DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇది భారతీయ భ్రష్టు పార్టీ లాగా మారిపోయింది. 

నోరెత్తకపోతే పార్టీ భూ స్థాపితమే : బీజేపీ క్యాడర్. 

విశాఖపట్నం, అక్టోబర్ 03, 2018 (DNS Online ): ఈ దేశం లో ఎన్నో ఘోరాలు, నేరాలు జరుగుతున్నా సరిదిద్దవలసిన భాద్యతపరమైన

హోదాలో ఉన్న భారతీయ జనతా పార్టీ చేపట్టిన ధృతరాష్ట్ర పాలన తో మొత్తం భారతీయ భ్రష్టు పార్టీ గా మారిపోయింది. ఇది ఎవరో ప్రతిపక్షాలు అంటున్న మాట కాదు. దశాబ్దాల కాలం

నుంచి పార్టీ నే నమ్ముకుని కరుడుకట్టిన కార్యకర్తలుగా పనిచేస్తున్న బీజేపీ తూర్పుగోదావరి క్యాడర్ చెప్తున్న మాట. హిందూ తత్వాన్ని విధ్వంసం చేసే విధంగా

వెలువడుతున్న కోర్టు తీర్పులపై స్పందిస్తూ  à°µà°¾à°°à°¿ మాటల్లోనే. . . .

ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే హిందూ భక్తుల

కోపాగ్నికీ ఒక జాతీయ పార్టీ కనుమరుగు అయ్యే ప్రమాదం ఉందని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ బీజేపీ కార్యకర్త పార్టీ నేతలను హెచ్చరిక సూచనలు చేశారు.

హిందూ వివాహ వ్యవస్థను చిన్నాభిన్నం చేసే విధంగా వివాహేతర సంబంధాలు తప్పు కాదు అంటూ à°’à°• తీర్పు ఇవ్వడం,  à°¹à°¿à°‚దూ ధర్మం, ఆచార వ్యవహారాలకు భిన్నంగా కేరళలో

అయ్యప్పస్వామి ఆలయ వ్యవహారం లో జోక్యం చేసుకుంటూ ఏ వయసు మహిళలైనా గుడిలోకి వెళ్ళచ్చు అంటూ ఇచ్చిన మరో తీర్పు. ఈ రెండు తీర్పుల ప్రభావం హిందూ సమాజం పై విపరీతం గా

పడిందని, తద్వారా రానున్న ఎన్నికల్లో వ్యతిరేక ప్రభావం చూపిస్తుందన్నారు. 
హిందూ సమాజం తప్పు పడుతున్నా, నేటికీ బీజేపీ నేతలు గానీ, కేంద్ర మంత్రులు గానీ,

రాష్ట్ర క్యాడర్ గానీ  à°Žà°µà°°à±‚ తప్పుపడుతూ స్పందించక పోవడం పై బీజేపీ కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. ఆచార వ్యవహారాలు కు భిన్నంగా వచ్చిన కోర్టు తీర్పుకు

వ్యతిరేకంగా లక్షలాది హిందూ జనవాహిని కదం త్రొక్కుతున్నట్టు తెలిపారు. ఈ దేశంలో రాజ్యాంగం, న్యాయ స్థానాలు పుట్టకముందే హిందూ ధర్మం ఉంది, ఆచార, వ్యవహారాలు, పురాణ

ఇతిహాసాలు వున్నాయని, వాటిని తప్పు పట్టడం అంటే పిల్ల వచ్చి గుడ్డును వెక్కిరించడం లాంటిదేనని మండిపడుతున్నారు. à°¸à°®à°¾à°¨à°¤à±à°µà°‚ అనే ప్రాతిపదికన దక్షిణాది లో అత్యంత

నియమ, నిష్ఠలు కలిగిన అయ్యప్పస్వామి ఆలయంలోకి అక్కడ ఆచార, వ్యవహారాలు కి భిన్నంగా ఇచ్చిన తీర్పు కోట్లాది హిందూభక్తుల మనోభావాలను గాయపర్చిందని, దీన్ని

సునిశితంగా చూడవలసిన పరిస్థితుల్లో వెలువడిన తీర్పు పై కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. 
కావున ఈమధ్య ఒక కేసులో ఆర్డినెన్స్ తెచ్చిన

మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం తక్షణమే  à°¹à°¿à°‚దూభక్తుల మనోభావాలు గాయపడకుండా అయ్యప్పస్వామి ఆలయ ఆచార ,వ్యవహారాలు à°•à°¿ అనుగుణంగా à°’à°• ఆర్డినెన్స్ తేవాల్సిన ఆవశ్యకత

ఎంతైనా వుందని బీజేపీ క్యాడర్ డిమాండ్ చేస్తోంది. à°‡à°ªà±à°ªà°Ÿà°¿à°•à±‡ కొంతమంది చేస్తున్న వికృత, వికార చేష్టలకు కేరళ రాష్ట్రం ప్రకృతి ప్రకోపానికి అతలాకుతలం అయ్యిన

విషయం మరువక ముందు కేంద్రం తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతోంది అని ఆవేదన వ్యక్తం చేశారు. 

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #bjp  #central government #union government  #court verdicts  #ordinances 
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam