DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బిక్కవోలు సుబ్రహ్మణ్య షష్ఠి కోసం భారీ ఏర్పాట్లు :ఎమ్మెల్యే నల్లమిల్లి

రాత్రి బాణాసంచా పోటీలు, బిక్కవోలుకు అదనపు బస్సులు 

*(DNS Report: Bhanu Prasad, राष्ट्रवादी पत्रकार, Kakinada)*

కాకినాడ,  25, నవంబర్ 2024 ( డిఎన్ఎస్) : కాకినాడ జిల్లా బిక్కవోలు లో వెలసిన ప్రసిద్ధ  శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవం డిసెంబర్ 6 నుంచి జరుగనున్నాయి. ఈ

పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆహ్వాన పత్రిక మరియు ప్రచార గోడ పత్రిక లను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి ఆవిష్కరించారు. ఆలయ ప్రాంగణం లో జరిగిన కార్యక్రమం లో అయన మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాధాన్యత చెందిన ఈ ఉత్సవాలలో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారన్నారు. భక్తులకు

ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రభుత్వం అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేస్తోందన్నారు. ఉత్సవ కమిటీ ఇప్పడికే పెద్ద ఎత్తున చారం, వసతుల ఏర్పాట్ల పై ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు.  7 వ తేదీన సాయంత్రం 4 గంటల నుంచి బాణాసంచా, రాత్రి స్వామి వారి గ్రామతిరువీధి, భక్తిరంజని అనంతరం రాత్రి 11 గంటల నుంచి బాణాసంచా పోటీలు జరుగుతాయన్నారు.

8 వ తేదీన స్వామి వారి రథోత్సవం, రాత్రి రోషన్ లాల్ ఆర్కెస్ట్రా, 8 వ తేదీన  ఢీ డాన్స్ షో,  10 వ తేదీన  రాజా నర్తకి పౌరాణిక నాటకం, 11 వ తేదీన నుదిటి రాత సాంఘిక నాటకం, 12 వ తేదీన మహా అన్న ప్రసాదం, జరుగుతాయని తెలిపారు.  
 
వివిధ ప్రాంతాల నుంచి ఈ ఉత్సవానికి వచ్చే భక్తులకోసం రాష్ట్ర ప్రజా రవాణా సంస్థ రాజమండ్రి, కాకినాడ,

అమలాపురం, సామర్లకోట తదితర ప్రాంతాల నుంచి బిక్కవోలు గ్రామానికి అదనపు బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోందన్నారు. 

ఈ పోస్టర్ విడుదల కార్యక్రమంలో ఆలయ కమిటీ, అనపర్తి నియోజకవర్గం ప్రతినిధులు  కార్యకర్తలు పాల్గొన్నారు.


Latest Job Notifications

Panchangam - Nov 30, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam