DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్వామి పరిపూర్ణానంద గెలిస్తే అన్ని పార్టీలకు చెంపపేట్టే అవుతుంది

*తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టి హిందూపురం ఫలితం పైనే . ..* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖపట్నం, మే 27, 2024 (డి ఎన్ ఎస్):* జూన్ 4 న విడుదలయ్యే ఎన్నికల ఫలితాల్లో గెలిచి అన్ని పార్టీలకు చెంపపెట్టులాంటి సమాధానం ఇవ్వనున్నారా? అంటే అవుననే తెలియచేస్తున్నాయి సంకేతాలు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు

వస్తాయో అనే అంశం కంటే హిందూపురం లో ఎన్నిక ప్రభావం ఎలా ఉంటుంది అనే టాపిక్ పైనే రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ వేగవంతంగా నడుస్తోంది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం - బీజేపీ - జనసేన కూటమి కి అధిక శతం వస్తాయి అనే నమ్మకం అధిక శాతం ప్రజల్లో లో బలంగా ఉన్నా,  హిందూపురం లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ పీఠాధిపతి స్వామి

పరిపూర్ణానంద గెలుస్తారా లేదా అనే ఆసక్తి ఎక్కువగా వుంది. ముందస్తుగా ఆయనకు భారతీయ జనతా పార్టీ హిందూపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చింది. అయితే స్వామీజీకి టికెట్ ఇస్తే. . ముస్లిం లు తనకు ఓటు వెయ్యరు అంటూ తెలుగుదేశం అభ్యర్థి బాలకృష్ణ చేసిన అభియోగం కారణంగా బీజేపీ స్వామిజి టికెట్ ను రద్దు చేసింది. దీంతో అగ్గిమీద

గుగ్గిలం అయిన స్వామిజి అదే బాలకృష్ణ కు పోటీగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. గత మూడేళ్ళుగా హిందూపురం లోనే బస చేసి సేవ చేస్తున్న స్వామిజి రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల ప్రచారం చేశారు. ప్రధానంగా యువతకు అయన నిర్వహించిన మెగా జాబ్ మేళ, పట్ల ప్రజల్లో అభిమానం విస్తృతంగా పెరిగిపోయింది. దీంతో జూన్ 4 న జరిగే ఎన్నికల

ఫలితాల్లో స్వామిజి గెలిస్తే అన్ని రాజకీయ పార్టీలకు చెంప పెట్టుగా ఉంటుంది అన్నది వాస్తవం. స్వామిజి ఎన్నికల ప్రచారం అదే ముస్లిం సామాజిక వర్గం పురుషులు, మహిళలు కూడా సంఘీభావం ప్రకటించడం గమనార్హం. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam