DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పితృ దోషాలను పరిష్కరించేదే మహాలయ పక్ష పిండ తర్పణం

*Mahalaya Paksha tarpanam, solution for all hurdles*

*పితృ దోషాలను పరిష్కరించేదే మహాలయ పక్ష పిండ తర్పణం*  

*సెప్టెంబర్ 18 నుంచి మహాలయ పక్షాలు, 33 మందికి తర్పణం*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖపట్నం, సెప్టెంబర్ 15, 2024 (డిఎన్ఎస్):* భాద్రపద మాసం లో   కృష్ణపక్షమును మహాలయ పక్షము అంటారు. మహాలయము అంటే గొప్ప

వినాశము లేక మరణము. ఈ పక్షమున అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణ శ్రాద్ధకర్మలు చేయడం జరుగుతుంది. 
అందుకే దీన్ని పితృ పక్షము అని కూడా అంటారు. ఉత్తరాయణము దేవతల కాలము గనుక ఉత్తమకాలమని, దక్షిణాయణము పితృకాలము గనుక అశుభకాలమని మన పూర్వుల విశ్వాసము. ఈ మహాలయ పక్షములో ప్రతి రోజు గానీ,

సంబంధించిన రోజున  గాని శ్రాద్ధము చేయవలెను. 

మహాలయ పక్ష ప్రారంభం /శుద్ధ పూర్ణిమ పితృ పక్షం మొదలయ్యే రోజు. ఇక్కడ నుండి వరుసగా పదిహేను రోజులు పితృ దేవతలు పూజలకు ఉద్దేశించినవి. పితృ దోషం అంటే ఒక శాపం. గత జన్మలో ఎవరైనా వృద్దులకు కాని, తల్లితండ్రులకు కాని కష్టం కలిగించి ఉంటె, లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య

సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటె దానికి కారణం ఆ వ్యక్తీ యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవడం పితృ దోషాలకు గురికావడం జరుగుతుంది. జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు

కలుగుతాయి. 

మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి:- సాధారణంగా తండ్రి మరణించిన తిథినాడు మహాలయం పెట్టడం ఉత్తమమం. ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలుకాని పరిస్థితిలో మహాలయ అమావాస్యనాడు పెట్టడం ప్రశస్తం. దీనినే సర్వ పితృ అమావాస్య అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ... వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం

పెట్టాలి.

క్రింది సంవత్సరం చనిపోయిన వారికి భరణి లేక భరణి పంచమి తిథులలో అనగా మహాలయ పక్షాలు మొదలైన 4 లేక 5 రోజున మహాలయం పెట్టాలి.

భార్య మరణించిన వాడు నవమినాడు అనగా తొమ్మిదవ రోజున మహాలయం పెట్టాలి. ఆ రోజున సుమంగళిగా మరణించిన తన భార్యను తలచుకుని ఒక సుమంగళికి భోజనం పెట్టి , పసుపు , కుంకుమ , గాజులు , పూవులు ,

చీర , పెట్టి సత్కరించి పంపాలి. చిన్న పిల్లలు చనిపోతే... వారికి పన్నెండవ రోజున మహాలయం పెట్టాలి. చిన్న పిల్లలు అంటే ఉపనయన వయస్సు (పది సంవత్సరములు) దాటనివారు. ఒకవేళ పది సంవత్సరముల వయస్సు లోపే ఉపనయనము జరిగి ఉంటే... ఆ పిల్లవాడు మరణించిన తిథినాడే మహాలయం పెట్టాలి. ఇక ప్రమాదాలలో కానీ , ఉరిశిక్ష వల్ల కానీ , ఆత్మహత్య చేసుకుని

మరణించిన వారికి ఘట చతుర్థినాడు అనగా అమావాస్య ముందురోజున పెట్టాలి.

మహాలయ పక్షములు!

18-09-2024 నుండి 02-10-2024 పితృదేవతలకు ప్రీతికరమైన మహాలయ పక్షాల్లో తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు చేయడం ఎంత విశేషమో బ్రాహ్మణులకు భోజనం పెట్టడం చాలా విశేషం.

మహాలయపక్షం రోజుల్లో వారసులు వదిలే తర్పణాలు పితృదేవతలకు

ఆకలిదప్పులు తీరుస్తాయి. సంతృప్తి చిందిన పితృ దేవతలు ఆశీర్వాదం వంశీకుల ఉన్నతికి కారకమవుతుంది. ఈ పక్షం రోజుల్లో ఇతర శుభకార్యాలేవి ఆరంభం చేయకూడదు. మహాలయ అమావాస్య రోజున తర్పణ కార్యక్రమం చేశాక దేవతా పూజలకు శ్రీకారం చుట్టాలి. 

దోష ప్రభావం : ఉదాహరణకి ముఖ్యమైన పనులు పూర్తీ కాక ముందే ఆటంకాలు, వైఫల్యాలు

ఎదురుకోవడం, గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలగడం. కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులో వైధవ్యం ప్రాప్తించడం, కుటుంబం లోని వ్యక్తికీ మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండడం, ముఖ్యంగా సంతానా భాగ్యం లేక పోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడం, సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి. ప్రతి మనిషీ తన జీవితంలో పితృఋణం తీర్చాలి. దీనివలన పితరులు

తృప్తి చెందుతారు. వారికి ముక్తి లభిస్తుంది. తమ సంతానం పితృఋణం తీర్చక పొతే వారికి ముక్తి లభించదు. 

ఏ రోజు శ్రాద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందని వివిధ పురాణాల ఆధారంగా తెలుసుకోవచ్చు.
1 )పాడ్యమి సెప్టెంబర్ 18  పూర్వాభాద్ర నాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల లక్ష్మి కటాక్షం, ధన సంపద లభిస్తుంది 
2

)ద్వితీయ సెప్టెంబర్ 19 ఉత్తరా భాద్ర నాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల సంతాన ప్రాప్తి.,రాజయోగం, సంపద లభిస్తుంది 
3 )తృతీయ సెప్టెంబర్ 20 రేవతి నాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల  మంచి సంబంధం కుదురుతుంది 
4 )చతుర్ది సెప్టెంబర్ 21 అశ్వని  నాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల ధర్మగుణం, ఇష్టకామ్య ప్రాప్తి కలుగుతుంది, అంతే కాకుండా

శత్రువుల వ్యూహాలు ముందుగా పసిగట్టగలరు 
5 )పంచమి సెప్టెంబర్ 22 భరణి నాడు  శ్రాద్ధ కర్మ చేయటం వాళ్ళ ఉత్తమ లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. పుత్రకామన గలవారికి ఫలం లభిస్తుంది. 
6 )షష్ఠి  సెప్టెంబర్ 23 రోహిణి  నాడు  శ్రాద్ధ కర్మ వల్ల దేవతలు పితరులు ప్రసన్నులవుతారు, ఆ వ్యక్తికి సమాజంలో శ్రేష్ఠ గౌరవం లభిస్తుంది. 
/> 7 )సప్తమి సెప్టెంబర్ 24  మృగశిర నాడు శ్రాద్ధ కర్మ వల్ల యజ్ఞం చేసిన పుణ్య ఫలం లభిస్తుంది. 
8 )అష్టమి సెప్టెంబర్ 25 ఆర్ద్ర  నాడు  శ్రాద్ధ కర్మ వాళ్ళ చేస్తే సంపూర్ణ సమృద్ధి, ధనం, బుద్ధి ప్రాప్తిస్తాయి 
9 )నవమి సెప్టెంబర్ 26 పునర్వసు నాడు శ్రాద్ధ కర్మ చేస్తే విస్తారంగా సంపద, అనుకూలవతి అయిన భార్య లభిస్తుంది 
10

)దశమి సెప్టెంబర్ 27 పుష్యమి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే లక్ష్మీ ప్రాప్తి, పశు సంపద వృద్ది చెందుతుంది 
11 )ఏకాదశి  సెప్టెంబర్ 28 ఆశ్లేష నాడు శ్రాద్ధ కర్మ చేస్తే సర్వ శ్రేష్ఠ దాన ఫలం లభిస్తుంది, అన్ని పాపాలు నశిస్తాయి, వేద జ్ఞానం ప్రాప్తిస్తుంది, కుటుంబం వృద్ది చెందుతుంది 
12 )ద్వాదశి సెప్టెంబర్ 29 మఖ నాడు  శ్రాద్ధ

కర్మ చేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. శ్రాద్ధ కర్తకు అన్నానికి లోటుండదు, అలాగే పుత్ర, పశు, మెధా బుద్ధి, జయ సంపత్తి కలుగుతుంది 
13 )త్రయోదశి సెప్టెంబర్ 30 మఖ / పుబ్బ నాడు శ్రద్ధ కర్మ చేస్తే ధనం, సంతతి, ఐశ్వర్యం, దీర్ఘాయువు, ఆరోగ్యం, బంధుమిత్రులలో గౌరవం లభిస్తాయి 
14 )చతుర్దశి అక్టోబర్  01 పుబ్బ నాడు  శ్రాద్ధ కర్మ

చేస్తే ఆయుధాల నుండి రక్షణ లభిస్తుంది. 
15 )అమావాస్య అక్టోబర్  02  ఉత్తర నాడు శ్రాద్ధ కర్మ చేస్తే వ్యక్తికి సమస్త లాభాలు కలుగుతాయి, 

అన్ని కోరికలు నెరవేరుతాయి ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్ధాలు 

శ్రాద్ధ కర్మ చేత పితృ దేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా

సుఖ సంతోషాలు, పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది.

జీవ పితరులు చేయరాదు

తండ్రి జీవించి ఉన్న వారు జీవ పితరులు అని పిలువబడుతారు. వీరు ఈ తర్పణాలు చేయరాదు. అలాంటి వారు తమ పెద్దల ఆశీస్సుల కోసం వేదపాఠశాలలో గానీ, ఆశ్రమాల్లో  గానీ, ఆలయాల్లో గానీ భోజన ఏర్పాట్లు, గోమాతలకు భూరి

ఎత్తున గ్రాసం ఏర్పాట్లు  చేయాలి. 
ఈ మహాలయపక్షం పదిహేను రోజులు చేయలేనివారు కనీసం ఒక్క రోజైనా చేసి తీరాలి. 

ఈ మహాలయపక్షంలో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది. 

చేయవలసినవి:
మరణించిన వ్యక్తి యొక్క పెద్ద కుమారుడు తర్పణం చేయాలి. పితృ పక్షం సమయంలో, మరణించిన ఆత్మ వారి

కుటుంబ సభ్యుల నుండి బహుమతులు, ఆహారం మరియు నీటిని స్వీకరించడానికి భూమిని సందర్శిస్తుందని నమ్ముతారు. కాకులు యమరాజు యొక్క ప్రతినిధులు లేదా మరణించిన కుటుంబ సభ్యుల ఆత్మలు అని నమ్ముతారు. అందుకే, కాకులకి బియ్యం, నువ్వులతో కూడిన పిండ్ దాన్ నైవేద్యంగా పెడతారు. ఈ సమయంలో, ప్రజలు పేదలకు మరియు పేదలకు ఆహారం అందిస్తారు.

సంవత్సరంలో ఈ పవిత్ర సమయంలో జంతువులకు కూడా ఆహారం ఇస్తారు. ఈ పదిహేను రోజులలో కూడా రోజుకు ఒక పూట భోజనం చేయడం మరియు బ్రహ్మచర్యం పాటించడం మంచిది.

చేయకూడనివి:

ఈ సంవత్సరంలో నిశ్చితార్థాలు, వివాహాలు, గృహప్రవేశాలకు దూరంగా ఉండాలి. మాంసాహారం, పొగాకు, మద్యం వంటి వాటి వినియోగానికి కూడా దూరంగా ఉండాలి. పితృ

పక్షం యొక్క ఈ పదిహేను రోజులలో ఇనుప పాత్రలను ఉపయోగించడం, జుట్టు కత్తిరించడం లేదా గడ్డం షేవింగ్ చేయడం కూడా మానుకోవాలి. పితృ పక్షం సమయంలో మనం ఎలాంటి కొత్త ఆస్తి లేదా విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయకూడదు.

ఎవరెవరికి పిండ తర్పణం చెయ్యాలి :
మొదటి వర్గ త్రయం  : 1 ) తండ్రి  ,  2 ) తాత, 3 ) ముత్తాత,   
రెండవ

వర్గత్రయం :  4 ) తల్లి,  5 )నాయనమ్మ, 6 ) ముత్తమ్మ,  
ఇతరులు : 7 )సవతి తల్లి,  8 )తల్లి తండ్రి ( తాత),  9 )తల్లి తాత,  10 )తల్లి ముత్తాత, 11 ) అమ్మమ్మ, 12 )తల్లికి నాయనమ్మ, 13 )తల్లికి ముత్తమ్మ, 14 ) భార్య, 15 )కుమారుడు, 16 )సోదరులు, 17 ) తండ్రి సోదరులు, 18 )మేనమామ, 19 )కుమార్తె, 20 )అక్క, 21 )చెల్లెలు, 
22 )కూతురు కొడుకు ( మనుమడు), 23 ) మేనల్లుడు, 24 )మేనత్త, 25 )తల్లి

తోబుట్టువు,   
26 )అల్లుడు, 27 )బావగారు, 28 )కోడలు, 29 )భార్య తండ్రి ( మావ గారు), 30 )భార్య సోదరుడు ( బావ మరిది), 31 ) స్వామి ( గురువు), 32 )ఆత్మ గురువు,  33 ) ఆశ్రయించిన వారు (ఎవ్వరికైనా చేయవచ్చు).

Recent News

Latest Job Notifications

Panchangam - Sep 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam