DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆచార్యులు అంటే ఎవరు ? ఎవరిని పిలవాలి. ఇప్పడివారిలో అర్హులెందరు?

ఆచార్యులు అంటే ఎవరు ? ఎవరిని పిలవాలి.

విశాఖపట్నం, సెప్టెంబర్ 05, 2018 (డిఎన్ఎస్ ) : ఏ ఇద్దరు ఎదురైనా గురూ అనో, మాష్టారు అనో లేదా గురువు గారూ అనో టీచర్ అనో ఇలా

పిలుపులు వినపడుతుంటాయి. అసలు గురువు లేదా ఆచార్యులు అనో అంటే ఎవరు? ఎవరిని పిలవాలి? ఆలా పిలిపించుకోడానికి ఎవరు అర్హులు ?  à°‡à°¦à°¿ చాలా మంది తెలుసుకోవాల్సిన అవసరమైన

అంశం.
ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే వారిని టీచర్ అని, విశ్వ విద్యాలయం లో పనిచేసేవారిని ఆచార్య అని తమ పేరుముందు రాసేసుకుంటున్నారు. విద్యా సంస్థల్లో

పనిచేసేవారంతా ఆచార్యులు, అధ్యాపకులేనా ?

ఆచార్య అనే పద అర్ధాన్ని సంపూర్ణంగా ఆకళింపు చేసుకుని, సార్ధకత చేకూర్చే వారిని ఆచార్య అని పిలవాలి. ఆలా ఆచరణలో

నడిచేవారంతా ఉత్తములే. అలాటివారినే ఆచార్యులు అని పిలవాలి. వారి కార్యాచరణలో తీర్చిదిద్దబడిన విద్యార్థులు దేశానికి ఉత్తమ సేవలుచేసినప్పుడే వీరి

ఆచార్యాత్వానికి సార్ధకత చేకూరినట్టు.

అదృష్టం కొద్దీ ఎదో విద్యా సంస్థ లో ఉద్యోగం వచ్చేస్తే, రోజుకు ఓ రెండు గంటల పాటు తరగతి గదుల్లో కాలక్షేపం చేసేస్తే

ఆచార్య అని పిలిపించుకునేందుకు అర్హులై పోతారా. పనికిరాని విద్యా విధానాల ద్వారా జారితే పరీక్షల్లో రెండు ముక్కలు ముక్కున బట్టి, పరీక్షల్లో తుమ్మి నాలుగు

మార్కులు తెచ్చేసుకుని ఉద్యోగాలు పొందేవారు కొందరైతే, సంపూర్ణ అర్హత లేకపోయినా ఈ దేశ చట్టాల ద్వారా ఏడున్నర దశాబ్దాలుగా సంక్రమించిన భారీ బంపర్ గా వచ్చిన

రిజర్వేషన్ అనే జాక్ పాటు వల్లన ఉద్యోగం తెచ్చేసుకుని, విధుల్లో చేరిపోతున్నారు. అసలు వీరిలో ఎంతమందికి విద్యాబోధన చేసే అర్హత ఉంది ( రిజర్వేషన్ ఉన్నా, లేకున్నా

సరే ).  à°’à°• మర మనుషుల్లా à°—à°‚à°Ÿ కొట్టిన దగ్గర నుంచి, మళ్ళీ à°—à°‚à°Ÿ కొట్టే వరకూ తరగతి గదుల్లో కాలక్షేపం చేస్తున్న వారిలో ఎంతమంది విద్యార్థులకు నిజంగా మార్గదర్శకులుగా

మారుతున్నారు. అనేది వేళ్ళ మీద లెక్కించే అంశం. 

ఆచార్య అంటే : . 

ఆచార్య అనేది పేరుకు ముందు తగిలించుకునే ఒక పదం మాత్రమే కాదు. అసలు ఆచార్య అంటే అర్ధం

ఏంటి ?  à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°¥à±à°²à°•à± తానూ ఏది బోధిస్తారో అదే విషయాన్నీ ముందుగా తానూ ఆచరించి చూపించి సన్మార్గంలో నడిచే వారు,  à°¤à°® విద్యార్థులను కూడా అదే మార్గంలో నడిచేలా

చూసే వారు అని అర్ధం.  à°ˆ పదానికి à°’à°• ప్రాభవం, వైభవం ఉంది. ఎవడు పడితే వాడు ఆచార్య అని పిలిపించుకోడానికి అర్హుడు కాదు. అంతే గానీ యూనివర్సిటీల్లో పనిచేసే ప్రతీ

వాడు ఆచార్య అని పిలిపించుకోడానికి అనర్హుడే. 

ఎదో ఒక డిగ్రీ (అత్తెసరు మార్కుల తోనైనా సరే), తదుపరి పరిశోధన పేరిట ఒక చూచికాపీ కొట్టేసిన పుస్తకం తో ( అందరూ

కాదు) ఒక పిహెచ్ డి పత్రం కూడా పోండి, నానా విధాలా రూపాల ద్వారా విద్యాలయాల్లో చేరిపోయి వేలకు వేల రూపాయల నెల సరి వేతనాలు తమ ఖాతాలో వేసుకుంటున్నారు. పైగా తమ పేరుకు

ముందు ఆచార్య అని చేర్చేసుకుంటున్నారు. 

ప్రజలకు, విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉండాలి అంటే ప్రతి వ్యక్తి తాము చెప్పే పని లేదా విషయాన్ని తాము ముందుగా

ఆచరించి, పాటించిన తర్వాతే ఇతరులకు చెప్పాల్సి ఉంటుంది. అలాంటివారిని ఆచార్యులు అని పిలవాలి. దీనికి ప్రధాన ఉదాహరణ : అది శంకరాచార్య, భగవద్రామానుజా చార్య, రామకృష్ణ

పరమహంస, లాంటి వారు. వారి దగ్గరకి వచ్చే సందర్శకులకు à°’à°• విషయం చెప్పాలి అంటే, దాన్ని ముందుగా వారు ఆచరించే వారు. 

అంతే తప్ప ఒక డిగ్రీ, పిహెచ్ డి ఉన్న ప్రతీ

వాడినీ ఆచార్య అని పిలవకూడదు. విద్యార్థులతో కలిసి ధూమపానం చేసేవారు, మద్యపానం సేవించే వారు, ఇతరత్రా సమాజం లో విద్వేషం కల్పించే సంఘ విద్రోహ పనులు చేసేవారు

ప్రస్తుతం కోకోల్లలుగానే ఉన్నారు. వీళ్లంతా ఆచార్యులు అయిపోతే సమాజంలో భావి తరాలు దేశానికి చీడపురుగులు à°—à°¾ తయారవ్వకుండా ఎలా ఉంటారు ?  à°’కప్పుడు నలంద, తక్షశిల

లాంటి విశ్వ విద్యాలయాలలో ఆచార్యులు బోధించిన అంశాలను ఆచరించిన విద్యార్థులు దేశ విదేశాల్లో అత్యున్నత హోదాల్లోకి చేరుకున్నారు. అదంతా అక్కడి ఆచార్యుల ఘనత,

ప్రభావమే. 

ఘనమైన చరిత్ర :-

à°…à°–à°‚à°¡ భరతం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో పుట్టిన అది శంకరాచార్య, భగవద్రామానుజులు లాంటి వాళ్ళ వల్ల  à°¸à°®à°¾à°œà°‚

ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లి, మంచి మార్గాన్ని ఆచరించారు. వేల సంవత్సరాలు గడిచినా నేటికీ వారు చూపించిన మార్గం లోనే ఈ భారత దేశం ప్రయాణిస్తోంది. ఎన్నో గురుకుల

పాఠశాలలు ఈ మార్గంలోనే నడుస్తూ వేలాది మంది చిన్నారులను భావిభారత ప్రతీకలు గా తీర్చిదిద్దుతున్నాయి.

మరి ఇప్పుడో :- 

మరి ఇప్పడి వారు చూపించే మార్గంలో

వెళ్తే ఈ దేశం సర్వనాశనం కాక తప్పదు. ఇప్పడికే సంఘ విద్రోహ శక్తులు తయారై, భారతీయ సంప్రదాయాలను నాశనం చెయ్యడం, భారత జాతి ఔన్నత్యాన్ని బ్రష్టుపట్టించడానికి

అధ్యాపకులే ప్రధాన కారణం. ముందు వీరు సరైన మార్గంలో ఉంటే విద్యార్థులు వీరినే అనుసరించే అవకాశం ఉంది. దీనికి ప్రధాన నిదర్శనమే. . భారత దేశం అత్యున్నత చట్ట సభ

పార్లమెంట్ పై దాడి చేసిన శత్రు దేశపు ఉగ్రవాదులకు మద్దతుగా, సహాయం చేసిన వారిలోనూ, ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న అనేక అసాంఘిక కార్యకలాపాలకూ, ప్రజలను

రెచ్చగొట్టి, దేశ సౌభ్రాతృత్వానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న ఘటనల్లోనూ, విద్యాలయాల్లో మహిళల పట్ల జరుగుతున్న లైంగిక దాడుల్లోనూ, కీలక పాత్ర పోషించే

వారిలో ప్రధానంగా ఉన్నవారి పేరుకి ముందు ఆచార్య అని ఉండడం కూడా సమాజం మొత్తం చూస్తోంది.  

ఈనాటికైనా పూర్వపు మహానుభావులు ఆచరించి చూపించిన సన్మార్గంలో

ప్రస్తుత తరం వారు నడిచి, ఆచరించి, తమ విద్యార్థులను దేశం గర్వించతగ్గ  à°‰à°¤à±à°¤à°® పౌరులుగా తీర్చిదిద్దుతారని ఆశిద్దాం. 

 

 

#dns  #dnsnews  #dns news  #dnsive  #dns live  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #acharya  #teachers  #upadhyaya 

#shankaracharya  #ramanujacharya

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam