DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహగిరి ప్రదక్షిణ కోసం విశాఖ లో ట్రాఫిక్ నిబంధనలు

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार)*    

*విశాఖపట్నం, జులై 19, 2024 (డిఎన్ఎస్):*  *ఈ నెల 20, 21 తేదీలలో జరగనున్న సింహాచలం క్షేత్రం గిరి ప్రదక్షిణ  పురస్కరించుకొని విశాఖ నగర పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.  మొత్తం సుమారు 32 కిలోమీటర్లు దూరం సాగే సింహగిరి పరిక్రమణ ఈ నెల 20 న ఉదయం 5 గంటలకు తొలి పావంచ నుండి

ప్రారంభమై అడవివరం, హనుమంతువాక,  జోడుగుళ్ల పాలెం,  అప్పుఘర్,  వెంకోజి పాలెం,  H.B కాలనీ, సీతమ్మధార,  బాలయ్య శాస్త్రి లేఔట్,  పోర్ట్ స్టేడియం వెనుకవైపు, నరసింహనగర్, D.L.B క్వార్టర్స్, C.I.S.F బ్యారెక్స్,  N.G.O కాలనీ,  మురళి నగర్,  మాధవధార, మారియర్  హోటల్, N.S T.L  గేట్,  NAD ఫ్లైఓవర్,  సుసర్ల కాలనీ,  బాజీ జంక్షన్, సప్తగిరి

జంక్షన్,  గోపాలపట్నం బంకు జంక్షన్, కుమారి కళ్యాణమండపం,  ప్రహ్లాదపురం,  పాత గోశాల,  సింహాచలం బస్టాండ్ మీదుగా తొలిపావంచ చేరి ముగియనుంది. 

ఈ మార్గాల్లో భక్తులు నడిచే అవకాశం ఉన్నందున, ఈ మార్గం లో ఉండే ప్రజలు 20వ తేదీ ఉదయం నుండి 21వ తేదీ మద్యాహ్నం వరకు ప్రత్యమ్నాయ మార్గాల్లో ప్రయాణించాల్సి

ఉంటుంది. 

ట్రాఫిక్ నిబంధనలు ive: 

▪️20వ తేదీ ఉదయం నుండి అడవివరం, పాత గోశాల జంక్షన్ మధ్య ఎటువంటి వాహనములను అనుమతించబడవు ప్రత్యమ్నయంగా వేపగుంట, పెందుర్తి, అక్కిరెడ్డిపాలెం, దువ్వపాలెం జంక్షన్ మీదుగా   ప్రయాణించవలెను.

▪️అడవివరం నుండి గిరిప్రదక్షిణ నిమిత్తం తొలిపావంచా వచ్చు భక్తులు

వారి వాహనములను అడవివరం జంక్షన్ వద్ద ఏర్పాటుచేసిన పార్కింగ్ నందు నిలుపుకొని కాలినడకన రావి చెట్టు జంక్షన్ నుంచి గాంధీనగర్, కోనేరు మీదుగా కలశం జంక్షన్ చేరుకోవలెను.

▪️గిరిప్రదక్షిణ నిమిత్తం వేపగుంట, సింహపురి కాలనీ నుంచి వచ్చు భక్తులు పాత గోశాల వద్ద ఏర్పాటుచేసిన పార్కింగ్ ప్రదేశంలో వాహనములను నిలుపుకొని

కాలినడకన తొలి పావంచ వరకు చేరుకొనవలెను.

▪️గోపాలపట్నం పెట్రోల్ బంక్ జంక్షన్ నుండి పాత గోసాల వరకు ఎటువంటి వాహనాలు అనుమతించబడవు.

▪️అనకాపల్లి నుంచి శ్రీకాకుళం, విజయనగరం వైపు వెళ్ళు వాహనదారులు విశాఖపట్నం సిటీ గుండా పంపబడవు.  వారు ప్రత్యామ్నాయంగా లంకెలపాలెం, సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం గుండా

ప్రయాణించవలెను.

▪️అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం వైపు నుండి అనకాపల్లి వైపు వచ్చు వాహనదారులు నగరంలోకి రాకుండా ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా అనకాపల్లి చేరుకొనవలెను.

▪️శ్రీకాకుళం, విజయనగరం వైపు నుండి విశాఖపట్నం సిటీ వైపు వచ్చు వాహనదారులు ఆదర్శనగర్ వరకు వెళ్ళవచ్చును మరియు

రావచ్చును.

▪️గిరిప్రదక్షిణ భక్తుల రద్దీ దృష్ట్యా పేద వాల్తేర్, కురుపామ్ జంక్షన్ నుండి బీచ్ రోడ్ లో ఎటువంటి వాహనములు అనుమతించబడవు.

▪️పెదవాల్తేరు, కురుపామ్ టవర్స్ జంక్షన్ నుంచి వెళ్ళు వాహనదారులు అనుమతించబడరు, అదేవిధంగా విశాలాక్షి నగర్ బీచ్ రోడ్ నుండి కురుపామ్ వైపు వాహనదారులు అనుమతించబడరు , పై

ఇరువురు జాతీయ రహదారి గుండా ప్రయాణించి గమ్యస్థానం చేరుకొనవలెను.

▪️హనుమంతువాక మరియు వెంకోజి పాలెం వద్ద భక్తులు రహదారి దాటుట వలన వాహనదారులకు కొద్దిపాటి అసౌకర్యం జరిగినప్పటికీ జాతీయ రహదారి గుండా మాత్రమే ప్రయాణించి గమ్యస్థానం చేరుకొనవలెను.

▪️జోడిగుల్లుపాలెం నుంచి హనుమంతవాక వైపు, హనుమంతవాక

నుండి జోడిగుల్లుపాలెం ఎటువంటి వాహనములు అనుమతించబడవు. ఆయా పరిసర ప్రాంతవాసులు విశాలాక్షి నగర్ రోడ్డు గుండా ప్రయాణించి SBI జంక్షన్ వద్ద జాతీయ రహదారి చేరుకొనవలెను.

▪️సీతమ్మధార అల్లూరి సీతారామరాజు స్టాట్యూ నుంచి వెంకోజి పాలెం జంక్షన్ వైపు ఎటువంటి వాహనాలు అనుమతించబడవు.

▪️ఆరిలోవ హెల్త్ సిటీ కీ

వెళ్లవలసిన వారు ఆదర్శనగర్ ఓల్డ్ డైరీ ఫార్మ్ వద్ద నుండి ఆరిలోవ మీదుగా చేరుకొనవలెను.

▪️అడవివరం జంక్షన్ నుండి హనుమంతువాక జాతీయ రహదరి కి వచ్చు వాహనములు అనుమతించబడవు.

▪️వెంకోజిపాలెం నుండి అపుఘర్ వైపు వేళ్ళు భక్తులు రద్దీ దృష్ట్యా వాహనములు అనుమతించబడవు.

▪️అనకాపల్లి, రాజమండ్రి, విజయవాడ,

హైదరాబాద్ వెళ్ళవలసిన అన్ని ప్రైవేటు వాహనములు, ట్రావెల్ బస్సులు ఆనందపురం వద్ద మళ్ళించబడును. కావున తగు చర్యలు తీసుకోవలెను.

▪️విశాఖపట్నం రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, బస్ స్టేషన్, గాజువాక వైపు వెళ్ళు అన్ని వాహనములు ఆనందపురం నుండి పెందుర్తి మీదుగా చేరుకొనవలెను.

▪️విశాఖపట్నం నగర ప్రజలకు ముఖ్యంగా

తగరపువలస, భీమిలి నుండి NAD జంక్షన్, గోపాలపట్నం మధ్య ఉన్న వాహనదారులు 20వ తేదీ నాడు వారి, వారి పనులను మధ్యాహ్నం ఒంటిగంటలోగా ముగించుకొని ఇళ్లకు చేరుకున్నట్లయితే, ఎటువంటి అసౌకర్యం జరగదు. అంతేకాక ఉత్తరాంధ్రలో విశిష్ట దైవం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవుని గిరిప్రదక్షిణకు వచ్చు లక్షలాదిమంది భక్తులకు ఎటువంటి

ఆటంకము లేకుండా సహకరించిన వారవుతారు.

▪️విజయనగరం నుండి నీలకుండీలు మీదుగా వచ్చే భక్తులు అడవివరం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలం లో 2 Wheeler, 3 Wheelers, 4 Wheelers వారియొక్క వాహనాలను పార్క్ చేసుకోవలెను.
▪️హనుమంతువాక జంక్షన్ నుండి వచ్చే 2 Wheeler, 3 Wheelers, 4 Wheelers సెంటర్ జైలు దగ్గరలో ఉన్నటువంటి న్యూ గోశాల వద్ద పార్కింగ్ కు

కేటాయించిన స్థలంలో వారియొక్క వాహనాలను పార్కింగ్ చేసుకోనిరావలెను.
▪️NAD మరియు పెందుర్తి నుండి వచ్చే 2-Wheeler, 3 Wheelers, 4 Wheelers వేపగుంట జంక్షన్ మీదగా సింహపురి కాలనీ చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్లేస్ లో మరియు ఓల్డ్ గోసాల వద్ద ఉన్నటువంటి సాయి నగర్ కాలనీ లో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో వారి వాహనాలను పార్కింగ్

చేసుకొని రావలెను.

విశాఖపట్నం నగర ప్రజలు, నగర ట్రాఫిక్ పోలీసువారి  సూచనలు పాటించి సహకరించమని సూచిస్తున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam