DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందూ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ తో నవంబర్ లో భాగేశ్వర్ బాబా పాదయాత్ర

*Bhageswar Baba to conduct Padayatra with Hindu Rastra demand*

*మారణకాండ లు అదుపు చెయ్యాలంటే హిందూ రాష్ట్రం ఏర్పడాలి* 

హిందూ రాష్ట్ర సాధన కోసం నవంబర్ లో భాగేశ్వర్ బాబా పాదయాత్ర*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार)*

*విశాఖపట్నం, సెప్టెంబర్ 01, 2024 (డిఎన్ఎస్):* హిందువులపై జరుగుతున్నా అఘాయిత్యాలను, దారుణ మరణ కాండను

నిలువరించాలంటే కేవలం హిందూ రాష్ట్ర సాధన మాత్రమే పరిష్కారం అని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు భాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి ధీరేంద్ర శాస్త్రి తెలియచేస్తున్నారు. హిందూ రాష్ట్ర సాధన లక్ష్యంగా దేశ వ్యాప్త పర్యటన చేస్తున్నట్టు ప్రకటించారు. ఢిల్లీ లో జరిగిన ఆధ్యాత్మిక చింతన్ బైఠక్ తదుపరి స్థానిక మీడియాతో మాట్లాడారు. ఈ

సందర్బంగా తమ కార్యచరణ వివరించారు. దీనిలో భాగంగా సనాతన ఏక్తా పాదయాత్ర పేరిట వివిధ దశల్లో దేశ వ్యాప్త పాదయాత్ర చేయనున్నారు. ఈ సనాతన ఏక్తా పాదయాత్ర తొలి విడత నవంబర్ 21, 2024 నుంచి 30 వరకూ జరుగనుంది. ఈ 9 రోజుల సనాతన పాదయాత్ర మధ్య ప్రదేశ్ లోని భాగేశ్వర్ ధాం మందిరం నుంచి ప్రారంభం కానుంది. 
అన్య మతోన్మాదులు పెట్రేగిపోయి హిందూ

సమాజం పై చేస్తున్న అత్యాచారాలు, అఘాయిత్యాలు, దేవాలయాలపై దాడులకు నిరసనగా తాము ఈ యాత్ర చేపట్టినట్టు తెలిపారు. హిందువులపై దాడులు జరిగితే ప్రభుత్వాలు గానీ, రాజకీయ పార్టీలు గానీ రక్షణకు రావన్నారు. ఇది శతాబ్దాలుగా అందరూ చూస్తున్నదేనన్నారు. హిందువులపై జరిగే దాడులను అడ్డుకుని, పోరాటం చెయ్యవలసింది కేవలం హిందువులు

మాత్రమేనన్నారు. హిందువులపై లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, దేవాలయ జిహాద్, మత జిహాద్ పాటు ఇప్పుడు ఆహార జిహాద్ ల పేరుతొ ముస్లిం మతోన్మాదులు హిందువులను సర్వనాశనం చేస్తున్న విషయం పై అయన స్పందించారు. అందుకే మొద్దునిద్ర పోతున్న హిందూ సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకు వచ్చే విధంగా ఈ యాత్ర సాగుతుందని తెలిపారు. ఈ యాత్రలో పాల్గొనే

ఆసక్తి ఉన్నవారు తమ ఆశ్రమం లో పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. పిల్లలు, వృద్దులు, దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బంది పడుతున్నవారు యాత్రలో పాల్గొనరాదని సూచించారు. 

మధ్య ప్రదేశ్ లోని భాగేశ్వర్ నుంచి మొదలయ్యే ఈ పాద యాత్ర రోజుకి 20 కిమి సాగుతుందన్నారు. ప్రతి చోటా రాత్రి బస చేసే చోట భాగేశ్వర్ కథ ఉంటుందన్నారు. ప్రతి

రోజు జాతీయ గీతాలు, హనుమాన్ చాలీసా పారాయణ తో పాదయాత్ర మొదలవుతుందన్నారు. 

తదుపరి దశల్లో ఈ పాదయాత్ర డిల్లి నుంచి బృందావన్ వరకూ, లక్నో నుంచి వింధ్య వరకూ, అనంతరం తమిళనాడు లోని వెల్లూరు నుంచి ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతి పట్నం వరకూ సాగనుంది. మార్గం లో అన్ని గ్రామాల్లోని ప్రజలను నేరుగా కలిసి మాట్లాడడం

జరుగుతుంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - Sep 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam