DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు:సోము వీర్రాజు

*అధ్యక్ష మార్పు పై రాద్ధాంతం తగదు, పార్టీ నిర్ణయం*   

*కన్నా పదవి కాలం ముగిసింది, కనుకే మార్చారు.*  

*ఢీల్లి లో  ఏపి బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*న్యూఢిల్లీ‌ / విశాఖపట్నం, జూలై 30, 2020 (డిఎన్ఎస్):* ఆంధ్రప్రదేశ్‌ రాజధాని

విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. దేశంలో అనేక చోట్ల రాజధానులు  ఏర్పాటు చేస్తున్నారని, రాష్ట్ర  ప్రభుత్వ నిర్ణయంలో కేంద్రం ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని గుర్తుచేశారు. రాజధాని పేరుతో సింగపూరు, జపాన్, చైనా అంటూ గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను

మభ్యపెడుతూ.. కథలు చెప్పారని విమర్శించారు. చంద్రబాబు మాటలపై కేంద్రం ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని, ఇప్పుడు కూడా మూడు రాజధానిలో విషయంలోనూ అదే వైఖరితో ఉన్నామని తేల్చిచెప్పారు. అయితే రాజధాని రైతులకు న్యాయం జరగాలన్న తమ నినాదానికి చివరి వరకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా

సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడుతూ.. రాజధానిపై టీడీపీ నేతలు బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇక తాము సీరియస్‌గా ఉండబోతున్నామన్నారు. బీజేపీ నేతలు తనకు దగ్గరవుతున్నారంటూ చంద్రబాబు నాయుడు సంకేతాలు ఇస్తున్నారని, ఇదంతా ఆయన ఆడే రాజకీయ చదరంగమని వ్యాఖ్యానించారు. అయితే ఈ

ఆటలో తాము సైతం కొత్త ఎత్తుగడలు వేస్తామని పేర్కొన్నారు. బీజేపీ-జనసేనకు 20 శాతం ఓటు బ్యాంకు ఉన్నట్లు తాము భావిస్తున్నామని సోము వీర్రాజు చెప్పారు. 

ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పు పై రాద్ధాంతం తగదని, ఇది కేంద్ర కమిటీ నిర్ణయం అని తెలిపారు. కన్నా లక్ష్మీనారాయణ పదవి కాలం ముగిసింది, వేరొకరికి

అవకాశం ఇవ్వాలని అధ్యక్షున్ని మార్చారన్నారు. ఇది పూర్తిగా బీజేపీ అంతర్గత విషయమని, ఇతరుల జోక్యం అనవసరం అన్నారు. 
సమావేశంలో కేంద్ర అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యులు ఙివిల్ నరసింహారావు, ఆంధ్రప్రదేశ్ సహా ఇంచార్జి సునీల్ దియోదర్ పాల్గొని ప్రసంగించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam