్ వద్ద సొంత మీడియా టీమ్ లను సైతం మోహరించి చీవాట్లు కూడా తింటున్నాయి. దేశంలోని మిగిలిన రాజకీయ

పార్టీల నేతలు కుటుంబ సమేతంగా విదేశాలకు విహార యాత్రలకు, పబ్ లకు, రేవ్ పార్టీలకు వెళ్లినా, అవన్నీ ఈ కుహనా పార్టీలకు ఎంతో ఆనందాన్ని కల్గించినట్టు ఉన్నాయి. సనాతన ధర్మాన్ని నిరంతరం పాటించే నరేంద్రుని ధ్యానం మాత్రం ప్రపంచాన్ని విపత్తు లాగా కనిపించినట్టు ఉంది. 

పైగా నరేంద్ర మోడీ ధ్యానం చేసే గదిలో మరో మనిషి కి

కూడా అనుమతి లేదు. అఖండ భారతావని కి ఉజ్వల భవిషత్ లభించాలనే సంకల్పంతో నిద్ర ఆహారాలకు దూరంగా చేస్తున్న ఈ మహోన్నత యజ్ఞం సత్పలితం ఇవ్వాలి అని కోట్లాదిమంది ఆశిస్తున్నారు. 

కుహనా పార్టీలు మాత్రం ఇదేదో దేశ విద్రోహ చర్యగా ప్రచారం చేస్తూ. . నోళ్లు చించుకుని, తమ సొంత సోల్డ్ మీడియాల్లో దుష్ప్రచారం విస్తృతంగా

సాగిస్తున్నాయి. అయితే ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా దేశ అభ్యున్నతి కోసం ఆలోచిస్తున్న భారత పౌరులు నరేంద్రునికి అండగా నిలిచినట్టు తెలుస్తోంది. భారత్ లోని కుహనా పార్టీలు మోడీ ఓడిపోవాలని కుట్రలు, కుతంత్రాలు చేస్తుంటే. . .నరేంద్రుడు మూడోసారి కూడా గెలిచి విశ్వ గురు స్థానం లో కొనసాగాలని ప్రపంచంలోని అధికశాతం దేశాలు

కోరుకుంటున్నాయి. ప్రపంచాన్ని శాశిస్తున్న దేశాలు సైతం నరేంద్రుని విజయాన్ని కోరుకోవడం భారత్ లోని కుహనా పార్టీలకు మింగుడు పడడం లేదు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam