DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నాక్ గుర్తింపు కోసం నన్నయ కృషి: వీసీ మొక్కా 

*(DNS report : పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, సెప్టెంబర్ 30, 2021 (డిఎన్ఎస్):* అదికవి నన్నయ విశ్వ విద్యాలయానికి ఈ ఏడాది డిసెంబర్ నాటికి నాక్ గుర్తింపు తెచ్చే విధంగా కృషిచేస్తున్నామని అక్నూ ఉపకులపతి డా. మొక్కా జగన్నాధ రావు వెల్లడించారు. ఇప్పటికే క్యాంపను ఫ్రీ ర్యాగింగ్ క్యాంపస్ గా తీర్చిదిద్దాముని,

విద్యార్ధిని, విద్యార్థులు మంచి వాతావరణంలో విద్యాభ్యాసం చేసేలా యూనివర్సిటీని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో జగన్నాధరావు మాట్లాడుతూ ఖేలో ఇండియా పథకం ద్వారా రూ 8.30 కోట్ల నిధులు యూనివర్సిటికీ వచ్చాయని వాటితో ఒక మల్టీవర్సస్ స్టేడియంతో

పాటు స్విమ్మింగ్ పూల్ నిర్మాణం చేయడానికి నిర్ణయించామన్నారు. అక్నూ ఇంజనీరింగ్ కళాశాలకు ఇప్పటికే ఎఐసిటిఇ గుర్తింపు వచ్చేలా చేయడం వల్ల విద్యార్థులు మంచి ఉపాధి అవకాశాలు పొందేందుకు వీలైందన్నారు. అదే తరహాలో న్యాక్ గుర్తింపుతో పాటు మంచి గ్రేడ్ వచ్చేలా చేస్తే యుజిసి ద్వారా అధిక మొత్తంలో నిధులు సాధించేందుకు ప్రత్యేక

ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు నమ్మకంతో నన్నయ యూనివర్సిటికీ విసిగా నియమించారని, ఆయన నమ్మకాన్ని నిలబెట్టేలా మంచి ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృతనిశ్చయంతో పనిచేస్తున్నారని తెలిపారు. దిశ యాప్ ఆవిష్కరణ కూడా నన్నయలో ఘనంగా

జరిగిందని దీనికి రాష్ట్ర మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు విచ్చేసారన్నారు. కరోనా లాక్డౌన్ సమయంలో కూడా ఫ్యాకల్టీ, విద్యార్ధులను సమన్వయం చేసుకుని వెబినార్లు నిర్వహించామన్నారు. గతంలో యూనివర్సిటీని పరిపాలించిన అధికారులు ఐఎనీ, న్యాక్ వంటి గుర్తింపు సాధించడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదో తెలియదని తాము మాత్రం ఈ విషయంలో

పట్టుదలగా ఉన్నామని అన్ని గుర్తింపులు సాధించి యూనివర్సిటినీ ప్రగతి పథంలో నడిపిస్తామని స్పష్టం చేసారు. విద్యార్థులకు అధ్యాపకులు ఒక గైడ్, కౌన్సిలర్గా ఉండాలే తప్ప ఏదో వచ్చి పాఠాలు బోధించి వెళ్లిపోయామనే విధానాన్ని విదనాదాలన్నారు. అధ్యాపక వృత్తిపై ఇష్టంతోనే తాను ఈ ప్రొఫెషన్లోకి వచ్చానని ఇప్పటికీ క్లాస్ రూమ్లో

పాఠాలు బోధించడానికే ఇష్టపడతానని చెప్పడానికి గర్వంగా ఉందన్నారు. 8 నుంచి 9 రీసెర్చ్లు చేయడం ద్వారా నిధులు రాబట్టడానికి ప్రయత్నిస్తున్నామని, 1.5 కోట్ల నిధులను ఓఎనిసి నుంచి సాధించామన్నారు. తమ యూనివర్సిటీలో విద్యార్థులందరూ దిశ యావ్ డౌన్ లోడ్ చేసుకునేలా చేసామని, ర్యాగింగ్ పూర్తిగా నిషేధించామని తెలిపారు. ప్రతీ

అధ్యాపకుడు ఖచ్చితంగా రీసెర్చ్ పేపర్లు పబ్లికేషన్ చేసేలా చేసామన్నారు. గ్రీన్ క్యాంపస్ గా మార్చడానికి వేల మొక్కలు నాటామని, అటవీ శాఖ సహకారంతో విడికరాల స్థలంలో బయో డైవర్సిటీ పార్క్ను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. కళాశాల హాస్టళ్లలో ఫ్రీ వై ఫై సౌకర్యం కల్పించామని, రీడింగ్ రూమ్స్, లైబ్రరీలో ఆన్లైన్ జర్నలను

అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. తమ యూనివర్సిటీ పరిధిలో 400 అనుబంధ కళాశాలలు ఉన్నప్పటికీ ప్రస్తుతం 320 మాత్రమే యాక్టివ్ గా ఉన్నాయన్నారు. ఏడాదికి రూ 14 కోట్లు బడ్జెట్ కేటాయించాల్సి ఉన్నప్పటికీ ఈ ఏడాది 7 నుంచి 8 కోట్లు మాత్రమే విడుదలయ్యాయన్నారు. వర్మినెంట్ ఫ్యాకల్టీ కొరతను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది సిఎం జగన్ 40 మందిని

కేటాయించారని, వచ్చే ఏడాది ఈ సంఖ్యను మరింతగా పెంచితే ఇక ప్యాకల్టీ కొరత ఉండదన్నారు. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కుతో ఎంఓయు చేసుకున్నామని, స్కిల్ డెవలప్మెంట్ కాలేజీని కూడా ప్రారంభిస్తున్నామన్నారు. మంచి విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పొందేలా ఓఎన్ వంటి సంస్థల సహకారంతో తనకున్న అనుభవంతో ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

512 మంది యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ వలంటీర్లతో బ్లడ్ డోనర్ డేటా బేస్ ను ఏర్పాటు చేసామని దాని వల్ల ఎవరికి రక్తం అవసరమైనా తక్షణం అందించేలా సామాజిక బాధ్యతతో పనిచేస్తున్నామని వివరించారు. విద్యార్థులకు కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేసి హాట్ లైన్ నెంబర్ ఇచ్చామని దాని ద్వారా వారిలో యాంగ్జయిటీ, డిప్రెషన్ను దూరం చేసేందుకు తమ

వంతు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. దీనికి ముందు మీటి ప్రెస్కు విచ్చేసిన విసి మొక్కా జగన్నాధరావును ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు మండెల శ్రీరామ్మూర్తి. అధ్యక్షుడు కుడుపూడి పార్ధసారధి, మాజీ అధ్యక్షులు కృష్ణకుమార్లు దుశ్శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందచేసారు. కార్యక్రమంలో నన్నయ రిజిస్ట్రార్ అశోక్, పి

ఆర్ ఓ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 6, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam