తాజా వార్తలు
  • అభ్యర్దుల దురుసు వైఖరే ఏపీలో బీజేపీ కొంప ముంచుతుందా?

    Apr 15, 2024 12:04 am

    *అరకు, అనకాపల్లి, రాజమండ్రి లో సొంత నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత* 

    *(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

    *విశాఖపట్నం, ఏప్రిల్ 14, 2024 (డి ఎన్ ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీని పూర్తిగా ముంచేందుకు స్వయంగా రాష్ట్ర అధిష్టానం చేసిన స్వయంకృతాపరాధమే కారణమా అంటే అవునని బీజేపీ క్యాడర్ తెలియచేస్తున్నారు. ప్రధానంగా అభ్యర్థుల నోటి దూరదే పార్టీ కొంప ముంచనుంది. దీని ప్రభావం అరకు, అనకాపల్లి, రాజమండ్రి లోక్ సభ అభ్యర్థుల పై తీవ్రంగా చూపించనుంది. వీళ్ళు సొంత పార్టీ నాయకులపైనే అవాకులు చెవాకులు వ్యాఖ్యానించడం తో పార్టీ క్యాడర్ లోనే తీవ్రమైన వ్యతిరేకత ఉంది. పార్టీలోని నాయకులూ, క్యాడర్ ను కలుపుకుంటూ వెళ్లి ప్రచారం చేసుకోవాల్సిన వీళ్ళు సొంత పార్టీ నాయకులపైనే అవాస్తవ అభాండాలు వేయడం సొంత గోతులు వీళ్ళే తీసుకున్నారు. పార్టీలో చాల మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోవర్టు లు ఉన్నారంటూ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. దీనిపై టికెట్లు ఆశించి భంగపడి, నిరాశ లో ఉన్న సీనియర్ నాయకులను (40 ఏళ్ళ నుంచే ఇదే పార్టీ లో ఉన్నవాళ్లు )   మరింత అవమానించడం తో ప్రచారంలోకి రావడం మానేశారు. 

    ప్రధానంగా పొత్తుల్లో ఉన్న తెలుగుదేశం, జనసేన నాయకులను సైతం బీజేపీ కనీసం గౌరవించక పోవడం బీజేపీ అభ్యర్థుల ప్రచారం లో పట్టుమని పదిమంది కూడా కనపడడం లేదు. పైగా సాక్షాత్తు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి రాజమండ్రి లోక్ సభ నుంచి పోటీ లో ఉన్నారు. ఆమె ప్రచార సభలోనే తెలుగు దేశం, బీజేపీ నాయకులూ నేరుగా తన్నుకోవడం పార్టీ పట్ల పొత్తుల్లోని వాళ్ళకే ఎంత వ్యతిరేకత ఉందొ దేశ వ్యాప్తంగా తెలిసిపోయింది. ఈమె కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ లో చేరిన విషయం తెలిసిందే. రాజమండ్రి తో ఈమెకు ఏమాత్రం పరిచయం లేక. .కేవలం ఒకరిద్దరిపైనే ఈమె పూర్తిగా ఆధారపడిపోయారు అనే విషయం తెలుస్తోంది. 

    ఇక అరకు లోక్ సభ లో బరిలో ఉన్న కొత్తపల్లి గీత ఒక మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో బీజేపీ లోనే వైఎస్సార్ కాంగ్రెస్ కోవర్టులు ఉన్నారని, మా పార్టీ అభ్యర్థులను ఓడించడానికి కుమ్మక్కు అయ్యారు అంటూ వ్యాఖ్యానించడం చాల దుమారం లేపింది. ఈమె వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవలే బీజేపీ లోకి వచ్చిన అభ్యర్థి.  ఈమె చేరడం వాళ్ళ పార్టీ కి ఏమేరకు ఉపయోగం కలిగిందో తెలియదు కానీ సీనియర్లకు అవమానం మాత్రం జరిగింది అనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. ఈమె పై ఆర్థిక నేరాల కేసులు ఉండడం వలన, దాన్ని తప్పించుకోడానికి పార్టీ మారారు అనే అభిప్రాయం ప్రచారం లో ఉంది.     

    ఇక అనకాపల్లి నుంచి లోక్ సభ బారి లో ఉన్న సీఎం రమేష్ కడప ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఏనాడూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన దాఖలాలు లేవు. గతంలో రాజ్య సభ సభ్యులుగా ఉన్నారు. ప్రత్యక్ష పోటీ ఇతనికి ఇదే మొదటి సారి. ఇలాంటి ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలో ఏమాత్రం తెలియక చెయ్యరని తప్పులు చేస్తున్నట్టు సమాచారం. అనకాపల్లి పరిధిలో ఎన్ని నియోజక వర్గాలు ఉన్నాయి, ఏ సామాజిక వర్గం ఎంతమంది ఉన్నారు అనే విషయం పరిజ్ఞానం ఈయనకు పూర్తిగా శూన్యం.    
    సొంత పార్టీ అభ్యర్థి దాకా అని ప్రచారం చేయడం కోసం విశాఖ నుంచి బీజేపీ నాయకులూ వెళ్లిన సందర్భంలో రమేష్ చూపించిన దురుసు ప్రవర్తన క్యాడర్ ను ఏంటో  మనస్థాపానికి గురి చేసింది. మొన్నటి వరకూ తెలుగుదేశం ఎంపీ గా ( రాజ్యసభ) ఉన్న ఇతను ఈడీ కేసుల్లో నిందితుడు గా ఉన్నందున దాన్ని తప్పించుకునేందుకు  బీజేపీ లో చేరారు. ఇతనికి బీజేపీ పార్టీ గురించి గానీ, సంఘ్ ప్రాధాన్యత, సిద్ధాంతాలు గురించి ఏమి తెలియవు. 

    విశాఖపట్నం ఉత్తర నియోజక వర్గం ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణు కుమార్ రాజు పూర్తిగా ఒంటెద్దు పోకడ వైఖరి కి సొంత బీజేపీ క్యాడర్ ఈయనకు మద్దతు ఇవ్వడం లేదు. ఈయన తెలుగుదేశం తో అంతర్గత ఒప్పందం ఉన్నట్టుగా పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. గతంలో ఇదే చోట నుంచి ఎమ్మెల్యే గా గెలిచినా, ఈసారి ఎన్నికలు ఈయనకు చుక్కలు చూపిస్తున్నాయి. నగర పార్టీలో అత్యంత బలంగా ఉన్న జనసేన, తెలుగుదేశం పార్టీ క్యాడర్ సైతం ఈయనకు దూరంగా ఉండడం ఈయన వైఖరే అని  తెలుస్తోంది. 

    పార్టీ లో ఏమాత్రం ప్రాధాన్యత లేని వీళ్ళందరూ సొంత లాబీ వల్ల టికెట్లు తెచ్చుకోవడంతో సీనియర్లను అత్యంత ఘోరంగా అవమానించిన ఫలితం త్వరలోనే చవిచూడబోతున్నారు అన్నది వాస్తవం.

  • మోడీ గ్యారంటీ అంటే గ్యారంటీగా మేనిఫెస్టో నెరేవేర్చే గ్యారంటీ: మోడీ.

    Apr 14, 2024 10:56 am

    *మేనిఫెస్టో: ఆయుష్మాన్ భారత్, ఉచిత రేషన్, జ్ఞాన్, సూర్య ఘర్ స్కీం*

    *టార్గెట్ బీజేపీ ది అయినా..నెరవేర్చే భాద్యత  ప్రజలు తీసుకున్నారు.*

    *(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

    విశాఖపట్నం, ఏప్రిల్ 14, 2024: (డిఎన్ఎస్):* మోడీ గ్యారంటీ అంటే గ్యారంటీ గా ఇచ్చిన హామీలు నెరవేర్చే గ్యారంటీ అని ప్రధాని నరేంద్ర మోడీ తెలియచేసారు. 2024 లోక్ సభ ఎన్నికల ప్రచారం లో భాగంగా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో ను అయన ఆదివారం విడుదల చేసారు. గత పదేళ్ల కాలంలో నెరవేర్చిన కార్యాచరణ అత్యంత సామాన్యమైనది, మోడీ 3.0 లో రాబోయే పాలనా గతంలో ఎన్నడూ భారత ప్రజలు ఊహించరని తెలిపారు. ఈ దేశంలో ఇలాంటి ఘటనలు జరగవేమో అనే అని అనుకునే కార్యక్రమాలను సంపూర్ణంగా నెరవేర్చే గ్యారంటీ ఇస్తున్నామన్నారు. 

    దేశంలోని అన్ని వర్గాల ప్రజలందరి శ్రేయస్సే మా లక్ష్యమని, అందుకే ఉచిత రేషన్, నీళ్లు, అందరికి గ్యాస్ కనెక్షన్, జ్ఞాన్, సూర్య ఘర్ స్కీం ద్వారా విద్యుత్ బిల్లులు లేని సోలార్ కనెక్షన్, రూ. 5 లక్షల వరకూ ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్యం ప్రధాన అంశాలుగా మేనిఫెస్టో విడుదల చేసారు.   

    జ్ఞాన్ : గరీబ్,యూత్, అన్నదాత, నారీ  

    దేశంలో ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అన్ని వర్గాల ప్రజల మన్ననలను పొందేందుకు గరీబ్ - పేదలు, యూత్ - యువత, అన్నదాత - రైతులు, నారీ - మహిళలకు ఉపయుక్త పథకాలను అమలు చేస్తున్నారు. సుమారు 200 కి పైగా పథకాలతో ప్రజా సంక్షేమాన్ని అందిస్తూ ప్రజలకు మరింత చేరువ అవుతున్నారు. దేశంలో ప్రధాన భాగస్వామ్యం కల్గిన ప్రజలు ఈ నాలుగు వర్గాల్లోకి వస్తారని, తద్వారా వీరికి మరిన్ని సంక్షేమ పథకాలను విస్తృత ప్రచారం చేపట్టారు. గ్రామా స్థాయిల్లో పల్లె నిద్రలు, ప్రజలతో ముఖాముఖిలు, ఇల్లిల్లు పర్యటనలు గృహ భోజనం, తదితర కార్యక్రమాలను వికసిత భారత్ పేరిట విస్తృతం చేశారు. ఈ సమయంలో గ్రామాల్లో ఉండే కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ., . పార్టీని బలోపేతం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసారు. ప్రధానంగా 18 ఏళ్ళ వయసు దాటినా యువత తోను, అన్నదాతలు, మహిళలతోను చర్చలు, సమస్యల పరిష్కారం కోసం సమావేశాలు చేపట్టారు. ప్రతి నియోజక వర్గానికి ఇంచార్జిలు, కేంద్ర కమిటీ ప్రతినిధులు సైతం గ్రామాల్లో పర్యటిస్తుండడం మంచి ఫలితాలను అందిస్తుంది అనే నమ్మకం తో బీజేపీ నేతలు ఉన్నారు. 

    సూర్య ఘర్ స్కీం : సోలార్ విద్యుత్ 

    దేశ వ్యాప్తంగా ఆరోగ్య అభియాన్ ద్వారా ఆరోగ్యం, పేదలకు ఉచిత బియ్యం, భారత్ రైస్, కు తోడుగా సోలార్ కనెక్షన్స్ ద్వారా 300 వాట్ల విద్యుత్ లోడ్ వరకూ 60 శాతం రాయితీ కూడా అందిస్తున్నారు. తద్వారా వేలకు వేలుగా వస్తున్నా విధ్యుత్ బిల్లుల నుంచి విముక్తి కల్గించే విధంగా కోటి ఇళ్లకు పైగా సోలార్ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు రాయితీలు ఇస్తున్నారు. రూ. 78000 /-  వరకూ రాయితీ లభించనుంది. ముందుగా దరఖాస్తు చేసుకున్న కోటి మందికి ఈ పథకం అమలు చేయనున్నారు. తద్వారా ఈ కనెక్షన్ పొందిన వారికీ విద్యుత్ బిల్లులు ఉండవు. పైగా మిగులు విద్యుత్ ను ప్రభుత్వమే కొనుగోలు చేయనుంది. 
    ఇప్పడికే పలు సార్లు విద్యుత్ చార్జీల పెంపు తో విసిగి పోయిన ప్రజలకు సూర్య ఘర్ స్కీం ఒక ఔషధం అని చెప్పవచ్చు. గతం లో ఈ రాయితీ కేవలం 40 శాతం మాత్రమే ఉండేది. మరో 20 శాతం అదనంగా పెంచడం ఇప్పడికే 60 వేలమందికి పైగా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. 

    ఇప్పడికి బీజేపీ సొంతంగా 303 లోక్ సభ సీట్లు సాధించిన దశ నుంచి 370 సీట్లు సొంతంగా సాధించేందుకు విస్తృత ప్రణాళిక సిద్ధం చేసి, అమలు చేస్తున్నారు. దీనిలో భాగాంగేన్ మార్చి 1 న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నం పర్యటనకు రానున్నారు. స్థానిక ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ఇంజనీరింగ్ మైదానంలో బహిరంగ సభ లో పాల్గొనున్నారు. ఇప్పడికే కేంద్రమంత్రులు ఆంధ్ర ప్రదేశ్ లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

    రామ మందిర్ నిర్మాణం పూర్వ జన్మ స్రుకృతం :

    కోట్లాది హిందువుల మనోవాంఛ అయోధ్యలో రామజన్మభూమిలో మందిర నిర్మాణం జరగడం ఈ దేశ ప్రజల పూర్వ జన్మ సుకృతం అని ప్రధాని తెలిపారు. న్యాయపరంగా పరిపూర్ణం చేసిన  నరేంద్ర మోడీ, తన తదుపరి టార్గెట్ కాశి లోని జ్ఞానవాపి మందిరం, ఆపై మధుర కృష్ణ జన్మభూమి ల్లో ఆలయ నిర్మాణాలను పూర్తి చేయడమే లక్ష్యంగా  చేసుకున్నారు. 

    దేశ వ్యాప్తంగా మోడీ హవా: . .

    గత పాలకులు హిందువులకు చేసిన ద్రోహాన్ని సంపూర్ణాంగా తెలుసుకున్న భారత ప్రజలు మోడీ పట్ల, తమ కృతజ్ఞతను తెలిపేందుకు కృతనిశ్చయులై ఉన్నారు. 

    370 టార్గెట్ బీజేపీ ది అయినా. . దాన్ని నెరవేర్చే భాద్యత ప్రజలు తీసుకుంటున్నారు. 
     

  • తమిళనాడు లో డీఎంకే ఓడుతుందని చెప్పిన చిలక జోస్యుడు అరెస్ట్

    Apr 13, 2024 10:12 pm

    *(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

    *చెన్నై / విశాఖపట్నం, ఏప్రిల్ 13, 2024 (డి ఎన్ ఎస్):* పిచ్చి ముదిరి రోకలి చుట్టుకుంటున్న అధికార పార్టీకి విచక్షణ లేకుండా గుడ్డిగా తలూపుతున్న అధికారుల అత్యుత్సాహానికి సామాన్య జనం నానా చీవాట్లు పెడుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు లోని కడలూరు కు చెందిన సెల్వరాజ్‌ అనే 81 సంవత్సరాల ఓ చిలక జ్యోతిష్కుడు రోడ్డు ప్రక్కన తన చిలకతో జోతిష్య సూచనలు చెప్తుంటాడు. దీన్ని గిని జాతక శాస్త్రం అని పేరు. 
    ఈ క్రమం లోనే రెండు రోజుల క్రితం కడలూరు లోక్ సభ ఎన్నికల్లో అధికార డీఎంకే అభ్యర్థి ఓడిపోతారని అని చెప్పాడు. పీఎంకే అభ్యర్థి టంగర్ బచ్చన్ గెలుస్తాడంటూ చెప్పాడు. దీన్ని వీడియో చిత్రీకరించి సోషల్ మీడియా లో వైరల్ చేసారు. దాంతో అధికార పార్టీ తక్షణం ఆ జ్యోష్యుణ్ణి అరెస్ట్ చెయ్యమని ఆదేశాలు ఇచ్చేసింది. అంతే ముందు వెనుక చూడకుండా ఓ పెద్ద వ్యాన్ లో ఆ జ్యోషుడి ఇంటికి వెళ్లి మరీ అటవీ శాఖా అధికారులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపేశారు. అటవీ జంతువుల చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఒక చిలకను వ్యాపారం వస్తువుగా చేసాడు అంటూ కేసు నమోదు చేసారు. 

     ఈ ఘటన చూసిన స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేసేసారు. సెల్వరాజ్‌ను పట్టుకుని, అతని బోనులో రెండు చిలుకలను స్వాధీనం చేసుకున్నారు. అంతే. .ఈ వీడియో చూసి న వాళ్లంతా అటవీ శాఖా ఓవర్ ఆక్షన్ కి నానా చీవాట్లు పెడుతున్నారు. 

    మాట సందర్భంగా కూడా ఓడిపోతాం అనే పదం వినపడకూడదు ని డీఎంకే ఆదేశాలు జారీ చేసినట్టు ఉంది బీజేపీ, పీఎంకే మండిపడుతున్నాయి. 
    గత మూడేళ్ళ కాలంలో తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, విశ్రాంత ఐపీఎస్ అధికారి కె. అన్నామలై అధికార పార్టీకి చూపిస్తున్న చుక్కలను భరించలేని డీఎంకే అతి సామాన్య ప్రజలపై విరుచుకు పడుతోంది అనడానికి ఈ చిలక జ్యోష్యుడి అరెస్ట్ ఒక నిదర్శన, ఈ ఘటనపై పీఎంకే చీఫ్ అన్బుమణి రాందాస్ మండిపడ్డారు. 

     

Panchangam - Apr 26, 2024

Date :
Ruthuva :
Nakshatram :
Week :
Masam :
Amrithakalam :
Year :
Pakshamvarjam :
Samsthram :
Ayanam :
Tithi :
Durumuhratam :

Today Vizag Events - Apr 26, 2024

ఆంధ్ర ప్రదేశ్
వాయు కాలుష్య నివారణకై ఎలక్ట్రిక్ వాహనాలు అవసరం:...

Nov 2, 2021 10:08 am

*కొత్త రెట్రోసాను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య*

*(DNS Report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*  
 
*అమరావతి, నవంబర్ 01,  2021 (డిఎన్ఎస్):* ప్రపంచవ్యాప్తంగా కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా పర్యావరణ హిత విద్యుత్ వాహనాల ప్రాధాన్యం పెరుగుతోందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. విజయవాడ పర్యటనలో ఉన్న ఆయన మాట్లాడుతూ మన వాతావరణాన్ని కాపాడులోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. విజయవాడలో అవేరా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సంస్థ కొత్త వేరియంట్ రెట్రోసాను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి వాతావరణ పరిరక్షణకు ఇచ్చిన పిలుపు మేరకు, ఆ దిశగా అవేరా సంస్థ అడుగులు వేయడం శుభపరిణామమన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని ఎంచుకున్నందుకు అవేరా బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని వినియోగించేలా అవేరా వ్యవస్థాపకుడు, సీఈవో డా. రమణ, కో ఫౌండర్ చాందిని చందన నాంది పలికారని వెంకయ్య నాయుడు అన్నారు. డా. రమణ మాట్లాడుతూ.. అధునాతన ఫీచర్లతో రూపొందిన రెట్రోసా ఒక్కసారి ఛార్జ్ చేస్తే 148 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని వెల్లడించారు. బ్లూటూత్ ను అనుసంధానించడం ద్వారా బ్యాటరీలో ఉన్న ఛార్జింగ్ శాతం, వోల్టేజ్ తదితర వివరాలు తెలుసుకోవచ్చన్నారు. దేశంలోనే ఈ శ్రేణి వాహనాల్లో రెట్రోసా అత్యధిక వేగాన్ని కలిగి ఉందని చెప్పారు. అవేరా ఇప్పటికే యూరప్, ఏషియా పసిఫిక్ దేశాలకు వాహనాల ఎగుమతి చేస్తోందని వివరించారు. 2022 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 140 అవేరా పాయింట్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోందని డా. రమణ పేర్కొన్నారు. కార్యక్రమంలో అవేరా ప్రతినిధులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

view more..
రాజకీయo
view more..

వీడియోలు
International
కెనడాలో - 21 డిగ్రీల అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు ...

Feb 14, 2020 11:41 pm

హిమ పర్వతాల నడుమ మధ్య జనజీవనం. . 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . . .

బ్రాంప్టాన్ / విశాఖపట్నం, ఫిబ్రవరి 14, 2020 (డిఎన్‌ఎస్‌) : ఉత్తర అమెరికా à°–à°‚à°¡à°‚ లోని కెనడాలో à°—à°² బ్రాంప్టాన్ (రాజధాని టొరంటో కు సమీపంలోనే ) నగరం లో ఫిబ్రవరి 14 ఉదయం 6 à°—à°‚à°Ÿà°² సమయానికే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు -21 డిగ్రీలు నమోదు చేసుకోవడం తో నగరం మంచుపర్వతాలతో మునిగిపోయింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన భారతీయులు అధిక శతం ఉండే à°ˆ నగర వీధులన్నీ మంచు ఖండాలతో నిండి పోవడం తో స్థానిక ప్రభుత్వ సిబ్బంది వీటిని తొలగించే పనిలో పడింది. ఇళ్లల్లోని కుళాయిల్లో నీళ్లు సైతం మంచుగా మారిపోవడం గమనార్హం. à°ˆ క్రమం లో జనజీవన స్రవంతి à°•à°¿ ఆటంకం ఏర్పడింది. విధులకు, కళాశాలలకు వెళ్లేవారు భారీ ఎత్తున ఉన్ని దుస్తులు ధరిస్తే గానే ఇంటి నుంచి కాలు బయట పెట్టె పరిస్థితి లేదు.  à°µà°°à±à°·à°‚ కురినట్టుగా మంచు ఏకధాటిగా పడుతుండడం గమనార్హం. ఇళ్ల బయట పార్కింగ్ చేసే కార్లు సైతం హిమపాతాల్లో కూరుకు పోతుండడం గమనార్హం. మైదాన ప్రాంతాల్లో భారీగా కురిసిన మంచు పలు ఆకారాలు దర్శనమిస్తోంది. 
అయితే భారతీయ వాతావరణానికి పూర్తిగా భిన్నంగా ఉండే ఉష్ణోగ్రతలు కావడంతో ఎక్కువ మంది భారతీయులు à°ˆ సమయంలోనే ఇక్కడకు చేరుకునే ప్రయత్నం చేస్తుంటారు. 

...

view more..
Movie News
123...

Sep 15, 2023 8:09 am

123

view more..
విశాఖ వార్తలు
నామినేషన్లు స్థాయిలోనే సూరత్ నుంచి  మోడీ విజయ ...

Apr 22, 2024 4:23 pm

*కాంగ్రెస్ దరఖాస్తు తిరస్కరణ,  ఏకపక్షంగా బీజేపీ అభ్యర్థి ఎన్నిక*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖపట...

view more..
Competitive Exams in India
Sports
view more..