DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భద్రాచలం అర్చకుల బదిలీ ఆగింది హైకోర్టు స్టే వల్లే. .

*అర్చకుల కేసులో ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार)*    

*విశాఖపట్నం, జులై 21, 2024 (డిఎన్ఎస్):* దక్షిణాది అయోధ్య గా పేరుగాంచిన భద్రాచలం శ్రీ రామచంద్ర స్వామి ఆలయ అర్చకుల బదిలీల పై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఝలక్ ఇచ్చింది. కోర్టు ఇచ్చిన మధ్యంతర స్టే

కారణంగానే అర్చకుల బదిలీ ప్రస్తుతానికి నిలిచిపోయింది. అయితే పత్రికల్లో దీనికి భిన్నంగా ప్రకటన రావడం గమనార్హం. కోర్టు ఇచ్చిన స్టే గురించి చెప్పకుండా ఒకరు ఎవరో తెలంగాణ ముఖ్యమంత్రి కి  వినతి పత్రం ఇచ్చిన కారణంగా అర్చకుల బదిలీ నిలిపి వేస్తున్నట్టు పత్రికల్లో ప్రకటించడం ఇవ్వడం ఏంటని వైదిక సంఘాలు

ప్రశ్నిస్తున్నాయి. ఈ కేసులో  ప్రభుత్వాన్నే ముద్దాయిగా చేస్తూ కోర్టు లో వ్యాజ్యం దాఖలు అయిన విషయం తెల్సిందే. ఒక్క వినతి పత్రం ఇవ్వగానే బదిలీ నిలుపుదల చేసే పరిస్థితి ఉంటె భద్రాచలం ఆలయ అంశం హైకోర్టు కు వెళ్ళేది కాదని తెలియచేస్తున్నాయి.  

దేవాలయ వ్యవస్థలోనే ఎన్నడూ లేని విధంగా భద్రాచలం అర్చకులను బదిలీ

చేయడాన్ని తప్పుపడుతూ అర్చకులు హైకోర్టు ను ఆశ్రయించారు. ఇప్పడికే కొందరు వ్యక్తులు స్వార్ధ పూరిత దృక్కోణంతో తమకు సంబంధం లేని వైదిక అంశాల్లో వ్రేళ్ళు పెట్టి ఆలయ వైదిక సిబ్బంది, ప్రభుత్వ అధికారుల్లో అయోమయాన్ని సృష్టించేసారు. దీంతో వివిధ ఘటనల నేపథ్యంలో రామాలయ అంశం న్యాయాలయానికి చేరింది. ఆలయంతో గానీ, శ్రీ పాంచరాత్ర

ఆగమం తో గానీ సంబంధం లేని వ్యక్తులు కొందరు దేవాలయం లో తమ ఆధిపత్యం   చెలాయించేందుకు వైదిక వ్యవహారాలను శాస్త్రబద్ధంగా నిర్వహిస్తున్న అర్చకులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయించే విధంగా పావులు కదిపినట్టు కూడా అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. 

ఆలయ వ్యవస్థలో వైదిక సిబ్బందిని ఒక ఆలయం నుంచి మరో ఆలయానికి బదిలీ

చెయ్యడం దేవాదాయ శాఖా చరిత్రలోనే ఎక్కడా లేదు. అర్చకులను అదే దేవాలయం కు అనుబంధంగా ఉన్న ఉపాలయాలకు బదిలీ చేయడం ఉంటుంది తప్ప, ఏకంగా ప్రధాన ఆలయం నుంచి మరొక ఆలయానికి బదిలీ చెయ్యడం ఉండదు. అయితే నిబంధనలకు భిన్నంగా అర్చకులను బదిలీ చేయడాన్ని తప్పు పడుతూ భద్రాచలం ఆలయ అర్చకులు కోటి శ్రీమన్నారాయణచార్యులు, అమరవాది మురళి

కృష్ణమాచార్యులు, ఫిర్యాదుదారులుగా తెలంగాణ హైకోర్టు ను ఆశ్రయించారు. తెలంగాణ రాష్ట్రం దేవాదాయ శాఖా ప్రిన్సిపల్ సెక్రటరీ, దేవాదాయ శాఖా కమిషనర్ లను ప్రతివాదులుగా చేస్తూ కేసు దాఖలు చేసారు. 

అర్చకులు అంటే ప్రధాన దేవాలయం లో ఆయా ఆగమ విధానం ప్రకారం అర్చనలు, ధూప దీప నైవేద్యాలు, వైదిక కార్యక్రమాలు నిర్వహించే

అర్చకులు, పూజారులు, పండితులు. ఒక్కో ఆలయం ఒక్కో ఆగమ విధానం ప్రకారం నిర్వహించబడుతుంది. భద్రాచలం శ్రీ రామచంద్ర స్వామి దేవాలయం శ్రీ పాంచరాత్ర ఆగమం ప్రకారం, శ్రీవైష్ణవ పండితులచే  నిర్వహించబడుతుంది. దీనిలో నిష్ణాతులు మాత్రమే అర్చక విధుల్లో ఉన్నారని న్యాయస్థానానికి తెలియచేసారు. అర్చకులు అనేది ఉద్యోగం కాదని, యావత్

దేవాలయ వ్యవస్థ లో ప్రధాన భూమిక వహిస్తారన్నారు. ఆలయాలు వైదికంగా నిర్వహించబడేదే అర్చకుల వల్ల, అలాంటి అర్చకులను బదిలీ చెయ్యడం సరికాదన్నారు. వైష్ణవ క్షేత్రాల్లో  ఒక విధంగానూ, శైవ సంప్రదాయం లో మరొక విధంగానూ అర్చనలు సాగుతాయని తెలియచేసారు. 

డా.సుబ్రమణ్యస్వామి - తమిళనాడు ప్రభుత్వం కేసును, తిరుమల దేవస్థానం పై

వచ్చిన కేసును ఈ కేసులో ప్రస్తావించడం జరిగింది. 

అర్చకుల వివరణ తో న్యాయస్థానం ఏకీభవించి, అర్చకుల బదిలీ నిర్ణయం పై మధ్యంతర స్టే విధించింది. తదుపరి విచారణ ఆగస్టు 30 కి వేసింది.   
 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam