DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జగన్ ను శంకరగిరి మాన్యం పట్టించేందుకేనా ఈ శల్య సారధ్యం ?

తుఫాను బాధితులకు జగన్ సహాయం ఏంటి ?

పక్క జిల్లా లోనే పాదయాత్ర. . . అయినా పట్టింపు లేదు ?

విశాఖపట్నం, అక్టోబర్ 12, 2018 (డిఎన్ఎస్ DNS Online) : ప్రభుత్వ వైఫల్యాలను

లక్ష్యంగా ప్రజా క్షేత్రం లో సాగవలసిన ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి గ్రహణం పట్టినట్టు పూర్తిగా వక్రమార్గం లో వెళ్ళడానికి పార్టీలో ఉన్న శల్య

సారధ్యమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పాదయాత్ర రూట్ మాప్ వేసే వాళ్ళు జగన్ ను పూర్తిగా అధ: పాతాళం లో తొక్కడానికి ప్రణాళిక వేసినట్టు తెలుస్తోంది. పార్టీ

వర్గాలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. 

ప్రజలందరి ఆశీర్వాదం ఉంటె వై ఎస్ జగన్ అను నేను....  à°…ని ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తా అంటూ ఉత్తర

కుమార ప్రగల్బాలు పలికే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,  à°† స్థాయికి తగ్గట్టు లక్షణాలు మాత్రం అలవాటు చేసుకోవడం లేదు. అంది వచ్చిన అవకాశాలను చేజార్చుకోడానికి ప్రధాన

కారణం à°—à°¾ ఇతరుల కోవర్టులు పార్టీలో కీలక పత్రాలు పోషించడం వల్లే జగన్ కు à°ˆ దుస్థితి పెట్టిందనే వ్యాఖ్యలకు బలం చేకూరుతోంది. 

ప్రణామం కాదు . ప్రజలతో

మమేకమవ్వాలి : 

ప్రజల కోసం కృషి చేస్తా అంటూ మాటలు చెప్పడం తప్ప, ప్రజలకు సహాయం చేసే లక్షణం మాత్రం లేనట్టు లేదు. టిట్లి తుఫాను కు శ్రీకాకుళం జిల్లా

అతలాకుతలం అయ్యిపోయింది. తుఫాను తాకిడికి సర్వం కోల్పోయిన జనం సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రక్కనే ఉన్న విజయనగరం జిల్లాలోనే వైఎస్సార్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర జరుగుతోంది. అయినా సరే పట్టింపు లేకుండా తన పాదయాత్ర తన కుండ బొజ్జ శ్రీరామ రక్షా అన్న

రీతిలో పట్టింపే లేకుండా రోడ్డు పట్టుకు తిరుగుతున్నాడు. ఈ శల్య సారధ్యం చేస్తున్న కోవర్టులను అదుపు చెయ్యక పొతే జగన్ ఎన్ని వేల కిలోమీటర్లు నడిచినా కాళ్ళ

నొప్పి, తల బొప్పి తప్ప ఒక్క ఓటు కూడా రాదు. à°’à°• పధకం ప్రకారం జగన్ ను తుంగలోకి తొక్కేందుకే à°ˆ శల్యులు కంకణం కట్టుకున్నారన్నది వాస్తవం గానే ఉంది. 

ప్రతి రోజు

జరిగే సభల్లో ప్రజల ఆశీర్వాదం ఉంటె వై ఎస్ జగన్ అను నేను.... అంటూ  à°®à±à°–్యమంత్రి à°—à°¾ ప్రమాణం చేస్తా అంటూ ప్రగల్బాలు పలుకుతూ జనాన్ని పోగేసుకు వచ్చే పార్టీ నేత à°•à°¿

తుఫాను బాధితులు కనపడడం లేదనుకుంటా. కనీసం ఒక్క కార్యకర్త కూడా ఈ కేంద్రాల్లో సహాయార్ధం వెళ్లిన దాఖలాలే లేవు. లక్షలు ఖర్చు చేసి సభలకు జనాన్ని పోగేసుకునే

బదులు, శ్రీకాకుళం తుఫాను బాధితులను ఆదుకునేందుకు వినియోగిస్తే. . . . అడక్కుండానే జనం ఓట్లు కుప్పలు పోసినట్టు పోస్తారు అనే కనీసం ఇంగితం కూడా పార్టీ నేతలకు

కలగలేదంటే ఈ పార్టీ పట్ల జనం లో సానుకూలత ఎలా వస్తుందో వైఎస్ జగన్ కె తెలియాలి. తుఫాను హెచ్చరికలు రెండు రోజులు ముందుగానే వచ్చినా, తన చిన్ని బొజ్జ శ్రీరామ రక్షా

అన్న రీతిలో జగన్ పాదయాత్ర చేసుకుంటూ. రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు ను తిట్టి పొయ్యడం తప్ప మరొకటి తెలియడం లేదు. 

సహాయం ఎక్కడ :

రాష్ట్ర ప్రభుత్వం

సంపూర్ణ సహాయం ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ, తుఫాను బాధితులు వేలల్లో ఉండడంతో తక్షణ సహాయం అందడం లేదు. ప్రభుత్వం చేసే సహాయానికి తోడుగా ప్రతిపక్షం కూడా తన వంతు

సహకారాన్ని ఆర్ధికంగానూ, ఆహార పదార్ధాలు, మానవ సహాయం కూడా అందించి ఉంటె. . . .ప్రజల్లో కొంత సానుభూతైనా కలిగేది. కనీసం స్థానిక నేతలు కూడా జగన్ వెంట తిరగడానికి

చూపించే శ్రద్ధ లో లక్షో వంతు ప్రజా సహాయానికి తిరిగి ఉంటె వాళ్ళు ఏ పార్టీ లో ఉన్న జనం గుర్తుంచుకుంటారు. వీళ్ళకి ఎప్పుడో జరిగే ఎన్నికల్లో ఓట్లు కావాలి, కానీ,

సహాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్న ప్రజలు మాత్రం అక్కరలేదు అన్నది వాస్తవం గానే ఉంది. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #tycoon  #titli  #ys jagan mohan reddy  #ysr congress  #srikakulam

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam