DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందూవులు అంటే మనుషులు కాదా? ప్రపంచ దేశాలకు పట్టింపు లేదా?

*సిగ్గులేని సమాజం నుంచి బంగ్లా దుర్ఘటనలపై ఖండన కూడా లేదు*  

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*

*విశాఖపట్నం, ఆగస్టు 09, 2024 (డిఎన్ఎస్):* హిందువులు అంటే మానవజాతి కాదని ప్రపంచ దేశాలు, సభ్య సమాజం భావిస్తుందా? అంటే అవుననే తెలియచేస్తున్నాయి నేటి పరిస్థితులు. 

బాంగ్లాదేశ్ లో హిందువులపై

జరుగుతున్న అత్యంత పాశవిక అఘాయిత్యాలపై స్పందించేందుకు ప్రపంచం లోని సమాజం జీవించి లేదని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. మానవ సమాజం సిగ్గుపడి చచ్చేలా హిందువుల ధన, మాన, ప్రాణాలపై మతోన్మాదులు బాంగ్లాదేశ్ లో దారుణ మారణకాండ చేస్తుంటే. . వాటిని ఖండించేందుకు జాతీయ, అంతర్జాతీయ మీడియా కు నోరు రావడం లేదని ఆవేదన వ్యక్తం

చేస్తున్నాయి. ఈ దురాగతాలను అడ్డుకునేందుకు ప్రపంచంలోని ఏ రాజకీయపార్టీ కూడా జీవించి లేదన్నాయి. ఆఖరికి మానవ హక్కులు, మానవతావాదం గురించి వేదికలపై ఉదృతంగా  ప్రసంగాలు చేసే ఏ ఒక్క మనిషి ఈరోజు జీవించి లేడు. వీళ్ళకి మద్దతు ఇచ్చిన వాళ్లపై వెటకారం చేస్తున్న రాజకీయ పార్టీలు భారత్ లోనే ఉన్నాయి. 
ఈ ముష్కరులు చేసినా

హింసాకాండను కాంగ్రెస్ నేతలు సల్మాన్ ఖుర్షిద్, సజ్జన్ సింగ్ వర్మ, కమ్యూనిస్ట్ నేత నారాయణ తదితరులు చేసిన సమర్ధన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ముష్కరులను విద్యార్థులుగా చెప్పడంతో మరింత వివాదం గా మారింది. 

అంతర్జాతీయ శాంతి కోసం ప్రచారం చేసుకుంటున్న ఏ ఒక్క సంస్థ కూడా బంగ్లా దేశ్ లో హిందువుల

దుర్గతి పై నోరు విప్పడం లేదు. 

సమీప సరిహద్దు దేశమైన భారత్ కు ఈ ఉగ్రవాదం విస్తరించే అవకాశం ఉన్నందున, తగిన రక్షణ చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలతో అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత వహించగా, ప్రతిపక్ష నేత రాహుల్ గండి, ఇతర పార్టీల నేతలు

పాల్గొన్నారు. బాంగ్లాదేశ్ లో జరుగుతున్న తాజా పరిస్థితులపై మోడీ నేతలకు వివరించి, సూచనలు కోరారు. సమావేశం అనంతరం బయటకు వచ్చిన రాహుల్ కనీసం నోరు విప్పలేదు. పైగా హిందువుల దాడులకు ఖండన కూడా చెప్పలేదు. 
దీనిబట్టి హిందువులు అంటే ప్రతిపక్షాలకు మనుషులుగా కూడా కనపడలేదని హిందూ సంఘాలు

మండిపడుతున్నాయి. 

కాంగ్రెస్ వ్యాఖ్యలపై ఉధృతం:

ఎన్నికల్లో ఓట్లు అడుక్కునేటప్పుడు రాహుల్ జన్యుధారి బ్రాహ్మణ అని చెప్పుకున్నాడని, నేటి పరిస్థితుల్లో ఎందరో బ్రాహ్మణులూ అగ్నికి ఆహుతి అవుతుంటే రాహుల్ గానీ, నేతలు సోనియా, ప్రియాంక లు నోరు విప్పకపోవడం చూస్తే ఇతను  ఏపాటి హిందువో, జన్యువులు ఏంటో

అందరికి తెలిసిందన్నాయి. 

దీనికి అదనంగా కాంగ్రెస్ నేతలు సల్మాన్ ఖుర్షిద్, సజ్జన్ సింగ్ వర్మ చేసిన వ్యాఖ్యలు భారత దేశ ప్రజాస్వామ్యాన్ని కించపరిచే విధంగా ఉన్నాయి. బంగ్లాదేశ్ లో జరిగిన ఘటనలే భారత్ లో కూడా జరుగుతాయని, ప్రధాని ఇల్లు కూడా ఇలాగే ముష్కరుల పాలవుతుందంటూ వ్యాఖ్యానించడం పై బీజేపీ మండిపడుతోంది.

వీరి వ్యాఖ్యలు కాంగ్రెస్ ఖండించకపోవడం చూస్తే. . .వీళ్ళు ఇదే కుట్రకు భారత్ లో తెరలేపుతున్నారా అంటూ మండిపడింది. వీరిపై దేశ ద్రోహం కేసు నమోదు చేసి విచారించి, కుట్రలకు పాల్పడే యత్నాలను అడ్డుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నారు. 

నిత్యం లక్షలాది మంది బంగ్లాదేశీయులకు ఉచితంగా అన్నప్రసాదం పంపిణీ చేస్తున్న

మెహెర్ పుర లోని ఇస్కాన్ దేవాలయాన్ని నిలువెత్తునా దహనం చేసేసారు. ఎంతో అందమైన భవనాలు ఈ మతోన్మాదుల దాడులకు ఆహుతి అయ్యి, బొగ్గు ముక్కలు గా మారిపోయాయి. వీటిపై మాట్లాడేందుకు ఎత్తేందుకు ఒక్కడికి కూడా నోరు రాలేదు. ఇదీ హిందువుల పట్ల సమాజానికి ఉన్న కృతజ్ఞతా.  

బాంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దౌర్జన్యాలను

కేవలం బీజేపీ, దాని అనుబంధ సంఘాలు తప్ప మరొక పార్టీ ఖండించిన దాఖలాలు లేవని హిందూ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ దేశంలో హిందువులు అంటే కనీసం మనుషులుగా కూడా గుర్తించడం లేదని, కేవలం వాళ్లకి ఓట్లు వేసే బానిసలుగా భావిస్తున్న ఈ సమాజానికి గట్టిగా బుద్ది చెప్పేందుకు హిందూ సమాజం ఏకత్రాటిపైకి రావాలని

పిలుపునిస్తున్నాయి. 

నవరంధ్రాలు మూసుకున్న మీడియా. .

బాంగ్లాదేశ్ లో జరుగుతున్న దౌర్జన్యాలపై ఖండించేందుకు, కేవలం కొన్ని జాతీయవాద మీడియా సంస్థలు, సోషల్ మీడియా లు మాత్రమే కథనాలు ప్రసారం చేస్తున్నాయని తెలియచేస్తున్నాయి. 

హిందూ మహిళలు తమపై జరుగుతున్న అఘాయిత్యాలను వీడియో ల ద్వారా

తెలియచేస్తూ రక్షించాలని అని ఆర్తనాదాలు చేస్తున్నా... ఈ సోల్డ్ మీడియా సంస్థలు ఖండించక పోగా, బాంగ్లాదేశ్ లో హిందువులను మతోన్మాదులు రక్షణ కల్పిస్తున్నారంటూ విపరీత ప్రచారం చేస్తున్నారని, వీళ్ళలో మానవత్వం మచ్చుకైనా కనపడడం లేదని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. 

ప్రపంచం యావత్తు హిందువులకు వ్యతిరేకంగా

మారిందని, వీళ్ళ ఓట్లతో గెలిచినా నీచ రాజకీయ పార్టీలకు సైతం కనీసం కృతజ్ఞతా లేదని, వీళ్ళందరికీ గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చాయి. 

అతి త్వరగా బంగ్లాలో సానుకూల పరిస్థితులు రావాలని, హిందూ సమాజం యధావిధిగా జీవనం సాగించాలని ఆశాభావం వ్యక్తం చేసారు. దీనికి భారత ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న ప్రయత్నాలకు

సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.  

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam