DNS Media | Latest News, Breaking News And Update In Telugu

125 గ్యారంటీ, ఒక్క నెలలోనే సినిమా చూపిస్తాం, ఎంపీ ఆర్ఆర్ఆర్

జగన్ తానా అంటే. .శిష్యులు తందానా: విశాఖ లో వెల్లడి

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖపట్నం, మే 22, 2024 (డి ఎన్ ఎస్):* ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో 125 సీట్లకు తగ్గకుండా గెలిచి, కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఒక్క నెలలోగానే చట్ట ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, దానికి వత్తాసు పలికిన వాళ్లకి పూర్తి

సినిమా చూపిస్తామని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు. విశాఖపట్నం పర్యటనకు వచ్చిన ఆయన బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అతని శిష్య బృందానికి చెల్లిందన్నారు. చట్టాన్ని పూర్తి గా తుంగలోకి తొక్కి ఎన్నో అరాచకాలు

చేశారన్నారు. ఆ అరాచకాలలో భాగస్వాములైన అధికారులు  ప్రజలకు సమాధానం చెప్పవలసి ఉంటుందన్నారు. 
ఎన్నికల పోలింగ్ లో కూడా దౌర్జన్యాలు పరాకాష్ట కు చేరిందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పిన్నిల్లి నేరుగా  ఈ విఎం లను విరగ గొట్టి, తెలుగుదేశం పార్టీ పై నోరు పారేసుకున్నదన్నారు. అయితే ఎన్నికల కమిషన్ చేసిన

విచారణలో సీసీ టీవీ కెమెరాల్లో పిన్నెల్లి చేసిన దారుణ కంద కళ్ళకు కట్టినట్టు కనపడడంతో సీరియస్ అయ్యిందన్నారు. 
ఉద్యోగుల నుంచి, జనం నుంచి వచ్చిన వ్యతిరేకత పూర్తిగా తెలుసు కనకనే వైఎస్ జగన్ దేశం వదిలి పారిపోయాడని, జూన్ 4 న ఫలితాల్లో ఆ విషయం బయట పడుతుందన్నారు. అది గమనించే దేశం వదిలి లండన్ కు పారిపోయాడన్నారు.

వెళ్లేముందు మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తూ 150 సీట్లు మనమే గెలుస్తున్నాం అంటూ ఐ పాక్ కి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

9 న ప్రమాణస్వీకారం అంటూ బొత్స చేసిన వ్యాఖ్యలు చూసి జనం నవ్వుకుంటున్నారని ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావ్ అన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే సోమిరెడ్డి. బీజేపీ మాజీ ఎమ్మెల్యే

విష్ణు కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam