DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందూ ధర్మాన్ని కించపరిస్తే సహించేది లేదు: వానరసేన

*ధర్మ రక్షణ కోసం హిందూ సమాజం మేలుకొంటోంది.*  

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*

*విశాఖపట్నం, ఆగస్టు 08, 2024 (డిఎన్ఎస్):* ధర్మ రక్షణ కోసం హిందూ సమాజం మేలుకొంటోంది. హిందూ ధర్మాన్ని ఎవరు కించపరిచినా సహించేది లేదని, హిందూ సంఘాలు హెచ్చరించాయి. ఇటీవల కాలంలో ఎవడు పడితే వాడు, ఎలా పడితే అలా, ఎక్కడ పడితే

అక్కడ  హిందూ సంప్రదాయాన్ని, దేవీదేవతలు ఇష్టానుసారం కించపరచడం పెరిగిపోయిందని, ఓటు బ్యాంకు రాజకీయాలకు హిందువులు బలవుతున్నారని  మండిపడ్డాయి. దీనికి  ప్రధాన నిదర్శనమే ఏకంగా లోక్ సభలోనే ప్రతిపక్ష నాయకుడు హిందువులు హింసక్ , హింసక్ అంటూ పలు మార్లు గొంతు చించుకుని మరీ అరిచిన ఘటనలు దేశమంతా చూసింది. అయినా కూడా ఎవడూ

దీన్ని ఖండించిన దాఖలాలు లేవు. హిందువులను రక్షించేందుకు ఎవ్వరూ రారని, హిందువుల్లోనే చైతన్యం రావలసిన అవసరం ఉందని స్వీయ పోరాటం మొదలు పెట్టినట్టు హిందూ సంఘాలు తెలియచేస్తున్నాయి. 

దీనిలో భాగంగానే రాష్ట్రీయ వానరసేన ప్రతినిధులు టివి నటుడు బిత్తిరి సత్తి ( రవి ) పై హిందూ ద్రోహం అంశం లో హైదరాబాద్‌ సైబర్‌

క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. రెండు రోజుల క్రితం సత్తి భగవద్గీతను కించపర్చేల ఘంటసాల గాత్రాన్ని అనుకరిస్తూ సోషల్ మీడియా లో బిల్లు గీత పేరిట ఒక పేరడీ వీడియో విడుదల చేసాడు.  వీడియోలో భగవద్గీతను అనుకరిస్తూ.. తనదైన శైలిలో వ్యంగ్యంగా ఆ వీడియో చేశాడు. దీనికి సంబంధించిన నెట్టింట వైరల్​గా మారింది. ఈ

వీడియోపై హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. 
ఈ వీడియో వైరల్ కావడంతో వానర సేన అధ్యక్షుడు  నామ్ రామ్ రెడ్డి ఇతర కమిటీ సభ్యులు నేరుగా సత్తి తో మాట్లాడి, బహిరంగ క్షమాపణ కై డిమాండ్  చేసారు. అతను ససేమిరా అనడంతో పాటు, వైఖరి తేడాగా ఉండడంతో సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసారు. 
ఎట్టకేలకు సత్తి క్షమాపణ చెప్పడం

జరిగింది.  

ఈ సందర్భంగా హిందూ సంఘాలు హిందూ వ్యతిరేక శక్తులకు ఒక హెచ్చరిక జారీ చేసాయి. హిందూ ధర్మాన్నీ కిరాచపరుస్తూ, దేవి దేవతలా విగ్రహాలు కూల్చడం, దేవాలయాల ఆస్తులు ధ్వంసం చెయ్యడం వంటివి జరిగితే సహించేది లేదని తేల్చి చెప్పేసాయి. ప్రభుత్వాలు దేవాలయాల నిధులు దోచుకోడానికి మాత్రమే ఉన్నాయని, హిందువుల

రక్షణకు గానీ, దేవాలయాల పరిరక్షణకు గానీ భాద్యత వహించడం లేదని మండిపడ్డాయి. దీంతో హిందూ సంఘాలను కలుపుకుంటూ హిందూ సమాజంలో చైతన్యం కల్గించేందుకు అడుగులు వేస్తున్నాయి.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam