DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేవాదాయ దోపిడీ శాఖను రద్దు చెయ్యాలి: హిందూ సంఘాలు

*హిందూ గుళ్లను మా హిందువులకే అప్పగించాలి: విహెచ్ పి*  

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*

*విశాఖపట్నం, సెప్టెంబర్, 21, 2024 (డిఎన్ఎస్):* ప్రభుత్వ కబంద హస్తాల్లో ఉన్న మా హిందూ దేవాలయాలను తక్షణం విముక్తి కల్గించి మా హిందూ సంఘాలకే అప్పగించాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర మఠ్ మందిర్ టోలి పూడిపెద్ది

శర్మ డిమాండ్ చేసారు. శనివారం విశాఖ లోని జివిఎంసి ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన నిరసన ల్లో అయన దేవాదాయ శాఖా పై తీవ్రంగా విరుచుకు పడ్డారు.  ఆంధ్ర ప్రదేశ్ లోని దేవాదాయ శాఖలో కేవలం హిందువులే పనిచేయాలని, అలాంటిది అన్యమతస్తులు వందల సంఖ్యలోనే ఉన్నారన్నారు. హిందువు నుంచి క్రైస్తవం లోకి మతం మారిన వాళ్ళు ఏమాత్రం సిగ్గు

లేకుండా సర్వీస్ రిజిస్టర్ లో హిందువుగానే పెట్టుకుని లక్షలాది రూపాయలు జీతాలు తీసుకుంటున్నారన్నారు. దేవాదాయ శాఖా కేవలం హిందువుల కోసం మాత్రమే ఉందని, హిందువుల గుళ్ల నుంచి వచ్చిన హుండీ డబ్బులతో వీళ్ళు లక్షల రూపాయలు దోచుకుతింటున్నారన్నారు. హిందువులు అంటే గౌరవం లేదు, హిందూ దేవీదేవతలు అంటే నమ్మకం లేదు. అయినా కూడా

సిగ్గు లేకుండా హిందూ దేవాదాయ శాఖా లో ఉద్యోగాలు చేస్తూ దేవాలయాలను సర్వ నాశనం చేస్తున్నారన్నారు. దీనికి నిదర్శనమే తిరుమల దేవాలయంలో ప్రసాదాలకోసం జంతు కళేబరాల తైలం వినియోగించారు అంటే ఈ మతం మారిన అధికారులు, ఉద్యోగులు, పాలకులే కారణం అన్నారు. 

బీజేపీ రాష్ట్ర ధార్మిక సెల్ కో కన్వీనర్ విజయ్ శంకర్ ఫణి

మాట్లాడుతూ తిరుమలలో దైవ అపచారానికి కారణమైన వాళ్ళందరిని నడిరోడ్డుపై ఉరి తియ్యాలని డిమాండ్ చేసారు.  కోట్లాది రూపాయలు ఆదాయం వస్తున్నా ఈ హిందూ దేవాలయాలను తమ అధీనం లో పెట్టుకుని హిందువులను మనోభావాలు దెబ్బ తీస్తున్న ఏపీ దేవాదాయ శాఖా దోపిడీ శాఖా గా మారిపోయిందని, తక్షణం దీన్ని రద్దు చేసి మా హిందూ దేవాలయాలను మా హిందూ

సంఘాలకే అప్పగించాలని డిమాండ్ చేసారు. 

ఈ శాఖా నుంచి వచ్చిన డబ్బులు పాస్టర్లకి, ముల్లాలకి భృతి ఇవ్వడానికి సిగ్గు పడాలన్నారు. మా మనోభావాలు దెబ్బతీసిన ఈ దేవాదాయ దోపిడీ శాఖా ఇకపై ఉండరాదన్నారు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. 

వివిధ హిందూ సంఘాల ప్రతినిధులు, సాధువులు

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam