DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ ఎన్నికల సెంటిమెంట్ తో అందరిలోనూ  ఆశాభావం. . .

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)* 

*విశాఖపట్నం, మే 14, 2024 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో ఫలితాలు ఎవరికీ అనుకూలంగా వచ్చినా విశాఖ లో మాత్రం  రెండవ పక్షం కూడా ఉత్సాహంగానే ఉంటుంది. విశాఖ నగర పరిధిలో అసెంబ్లీ నియోజక వర్గాల్లో నాలుగు ఉన్నాయి. గత కొన్ని విడతలుగా గమనిస్తే  ఈ నాలుగు గెలిచిన వారు

ప్రతిపక్షంలో ఉండడం జరుగుతోంది. మరో పార్టీ అధికారంలో ఉంటోంది. 1999 ఎన్నికలు గమనిస్తే సిటీ లోని నాలుగు స్థానాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం 2024 ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం - బీజేపీ - జనసేన కూటమి అధికారంలోకి వస్తుంది అని అందరూ

భావిస్తున్నారు. అయితే విశాఖ సెంటిమెంట్ ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఇదే ఉత్సాహంలో ఇరు పార్టీల అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థి గెలిస్తే సొంత ప్రయోజనం,  పార్టీ గెలిస్తే వ్యక్తి ఓడినా అధికారం చేతిలోనే ఉంటుంది. 
2019 లో విశాఖ దక్షిణం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే

వాసుపల్లి తెలుగుదేశం తరపున గెలిచినా, పార్టీ ఓడిపోవడంతో వైఎఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి జంప్ చేసేసారు. విశాఖ ఉత్తరం నుంచి గంట శ్రీనివాస్ తెలుగుదేశం తరపున గెలిచారు. విశాఖ తూర్పు లో వెలగపూడి రామకృష్ణ తెలుగుదేశం తరపున గెలిచారు.  విశాఖ పశ్చిమ నుంచి పిజివిఆర్ నాయుడు తెలుగుదేశం తరపున గెలిచారు. వీళ్లంతా

ప్రతిపక్షంలోనే ఉన్నారు. విశాఖ సెంటిమెంట్ కు ఆనవాయితీగా 2014 లో తెలుగుదేశం - బీజేపీ కూటమిలో అభ్యర్థి విష్ణు కుమార్ రాజు గెలిచినా. . .అనంతర కాలంలో రెండు పార్టీలు విడిపోయి ఎమ్మెల్యే ప్రతిపక్షంలోకి వెళ్లిపోయారు. అంతకు ముందు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచినా తెలుగుదేశం అధికారం లోకి వచ్చింది. ఇక ప్రస్తుత

ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులు సైతం ప్రతిపక్షంలోనే కూర్చునే అవకాశం ఉంది.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam