DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బిక్కవోలు గుడి లో నంది దొంగతనం భాద్యులపై చర్యలు తప్పవు

*(DNS report : పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, ఆగస్టు 11, 2021 (డిఎన్ఎస్):* తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం లోని మండల కేంద్రమైన బిక్కవోలు గ్రామంలో గల శ్రీ గోలింగేశ్వర ఆలయంలో శుక్రవారం నంది విగ్రహం అపహరణ విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు చౌకబారు రాజకీయాలు మానుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ సత్తి

సూర్యనారాయణరెడ్డి పేర్కొన్నారు.  ఎమ్మెల్యే ఆలయానికి చేరుకుని సంఘటన పూర్వాపరాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని త్వరలోనే పోలీసులు పట్టుకోవడం జరుగుతుందని ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీతో మాట్లాడడం జరిగిందన్నారు. దీనిపై స్పందించిన ఎస్పి నేర పరిశోధన శాఖ

నుండి ప్రత్యేక బృందాన్ని నియమించడం జరిగిందన్నారు. ఈ ఆలయంలో  ఏడేళ్ల  క్రితం బంగారు నగలు అపహరణ కావడం పోలీసులు కేసును ఛేదించి ఆభరణాలు రికవరీ చేయడం జరిగిందన్నారు. అదే విధంగా నంది విగ్రహాన్ని కూడా పోలీసులు త్వరలో పట్టుకుంటారన్నారు. ఈ చోరీ వ్యవహారాన్ని స్థానిక తెలుగుదేశం నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదిస్తూ

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ఆరోపణలు చేయడాన్ని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఆలయాల్లో చోరీలు, విగ్రహాల విధ్వంసం వంటి అనేక ఘటనలు చోటుచేసు కున్నాయని వీటికి కారణమైన వారిని పోలీసులు పట్టుకోవడం జరిగిందని, వీరిలో కొందరు ఆకతాయిలని ప్రజలకు తెలుసునన్నారు. గుడిని, గుడిలో లింగాన్ని

మింగేయాలన్న నైజం ఎవరిది అన్న విషయం బిక్కవోలు ప్రజలకు తెలియనిది కాదన్నారు. గత సమయంలో స్థానిక దేవాలయానికి చెందిన కోట్లు విలువ చేసే భవనాన్ని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసి, దానికి పన్ను విధించడం జరిగిందన్నారు. 
తప్పులు మీ వద్ద పెట్టుకుని గురివింద సామెత చందంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ఆరోపణలు చేయడం

తెలుగుదేశం పార్టీ నేతలకు తగదన్నారు. నంది విగ్రహం అపహరణ విషయంలో ఏ మాత్రం సమాచారం తెలిసినా దానిని పోలీసులకు  తెలియచేసి సహకరించాల్సిందిగా ప్రజలకు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam