DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కూటమికి ఓటేశారనే బర్మా క్యాంప్ కుటుంబం పై వైకాపా దాడి: బీజేపీ

*వ్యక్తిగత కక్షలే: పోలీసులు, మండిపడ్డ టిడిపి, జనసేన* 

(Report:Sairam CVS, राष्ट्रवादी पत्रकार ) 

విశాఖపట్నం, మే 17, 2024 (డి ఎన్ ఎస్ ): ప్రశాంతమైన విశాఖ నగరంలో రాక్షస పాలనా విశ్వరూపం దాల్చింది అనడానికి మే 15 న రాత్రి జరిగిన ఘటన ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. విశాఖ ఉత్తరం నియోజక వర్గం పరిధిలో గల బర్మా క్యాంప్

ప్రాంతంలోని ధనలక్ష్మి అనే మహిళా కుటుంబం పై కొందరు గూండాలు దాడి చేసి మహిళలను దొరికిన వారిని దొరికినట్టు గా చావగొట్టారు. ఈ నెల 13 న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ కుటుంబం బీజేపీ - తెలుగుదేశం కూటమి అభ్యర్ధికి ఓటు వేసినట్టు అనాయాచితంగా ప్రక్క ఇంటి వారికీ చెప్పడమే వీళ్ళ ప్రాణాలమీదకు వచ్చింది. ఈ మాట ఆనోటా, ఈనోటా స్థానిక

వైఎస్సార్ కాంగ్రెస్ క్యాడర్ కు తెలియడంతో పదిమంది తో కలిసి రాత్రి 10 : 30 గంటల సమయంలో రాడ్ లు, ఊచలు తో ధనలక్ష్మి ఇంటిపైకి దాడి చేసి, ముగ్గురు మహిళలను, ఒక యువకున్ని తలలు బ్రద్దలు కొట్టడం జరిగింది. వాళ్ళల్లో గర్భవతి అయినా ఒక మహిళ కూడా ఉండడం గమనార్హం. 

దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రాధమిక చికిత్సకై స్థానిక

కె జి హెచ్ కు తీసుకువెళ్లడం జరిగింది. 

కేసు విచారణలో  పోలీసుల నిర్లక్ష్య వైఖరిని బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులూ తీవ్రంగా ఖండించారు. 

కూటమికి  ఓటు వేసినందుకు దౌర్జన్యమే: బీజేపీ 

అయితే శుక్రవారం ఉదయం విశాఖ ఉత్తర నియోజక వర్గం బీజేపీ అభ్యర్థి విష్ణు కుమార్ రాజు ను బాధిత

కుటుంబం ఆశ్రయించింది. పూర్వాపరాలు, ఘటన స్థలంలో బాధిత కుటుంబం తీసిన వీడియో లు చూసిన మీదట, ధనలక్ష్మి కుటుంబం పై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గూండాలు దాడి చేసారని ఆవేదన వ్యక్తం చేసారు. పోలిసులు ఎన్నికల కమిషన్ వేటు నుంచి తప్పించుకునేందుకే ఈ కేసును వ్యక్తిగత కక్షగా ప్రకటించారని మండిపడ్డారు. విశాఖ

ఉత్తర పరిధిలోని పొలిసు సిబ్బంది పై తమకు ఎటువంటి నమ్మకం లేదని, వాళ్లంతా అధికార పార్టీ కార్యకర్తలుగా ఉన్నారన్నారు. దీనిపై నగర పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేస్తామని, తదుపరి కేంద్ర ఎన్నికల కమిషన్ కు నేరుగా ఫిర్యాదు చేసి, బాధిత కుటుంబాన్ని న్యాయం చేయమని కోరతామన్నారు. ఈ ఘటన లో ఘోరంగా విఫలమైన నగర పొలిసు సిబ్బంది పై కఠిన

చర్యలకు డిమాండ్ చేస్తున్నామన్నారు. 

అనంతరం బాధిత కుటుంబం జరిగిన ఘటనలను మీడియా ముఖంగా వివరించారు. 

ఎన్నికల కమిషన్ పరిధిలో ఉండగా ప్రశాంత విశాఖ నగరం లో ఫ్యాక్షన్ రాజకీయాలు సృష్టించడం పై జనం లో భయాందోళనలు పెరుగుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు చెప్పిన కుటుంబ కక్షలే కారణమా లేక రాజకీయ పార్టీలు

చెప్తున్నట్టు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యమా అనేది తేలాల్సియుంది. 

ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం ఇంచార్జి నజీర్, జనసేన ఇంచార్జి ఉష కిరణ్, తదితరులు పాల్గొన్నారు.


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam