DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమల తలనీలాలు తరలింపు వార్త పై కేసు నమోదు 

*సంస్థ పై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవు: టిటిడి*

*ఏబీఎన్, టిడిపి వర్గాలపై తిరుపతి పీఎస్ లో కేసు నమోదు*  

*(DNS రిపోర్ట్: పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, మార్చి 31, 2021  (డిఎన్ఎస్):*తిరుమల తిరుపతి దేవస్థానముల ప్రతిష్టకు భంగం కల్గించే వార్తలు రాసిన, ప్రచారం చేస్తున్న సంస్థలు,

వ్యక్తులపై తక్షణం చర్యలు తీసుకుంటున్నట్టు టిటిడి గతంలోనే ప్రకటించింది. దీనికి నిదర్శనం గానే తిరుమల శ్రీవారికి భక్తులు ఎంతో భక్తితో సమర్పించిన తలనీలాలను టీటీడీ చైనాకు స్మగ్లింగ్ చేసే ప్రయత్నం చేసిందని ఫేస్ బుక్, మీడియాలో దుష్ప్రచారం చేసిన వారిపై మంగళవారం రాత్రి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు.
     

 టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీసే ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని టీటీడీ విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీకి చెందిన ''రామ రాజ్యం మళ్లీ.మొదలైంది " తెలుగుదేశం పార్టీ పొలిటికల్ వింగ్, గంగా ప్రకాష్, ప్రియాంక రెడ్డి స్వచ్ఛ, ఎబిఎన్

ఆంధ్రజ్యోతి సంస్థ మీద పోలీసులు కేసు నమోదు చేశారు.
     వీరంతా ఫేస్ బుక్ లో పోస్టులు పెట్టడం, షేర్ చేయడం, దుష్ప్రచారం చేయడం లాంటి చర్యలకు పాల్పడినట్లు విజిలెన్స్ అధికారులు ఆధారాలు సమర్పించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam