DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టంగుటూరి ప్రకాశం జీవితాన్ని రాజకీయ పార్టీలు ఆదర్శంగా తీసుకోవాలి

*మాజీ సీఎం టంగుటూరి కి బ్రాహ్మణ సంఘాల ఘన నివాళి* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार)*

*విశాఖపట్నం, ఆగస్టు 23, 2024 (డిఎన్ఎస్):* ప్రజా సేవకోసమే సర్వస్వాన్ని త్యాగం చేసిన 
మహనీయులు, ప్రకాశం పంతులు జీవితాన్ని నేటి రాజకీయ పార్టీలు, నేతలు ఆదర్శనంగా తీసుకోవాలని వైజాగ్ బ్రాహ్మణ వెల్ఫేర్ సొసైటీ గౌరవ

అధ్యక్షులు టి ఎస్ ఆర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. శుక్రవారం  ఆంధ్ర ప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు జయంతి ని పురస్కరించుకు విశాఖపట్నం లోని మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని ప్రకాశం విగ్రహం వద్ద నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అత్యంత కడు పేదరికం నుంచి వచ్చిన ప్రకాశం తన అపార

మేధాసంపత్తితో బారిస్టర్ చదివి, కోట్లాది రూపాయలు సంపాదించారన్నారు. నాటి స్వాతంత్య్ర పోరాట సమయంలో నాటి నాయకులూ ఇచ్చిన పిలుపు మేరకు తన యావదాస్తిని ప్రజలకు అర్పించారన్నారు. తెలుగు భాష మాట్లాడే ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్న సమయంలో 1946 లో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా పనిచేసారు. ప్రత్యేక

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ఆయన పదవి దిగే నాటికి చిల్లు గవ్వకూడా చేతిలో లేదు. బ్యాంకు బాలన్స్ లు లేవు. ఒక రైల్వే ప్లాట్ ఫారం సాధారణ ప్రయాణీకుని వలే జీవనం సాగించారు. స్థానికులు గుర్తించి భోజనం ఏర్పాటు చేసేనాటికి భోజనం చేసి మూడు రోజులు అయ్యింది అని ఆయనే చెప్పడం

అందరిని కలిచి వేసిందన్నారు. 
ఎంతో ఉన్నత మైన జీవనాన్ని గడిపి అద్భుతమైన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భవితకు పునాది వేసిన టంగుటూరి ప్రకాశం అందరికి ఆదర్శ వంతుడని తెలిపారు. 

సంస్థ అధ్యక్షులు కావూరు చరణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కి ప్రభుత్వాలు తగిన గౌరవం ఇవ్వాలని సూచించారు. ఆయన జయంతి,

వర్దంతిలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని కోరారు. 

ఈ కార్యక్రమం లో వైజాగ్ బ్రాహ్మణ వేల్ఫేర్ సొసైటీ సభ్యులు న్యాయవాది కె నరసింహ మూర్తి, హనుమంతరావు, ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ ఐక్య వేదిక కన్వీనర్ సాయిరాం, గణేష్,  తదితరులు  పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam