DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బంగ్లా లో లాంటి ఉద్యమం భారత్ లో జరిగితే ఎవరికీ నష్టం?

*బంగ్లా ఉద్యమం కారణాలు ఏంటి? దోషులు ఎవరు?*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*

*విశాఖపట్నం, ఆగస్టు 12, 2024 (డిఎన్ఎస్):* బాంగ్లాదేశ్ లో జరిగిన ఉద్యమం భారత్ లో కూడా జరుగుతుంది అని కాంగ్రెస్ నేతలు సల్మాన్ ఖుర్షిద్, సజ్జన్ సింగ్ వర్మలు ప్రకటించినా కాంగ్రెస్ ఖండించ లేదు. అంటే. . పార్టీ అభిప్రాయాన్నే

వీళ్ళు చెప్పారు. అలంటి ఉద్యమమే భారత్ లో జరిగితే మొత్తానికి తుడిచిపెట్టుకుపోయేది మాత్రం కాంగ్రెస్, దాని మిత్ర చతుష్టయం అని రాజకీయ నిపుణులు చెప్తున్నారు. బాంగ్లాదేశ్ లో జరిగిన ఉద్యమానికి గల ప్రధాన కారణాలు ఇవే. . 

1 . ఈ ఉద్యమం బాంగ్లాదేశ్ లో ఏళ్ళ తరబడి పాతుకుపోయిన వారసత్వ పాలనా కు వ్యతిరేకంగా, వాళ్లకి దేశ

బహిష్కరణ విధించాలి అని జరిగింది. 
ఇది భారత్ కు అన్వయించుకుంటే. . ఇక్కడ వారసత్వ పాలనా 1947 నుంచి 2014 వరకూ దశాబ్దాల తరబడి అధికారం లో ఉన్నది కాంగ్రెస్. సమాజ్వాదీ పార్టీ, ఆర్ జెడి, ఎంఐఎం ఇలా ప్రతిపక్ష పార్టీలు.
 బీజేపీ అధికారం లో ఉన్నది తక్కువ కాలం. పైగా ఎవ్వరి కుటుంబ సభ్యులు అధికారం లో కాదు కదా కనీసం చట్ట సభల్లో లేరు.

మోడీ కుటుంబానికి రాజకీయాలతో సంబంధమే లేదు.  
ఉద్యమం జరిగితే కాంగ్రెస్ సహా ఇది కూటమికి దేశం నుంచి బయటకు వెళ్ళవలసి వస్తుందేమో. 

2  ఈ ఉద్యమం దేశంలో అవినీతి పాలనా / స్కాం లకు వ్యతిరేకంగా జరిగింది. బాంగ్లాదేశ్ లో    అధికార అవామీ లీగ్ సభ్యులు చాలా స్కాం ల్లో పాల్గొన్నారు. దీనికి వ్యతిరేకంగా ఉద్యమం

జరిగింది.

నరేంద్ర మోడీ పాలనలో ఏ ఒక్క స్కాం కూడా  జరిగిన దాఖలాలు లేవు. 
పైగా కాంగ్రెస్, యుపిఎ, పరిపాలన మొత్తం కుంభకోణాలు, స్కాం ల మయంగానే ఉంది. దాణా స్కాం లో లాలూ ప్రసాద్ దోషిగా తేలి జైల్లో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడే ఏకంగా లిక్కర్ స్కాం లో దోషిగా ఉన్నాడు. అఖిలేష్ యాదవ్ లాప్టాప్ స్కాం, 
/> కాంగ్రెస్ పాలనా లో ఏకంగా బోఫోర్స్ స్కాం,  2 జి స్కాం నుంచి మొదలు, బొగ్గు, ఆగస్టు వెస్ట్ ల్యాండ్  హెలికాఫ్టర్ ల స్కాం, సబ్ మెరైన్ స్కాం,  తత్ర ట్రక్ స్కాం, కామన్ వెల్త్ గేమ్స్ స్కాం, ఆదర్శ్ స్కాం, ఐపీఎల్ స్కాం, స్టాంప్  పేపర్ స్కాం, ప్రోవిడెంట్ ఫండ్ స్కాం, అన్నింటికీ మించి నేషనల్ హెరాల్డ్ స్కాం ఇలా కాంగ్రెస్ పరిపాలన

మొత్తం అన్నీ స్కాం లే కనపడుతున్నాయి అని రాజకీయ నిపుణులు తెలియచేస్తున్నారు.  
 
3  బంగ్లా దేశ్ ప్రభుత్వం పై మూడవ ఆరోపణ :  మైనారిటీలుగా ఉన్న హిందువులకు అర్హత, చట్ట పరిధి మించి ఎక్కువ సదుపాయాలు దోచిపెట్టారు అన్నది ప్రధానమైన ఆరోపణ. అక్కడ హిందువులు మైనారిటీ. 
అదే భారత్ పరిధిలో హిందువులు మెజారిటీ.

అయినప్పడికి హిందువులు ద్వితీయ శ్రేణి పౌరులుగానే ఉన్నారు. ముస్లిం లకు భారత్ లో ఇచ్చిన సదుపాయాలు ప్రపంచంలో ఎక్కడా ముస్లిం దేశం లో కూడా ఇవ్వడం లేదు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ  పాలనలో దేశం లో అందరికి ఒకే తరహా సహాయం అందుతోంది. 
ఆ తరహా మైనారిటీ అప్పీజ్ మెంట్ ద్వారా ముస్లిం లకు అతి దారుణంగా అనుకూల చట్టాలు చేసింది

కాంగ్రెస్ మాత్రమే అని రాజకీయ నిపుణులు తెలియచేస్తున్నారు. 
  
4  ఇక నాల్గవ అంశం. బంగ్లా దేశ్ లో భారత్ వ్యతిరేక ఆందోళన జరిగింది. గో బ్యాక్ భారత్ అని జమాతే ఇస్లాం ఉద్యమం పిలుపు ఇచ్చింది. 
అలాంటి ఉద్యమమే భారత్ లో చెయ్యాలి అంటే.  గో బ్యాక్ బాంగ్లాదేశ్ అని జరగాలి. అసలు బాంగ్లాదేశ్ నుంచి భారత్ కు వచ్చిన లాభం

ఏంటి?
  పైగా బాంగ్లాదేశ్ నుంచి అక్రమం గా వచ్చిన రోహింగ్యాలకు దొంగచాటుగా ఆశ్రయం ఇచ్చింది ఇండి కూటమి పార్టీలే.  ఇప్పుడు గో బ్యాక్ బాంగ్లాదేశ్ అని ఉద్యమం చేస్తే ఇండి కూటమి పార్టీలే అసలు గొండలు అని బయట పడుతుంది అని రాజకీయ నిపుణులు తెలియచేస్తున్నారు.  

అసలు బాంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా ఆందోళన చెయ్యవలసిన

అవసరం భారత్ కు ఎందుకు ఉంటుంది?  ఇక్కడ చేస్తే బాంగ్లాదేశ్ వ్యతిరేక ఆందోళన చెయ్యాలి. అసలు ఎందుకు చెయ్యాలి? కారణం, చెప్పాల్సింది ఇండి కూటమే.  

బీజేపీ కి బాంగ్లాదేశ్ మీద వ్యతిరేకత లేదు. అక్కడ బంగ్లాదేశ్ లో జరిగిన ఆందోళనలపై బీజేపీ నిరసనలు చేసింది తప్ప  కాంగ్రేస్ కనీసం నోటు కూడా విప్పలేదు. దీని అసలు గుణం దేశ

ప్రజలకు తెలిసిపోయింది. రానున్నది గడ్డు కాలమే. 

బంగ్లా తరహా లో ఉద్యమం భారత్ లో చెయ్యాలి అని చూస్తే పూర్తిగా నష్టపోయేది హిందూ వ్యతిరేక దుష్ట చతుష్టయ పార్టీలేనని అని రాజకీయ నిపుణులు తెలియచేస్తున్నారు. 

అన్నింటికీ మించి అతి ముఖ్యమైన అంశం ఇదే. ..

5  బంగ్లాదేశ్ లో విద్యార్థులు ఉద్యమం

చేసింది దేశంలో విపరీతంగా పేరుకు పోయిన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చేసారు. తద్వారా తాము నష్టపోతున్నామని లక్షలాది మంది విద్యార్థులు రోడ్డెక్కి నిరసనలు చేసారు. 

భారత్ లో కూడా ఇలాంటి ఉద్యమం జరుగుతుంది అని కాంగ్రెస్ నేతలు, ఇతర ఇండి కూటమి పార్టీలు బహిరంగ ప్రకటనలే చేస్తున్నాయి. అదే తరహా ఉద్యమం చెయ్యడం మొదలు

పెడితే వీళ్ళు మద్దతు ఇస్తారా? అదే జరిగితే వీళ్ళ ఓటు బ్యాంకు సంగతి సరే, .. కాంగ్రెస్ సహా. మొత్తం  ప్రతిపక్ష పార్టీలు అన్ని ఆవిరైపోతాయి. 

అంటే నిజంగా వీళ్ళు కోరుకునే ఉద్యమం ఇదే అయితే. . దేశంలోని రిజర్వేషన్ల బారి పడి జీవితాలు నష్టపోతున్న అగ్రవర్ణాలు అన్ని వీళ్లకు వెన్నంటే ఉంటాయి. 

ఇది కాక వేరే

రహస్య ఎజెండా ఇంకేమైనా ఉంటె మాత్రం వీళ్ళ సమాధి వీళ్ళు కట్టుకున్నట్టే. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam