DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మార్గశిర మాసోత్సవాలకు కనకమహాలక్ష్మి దేవస్థానం సిద్ధం: ఈవో శోభారాణి

*డిసెంబరు 2 నుంచి నెలరోజుల వేడుకకు భక్తులకు విస్తృత ఏర్పాట్లు*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*

విశాఖపట్నం, నవంబర్ 29, 2024 (డిఎన్ఎస్): విశాఖ పట్నం లోని పాత నగరం బురుజు పేట లో గల శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మార్గశిరమాసోత్సవములు డిసెంబర్ 2 నుండి 30 వరకు అత్యంత వైభవంగా

నిర్వహించనున్నామని దేవస్థానం ఉప కమిషనర్, కార్యనిర్వహణ అధికారి కె. శోభారాణి తెలియజేశారు. శుక్రవారం దేవస్థానం సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉత్సవ వివరాలను ఆమె వెల్లడించారు. నెలరోజులపాటు నిర్వహించే మార్గశిర మార్గశిరమాసోత్సవాలను వచ్చే నెల డిసెంబర్ 2న సోమవారం ఉదయం 8.40 లకు తొలి పూజా కార్యక్రమం

దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ చేసి ఉత్సవాలను ప్రారంభిస్తారని తెలిపారు.
మార్గశిర మాసోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీకనక మహాలక్ష్మి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె. శోభారాణి తెలిపారు. సుమారు లక్ష మందికి పైగా భక్తులు పాల్గొనే ఈ ఉత్సవాల నిర్వహణపై చర్చించేందుకు జిల్లా

కలెక్టర్ అధ్వర్యంలోని కమిటీ ఇప్పటికే సమావేశమైందని వివరించారు. ఆమె మాట్లాడుతూ ఉత్సవ ఏర్పాట్లు తెలిపారు.డిసెంబరు 2న ప్రారంభమై 30 వరకు మార్గశిర మాసోత్సవాలు నిర్వహిస్తామన్నారు. డిసెంబర్  5,12,19, 26 తేదీల్లో వచ్చే ప్రతి గురువారం అమ్మవారికి ప్రత్యేక పూజలు ఉంటాయన్నారు. డిసెంబరు 22న చతుర్వేద సభ, అర్చక సదస్సు

నిర్వహిస్తున్నామని తెలియచేసారు. 23న నాదస్వర కచేరి, 26 న సహస్ర ఘటాభిషేకం, మహా అన్నదానం ఉంటాయని తెలిపారు. 28వ తేదీన జగదాంబ సెంటర్ లోని అంబికా బాగ్ నుంచి ఆలయం వరకు రథయాత్ర నిర్వహిస్తామన్నారు. 5వ తేదీ అర్ధరాత్రి 12.01 గంటలకు గురువారం మొదటి పూజ పంచామృత సేవ చేసి దర్శనాలు ప్రారంభిస్తామన్నారు.
కనకమహాలక్ష్మీకి గురువారం

ప్రీతిపాత్రం కావడంతో ఆ రోజున విశేష పూజలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి రోజూ 3 వేల మంది, గురువారాల్లో 50 వేల మంది వరకు వస్తారని అంచనా వేసి ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎక్కడా తొక్కిసలాటలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేకంగా  క్యూలైన్లు పెడుతున్నా మన్నారు. దేవస్థానం తరపున ప్రధాని రహదారి నుంచి అమ్మవారి ఆలయం

వరకూ రెండు లైన్లు ఉంటాయన్నారు. ప్రధాన రహదారిపై పోలీసుల సూచన మేరకు మరిన్ని లైన్లు పెడతామన్నారు. 
ఏ క్యూలైన్ అయినా తప్పనిసరిగా నీడ ఉండాలని, భక్తులు ఎండలో నిల్చోకూడదని కలెక్టర్ సూచించారన్నారు.ఆ మేరకు పెండాళ్లు వేస్తున్నామన్నారు.
ప్రతిరోజూ అన్నదానం ఉంటుందన్నారు మార్గశిర ఉత్సవాల్లో రోజుకు 2 వేల మందికి, మహా

అన్నదానం రోజున 20 వేల మందికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.
మున్సిపల్ స్టేడియం, విక్టోరియా ఆస్పత్రి ఆవరణ, కొత్తరోడ్డు ఆర్చి గేటు వద్ద పార్కింగ్ సదుపాయం కల్పించా మన్నారు. ఆర్టీసీ బస్సులు ఉచితంగా నడపడానికి దాతలు సాయం చేస్తున్నారని తెలిపారు. విశాఖపట్నం ద్వారకానగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి భక్తులు

ఉచితంగా 
రావచ్చునన్నారు. ఈసారి ఆనందపురం, మధురవాడల నుంచి కూడా ప్రత్యేక బస్సులు నడుపుతామని ఆర్టీసీ అధికారులు తెలిపారని పేర్కొన్నారు.
గురువారం రోజు నిర్వహించే పంచామృత సేవకు రూ.7,500, సాధారణ రోజుల్లో అయితే రూ.2,500 టిక్కెట్ పెట్టామన్నారు. ఒక టిక్కెట్ పై దంపతులు, చిన్నపిల్లలు ఇద్దరు పాల్గొనవచ్చునన్నారు. ఉదయం 5 నుంచి 6

గంటలు, 11.30, 12 గంటలు, సాయంత్రం 6 నుంచి 6.30 గంటల మధ్య ఈ సేవ ఉంటుందని పేర్కొన్నారు.
ధర్మ దర్శనం ఉచితంగా చేసుకోవచ్చునన్నారు.విశిష్ట దర్శనం రూ.500, ప్రత్యేక దర్శనం రూ.200, శీఘ్ర దర్శనం రూ.100 టిక్కెట్లు పెట్టాం. వీటికి రీడింగ్ రూప్ వద్ద ఏర్పాటుచేసిన కౌంటర్లలో టిక్కెట్లు ఇస్తారని  తెలిపారు
మాలధారణ భక్తులచే శాంతి హోమం తేది. 30న

ఉదయం 9 గంటలకు జరుగుతుందన్నారు. సహస్ర దీపాలంకరణ 30న సాయంత్రం 6.30 నిర్వహిస్తామన్నారు.మహాన్న ప్రసాదం  జగన్నాధ స్వామి వారి దేవస్థానం కొత్త రోడ్డు వద్ద 20,000 మంది భక్తులకు వితరణ చేయబడునని తెలిపారు. ఈ సమావేశంలో సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమణ, దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు సిహెచ్. వెంకటరమణ, పర్యవేక్షణ

అధికారులు పద్మజ, తిరుపతిరావు, వేద పండితులు ప్రధాన అర్చకులు కొడమంచిలి శ్రీనివాస శర్మ, తదితరులు పాల్గొన్నారు.

 


Latest Job Notifications

Panchangam - Nov 30, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam