DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నాస్తిక, హేతువాదులకు వరద బాధితులు కనపడడం లేదా?  

*గ్రహణం రోజు వద్దన్నా అన్నం పెట్టె వీళ్ళు, ఈరోజు ఎక్కడ?*

*మీడియాల్లారా ఈ బ్యాచ్ ని బయటకు తెండి: హిందూ సంఘాలు.* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖపట్నం, సెప్టెంబర్ 04, 2024 (డిఎన్ఎస్):* వరద  వైపరీత్యానికి ఇటు ఆంధ్ర, అటు తెలంగాణ ల్లో ప్రాంతాలు నీట మునిగి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఒక

ప్రక్క ప్రభుత్వం, మరో ప్రక్క హిందూ ధార్మిక సంఘాలు మాత్రమే యధాశక్తి బాధితులకు సహాయం అందిస్తున్నాయి. గత మూడు రోజులుగా దేవాదాయ శాఖా ఆలయాలు, చిన్న జీయర్ స్వామి ఆశ్రమం, ఇస్కాన్ కేంద్రాలు, ఆర్ ఎస్ ఎస్, సేవాభారతి, విశ్వ హిందూ పరిషత్, తదితర సంఘాలు వరద బాధిత ప్రాంతాలకు ప్రత్యక్షంగా వెళ్లి, ఆహారం, మంచినీళ్లు, వస్త్రాలు, ఇతర

సామాగ్రి అందిస్తున్నారు. 
సనాతన హిందూ ధర్మం లో ఆకలితో ఉన్నవాడు ఎవ్వరైనా ఆకలి తీర్చమని చెప్తూండే తప్ప, మతాన్ని భోదించదు. ఇదే నినాదంతో నేడు ఎన్నో హిందూ ధార్మిక సంస్థలు సేవాకార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాయి. 
 
అయితే నిత్యం హిందూ ధర్మాన్ని నోటికి వచ్చినట్టు తిడుతూ, గ్రహణం రోజు న ఆహారం తినకూడదు అని చెప్పినా

బలవంతంగా నోట్లో కూరే నాస్తిక, హేతువాద సంఘాలు, ఇప్పుడు ఎక్కడ నిద్ర పోతున్నాయని హిందూ సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. 
గ్రహణం రోజున రోడ్డు మీద పడి జనాన్ని ఇబ్బందిపెట్టే ఈ సంఘాలు, కనీసం వరద బాధితులకు నోటి మాట సాయం కూడా చెయ్యడం లేదన్నారు. వీళ్ళని నెత్తిన మోసి హిందూ సంప్రదాయ ఆచారాలను కించపరిచేందుకు అమితమైన

సాయం చేసే కొన్ని  మీడియా సంస్థలు తక్షణం వీళ్ళని వెతికి రోడ్లపైకి తీసుకు రావాల్సిందిగా హిందూ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. 

వినాయక చవితి అంటే పర్యావరణం కాలుష్యం, గ్రీన్ వినాయక చవితి చెయ్యండి, దీపావళి వాయు కాలుష్యం అవుతుంది, టపాసులు కాల్చకండి అని నోటికి వచ్చిన తప్పుడు ప్రచారం చేసే ఈ నాస్తిక,

హేతువాద సంఘాలకు ప్రస్తుత వరద బాధితులు కనపడడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. లేదా ఆ వరద బాధితుల్లో వీళ్ళు కూడా ఉన్నారా అనేది వాళ్ళని నెత్తిన పెట్టుకుని మోసే మీడియా సంస్థలు తెలియచేయాలని కోరుతున్నారు. 

ఇస్కాన్ గుడి కూడా మునిగింది. ..

అంతర్జాతీయ కృష్ణ భక్తి సంస్థ విజయవాడ శాఖా లోని గుడి కూడా వరద

నీటిలో మునిగిపోయింది. అయినప్పడికి వేలాది మందికి తమ సేవలు అవసరం అని భావించి, స్వచ్చందంగా రోజుకు లక్ష మందికి ఆహారాన్ని వండి పంపిణీ చేశారు. ఇలాంటి సంస్థల్ని ఎన్ని అవమానాలు చేసినా, సమాజ సేవకోసం తోలి అడుగుతూ వీళ్లదే ఉంటోంది. 
వీళ్ళకి మధ్యాహ్న భోజన పధకం కేటాయిస్తే హేతువాదులు, వాళ్ళ తోక పార్టీలు నోటికి వచ్చిన

వ్యాఖ్యలు చేసాయి. రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసాయి. నేడు ఇదే ఇస్కోన్ సంస్థ వేలాది మంది కి ఆహారాన్ని అందిస్తోంది. వీళ్ళని తిట్టి, ధర్నాలు చేసిన వ్యక్తులు, సంస్థలు ఇప్పుడు ఎక్కడ నిద్రపోతున్నాయో కూడా తెలియదు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Sep 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam