DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జీయర్ స్వామిచే  విజయనగరంలో గీతా జయంతి వేడుకలు 

6 à°¨ సమాశ్రయణములు, 7 à°¨ భగవద్గీత పారాయణ  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, నవంబర్ 26, 2019 (డిఎన్‌ఎస్‌): అత్యంత పవిత్రమైన గీతా జయంతి

పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని అపర రామానుజాచార్యులుగా ప్రసిద్ధికెక్కిన ఉపనిషత్ సిద్దాంత పీఠాధిపతులు, చిన్న జీయర్ స్వామి  à°ªà±à°°à°¤à±à°¯à°•à±à°· పర్యవేక్షణలో

రెండు రోజుల పాటు వేడుకలు జరుగనున్నాయి. డిసెంబర్ 6 ,7 తేదీల్లో విజయనగరం వికాసతరంగిణి ఆధ్వర్యవంలో రెండు రోజుల పాటు గీతా జయంతి వేడుకలను అత్యంత వైభవంగా

నిర్వహించనున్నారు. చిన్న జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో డిసెంబర్ 6 , 7 తేదీల్లో విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొటారు బిల్లి జంక్షన్ వద్ద గల టిటిడి కల్యాణ

మండపం సమీపంలోని మైదానం లో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. 

సమాశ్రయణములు - మంత్రోపదేశం:

డిసెంబర్ 6 శుక్రవారం ఉదయం 8 గంటలకు సేవాకాలం అనంతరం

భక్తులకు తీర్ధ గోష్ఠి జరుగనుంది. గంట్యాడ గ్రామం ఎం ఆర్ ఓ కార్యాలయం దగ్గరలో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 9 గంటలకు సమాశ్రయణములు (మంత్రోపదేశం)

స్వయంగా చిన్న జీయర్ స్వామి అనుగ్రహించనున్నారు. ఆధ్యాత్మిక పరమైన జీవనాన్ని సాగిస్తూ పరమాత్మ కృపకు పాత్రులు కావడానికి ముందుగా ఆచార్య అనుగ్రహం తప్పని సరి

అని వేదప్రమాణం. భగవద్రామానుజులు ఈ లోకానికి అందించిన మార్గాన్ని ఉపదేశం చేసే విధానానికి మంత్రోపదేశం అని పేరు. ఈ ఉపదేశాన్ని సాక్షాత్తు చిన్న జీయర్ స్వామి

భక్తులను అనుగ్రహించనున్నారు. 

డిసెంబర్ 7 న ఉదయం గీతా జయంతి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని గీతా యజ్ఞం నిర్వహించనున్నారు, దీనిలో భాగంగా శ్రీమత్

 à°­à°—వద్గీత పారాయణం, స్వామి వారి అనుగ్రహ భాషణం అందించనున్నారు. ఇతర వివరాలకు విజయనగరం వికాసతరంగిణి ప్రతినిధులను 9492017688 ,9441957052 , 9490107787 నెంబర్లలో సంప్రదించవచ్చు.     

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam