DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శివ ప్రసాద్ ఊల పాట తో విశాఖ ను ఉర్రూతలూగించారు

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार)*

*విశాఖపట్నం, ఆగస్టు 26, 2024 (డిఎన్ఎస్):* ఎవరైనా ఒక 30 సెకన్లు పాటు ఈల వేస్తె మామూలుగా చూస్తాం. రెండు నిమిషాల పాటు ఈల వేస్తె చిత్రంగా చూస్తాం. అదే రెండు గంటల సమయం ఏకంగా సంగీత కచేరి చేస్తే. . .అద్భుతం, మహాద్భుతం.  ఇలాంటి అద్భుతానికే విశాఖపట్నం కళాభారతి వేదికగా

నిలిచింది. 

విశాఖపట్నం లోని కళాభారతి కల ప్రాంగణం లో  విశాఖ మ్యూజికల్ డాన్స్ అకాడమీ నిర్వహిస్తున్న ఆరు రోజుల జాతీయ పురస్కార సంగీత, నృత్య, నాటక వార్షిక ఉత్సవాల్లో మూడవ రోజు డా. కే. శివప్రసాద్ ఈల తో అనర్గళంగా కర్ణాటక సంగీత కచేరి చేసారు. ఆద్యంతం ఆహుతులు ఆనంద, ఆశ్చర్యలకు లోనయ్యారు. ఇదే ఈలతో రాగాలాపన,

స్వరకల్పనలతో ఈల పాట 2 గంటాలు పాటు కచేరి చేసి అందర్నీ ఆశ్చర్య పరిచి ప్రేక్షకుల కరతాల ధ్వనులతో హాలు మారు మ్రాగి పోయింది..

సంగీత కచేరి తోడి రాగం లో వర్ణం తో మొదలయ్యింది. అనంతరం విశ్వ సుపరిచితమైన వాతాపిగణ పత్తింభజేహం కీర్తన ముత్తుస్వామి దీక్షితార్ కృతి, తదుపరి గానమూర్తె రాగం- గానమూర్తె ( త్యాగరాజ కీర్తన ),

బిలహరి రాగం లో దొరకునా ఎటువంటి సేవ అంటూ సంగీత సేవ కొనసాగించారు. కచేరి కొనసాగింపుగా  హంసనాదం రాగం లో బంటురీతి కోలువియ్యవయ్య రామ అంటూ త్యాగరాజ కృతి తో సాక్షాత్తు శ్రీరామచంద్రుని ప్రార్ధించారు. 
శ్రీ కృష్ణాష్టమి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని మోహన రాగం లో ఊతుకాడు వెంకటసుబ్బయ్య రచన  స్వాగతం కృష్ణా

కీర్తనకు ప్రేక్షకులు సైతం గొంతు కలిపారు.  
తదుపరి మరకత మణిమయ చేలా ( ఆరభి రాగం.. ఊతుక్కాడు వెంకటసుబ్బయ్య రచన), థిల్లాన ( బృందావన సారంగి - రాగం లో బాలమురళీకృష్ణ రచన ), సర్వం బ్రహ్మమయం... ( మధువంతి రాగం.... సదాశివ బ్రహ్మేంద్ర రచన ) ఆద్యంతం అలరించాయి. 

సంగీత సాధకులు, అభిమానులకే కాక, సామాన్య పామరులకు సైతం సుపరిచితమైన

నగుమోము... గానలేని...అంటూ అభేరి రాగం లో చేసిన  త్యాగరాజ కీర్తన మొత్తం కచేరి అంతటికి అత్యుత్తమంగా నిలిచింది. 

ఒక్కొక్క కీర్తన కి ప్రేక్షకులు వారు ఆనందాశ్చారాలను చప్పట్లతో వ్యక్తపరచడంతో కళాకారులు మరింత ఉత్సాహంతోకచేరి కొనసాగించేరు. ఈ కచేరి కి వైయలిన్ పై విద్వాన్ మావుడూరి సత్యనారాయణ శర్మ,  మృదంగం పై..

రామకృష్ణ, తబలాపై గుణరంజన్, కీ బోర్డు పై లాల్ కృష్ణ, మోర్సింగ్ పై విద్వాన్ వెంకటేష్ సహకారం అందించారు. 

మూడవ రోజు సభ కార్యక్రమం లో భారత  నావికా దళ అధికారి ఎం. మురళి మోహన్ రాజు, వీఎండీఏ అధ్యక్షులు ఎం ఎస్ ఎన్ రాజు,  కార్యదర్శి డా. జి ఆర్ కె ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam