DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రతి విద్యార్థి మేధస్సు తో వినూత్న పరిశోధనలు చెయ్యాలి: చంద్రబాబు 

విశాఖపట్నం, ఆగస్టు 23 ,2018 (DNS Online ): ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రతి విద్యార్థి తమ మేధస్సు తో పరిశోధనలు చెయ్యాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. గురువారం ఆంధ్ర

విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన జ్ఞానభేరి కార్యక్రమంలో ఆయన విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు రాణించాలని, తాము

సముపార్జించిన మేధోశక్తిని క్షేత్రస్థాయిలో ఉపయోగిస్తూ దేశాభివృద్ధికి ఉపయోగించే విధంగా ఫలితాలు సాధించాలన్నారు. విద్యార్థులకు అవసరమైన వనరులు కూర్చడం తన

వంతు అని బంగారు భవిష్యత్తుకు కృషి చేస్తూ ముందుకు వెళ్లడం మీ బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతివారు ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలన్నారు. సమైక్యాంధ్రలో తాను

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాదు మీద దృష్టి పెట్టి నిజం తయారు చేశాం అన్నారు. ఐటీపై ప్రత్యేక శ్రద్ధతో సిటీని నిర్మించామన్నారు. అన్ని రంగాలలో

విద్యాభివృద్ధికి కృషి చేశానని తెలిపారు. దానిమూలంగా అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో తెలుగువారు తిరుగులేని ఆధిపత్యం సంపాదించారని గుర్తు చేశారు. ఐటీ తో మూడవ

పారిశ్రామిక విప్లవం వచ్చిందని పేర్కొంటూ మనం వినూత్న ప్రయోగాలు చేసే దశలో ఉన్నామని, వినూత్నంగా ఆలోచించాలన్నారు. ఆవిష్కరణ, సృజనాత్మక శక్తులను మేధోశక్తి,

ఊహాత్మక తను మేళవించి ఆర్థికాభివృద్ధి దిశలో కరణలు చేయాలని సూచించారు. రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆత్మబలంతో ముందడుగు వేయాలన్నారు. అందుకు అవసరమైన

వనరులను తాను రూపొందిస్తానని వెల్లడించారు. గతంలో హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఉక్కు సంకల్పంతో కృషిచేసి విశాఖను ఉత్తమ నగరంగా తీర్చిదిద్దుకున్నామన్నారు.

రాష్ట్ర అభివృద్ధికి 18 అంశాల లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు.

పోలవరం రాష్ట్రానికి జీవనాడి అని చెప్తూ పోలవరం ప్రాజెక్టు

పూర్తి చేయడమే తన జీవితాశయమని తెలిపారు. పట్టిసీమ ఎత్తిపోతల పూర్తిచేసి కృష్ణానది గోదావరి అనుసంధానం చేశామని, ఇంకా కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వడమే కాకుండా

రాయలసీమను సస్యశ్యామలం చేశామని పేర్కొన్నారు. గోదావరిలో వృధాగా పోతున్న నీటిని ఒడిసి పడితే రాష్ట్రం సుసంపన్నం అవుతుందన్నారు. వర్షపునీటిని ఎటో చేసి భూగర్భ

జలాలు పెంపొందించాలి అన్నారు. నదుల అనుసంధానం తో ప్రాజెక్టుల ద్వారా అన్ని చెరువులకు జలాశయాలకు నీరందించే ప్రణాళికలు రూపొందించామన్నారు. రాష్ట్రంలో 25 వేల

కిలోమీటర్లు సీసీ రోడ్లు వేశామని, చెత్తతో సంపద తయారీ మూలంగా గ్రామాలకు ఆదాయం విద్యుత్ ఉత్పత్తి వస్తుందన్నారు. దృఢ సంకల్పంతో, నూతన ఆలోచనలతో

సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేయాలన్నారు. దుబాయ్ జపాన్ కొరియాల అభివృద్ధిని ఈ సందర్భంగా ఉటంకించారు.

ప్రతి విద్యార్థి ఇష్టపడి చదవాలని, అవి శాఖను నాలెడ్జ్

హబ్ గా రూపొందించాలన్నారు. తాము సంపాదించిన జ్ఞానాన్ని ఇం
క్యూ బేషన్ సెంటర్స్ ద్వారా చర్చించు కోవాలన్నారు. రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ హబ్ గా

తీర్చిదిద్దాలన్నారు. దీనికి జ్ఞాన బేరి నాంది పలకాలన్నారు. గ్రామాల్లో ఆదాయాన్ని పెంచే విధంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రకృతి వనరుల లభ్యత, కృతి

వైపరీత్యాలను గూర్చి ముందుగా తెలుసు కోవాలన్నారు. సీఎం డ్యాష్ బోర్డ్ ద్వారా గేమ్స్ రోజుకు 15 లక్షలమంది నుండి ప్రజాభిప్రాయం వ్యాకరణ చేస్తున్నామన్నారు.

ప్రత్యేక యాప్ ద్వారా ఎటువంటి కష్టంలేకుండా సంక్షేమ కార్యక్రమాలను రూపొందించడం. జరుగుతుందన్నారు. స్వచ్ఛమైన గాలి నీరు పోలిక వసతులను కల్పించడం ద్వారా

రాష్ట్రాన్ని నివాసయోగ్యంగా తయారు చేస్తామన్నారు.

మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రసంగిస్తూ రాష్ట్ర విభజన మూలంగా ఏర్పడిన బడ్జెట్

లోటు ను లెక్కచేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విద్యారంగానికి ఎన్నడూ లేనంతగా నిధులు కేటాయించారని పేర్కొన్నారు. కవులు రాష్ట్ర బడ్జెట్లో 15 శాతం రూ 25 వేల

మూడు కోట్ల రూపాయలను విద్యాశాఖకు కేటాయించారని తెలిపారు. విద్య సమాజాన్ని మారుస్తుంది అన్నారు.
తరువాత ముఖ్యమంత్రి అగ్రికల్చర్ విజన్ ఇన్ ఏపీ అనే బుక్లెట్ను

ఆవిష్కరించారు.ప్రథమ స్థానం పొందిన జాడ కళాశాలకు చెందిన తులసి అనే విద్యార్థి అనర్గళంగా ప్రసంగించడాన్ని చంద్రబాబునాయుడు మెచ్చుకున్నారు. ఐఏఎస్ ఆఫీసర్

అవ్వాలన్న మీ ఆశయాన్ని ప్రశంసించారు. అనంతరం వివిధ సాంస్కృతిక, వ్యాసరచన, వక్తృత్వ, ఆటల, పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు జ్ఞాపికలను బహూకరించారు. సభ

ప్రారంభంలో స్వర్గీయ టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి ముఖ్యమంత్రి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆంధ్ర

విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి.నాగేశ్వరరావు, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యనాథ్దాస్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ భవానీ భాస్కర్, శాసనసభ్యులు,

రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్లు తదితరులు పాల్గొన్నారు.

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #jnana bheri  #visakhapatnam  #vizag  #andhra pradesh  #ap #government  #chandra babu naidu  #andhra university  #au  #chandrababu naidu

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam