DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నిజాన్ని నిగ్గు తేల్చండి !, కేంద్ర సంస్థతో విచారణ జరపాలి : వైకాపా 

విశాఖపట్నం, అక్టోబర్ 30, 2018 (à°¡à°¿ ఎన్ ఎస్  DNS Online ) :  à°œà°—న్‌పై దాడి కేసులో నిజాన్ని నిగ్గుతేల్చాలని, కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్వతంత్య్ర దర్యాప్తు సంస్థతో విచారణ

జరిపించాలని వైసీపీ నగర అధ్యక్షుడు మళ్ళ విజయ్‌ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. మద్దిపాలెంలో à°—à°² పార్టీ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నాం ఏర్పాటుచేసిన విలేకరుల

సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నం వెనుక అసలు సూత్రధారులెవరో తేల్చాలంటే కేంద్ర దర్యాప్తు

సంస్థతోనే విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం à°ˆ ఘటనను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని, à°ˆ నేపథ్యంలో కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని

ప్రత్యేక సంస్థలతో దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేశారు.  à°œà°—న్‌పై హత్యాయత్నం జరిగిన విశాఖ విమానాశ్రయం భద్రతా పరిధి కేంద్రం ఆధీనంలో ఉందని, à°ˆ విషయంలో రాష్ట్ర

ప్రభుత్వం ప్రత్యేక విచారణ జరిపించలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే చెప్పారన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ వెంటనే కల్పించుకొని కేంద్ర దర్యాప్తు

సంస్థతో విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు విచారణను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఘటన జరిగిన తరువాత

అదో చిన్న ఘటన అంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడం, పబ్లిసిటీ కోసమే చేశారంటూ డీజేపీ వ్యాఖ్యలు  à°šà±‡à°¯à°¡à°‚ కేసును నీరుగార్చే ప్రయత్నమేనని స్పష్టం చేశారు. అసలు

 à°µà°¿à°šà°¾à°°à°£ సవ్యంగా జరగటం లేదని మళ్ళ 
à°ˆ సందర్భంగా ఆరోపించారు. అసలు  à°¨à°¿à°‚దితుడు శ్రీనివాస్‌కు ఏ ప్రాతిపదికన ఉద్యోగం ఇచ్చారన్నారు. ఎయిర్‌పోర్ట్‌లో వీఐపీ

లాంజ్‌లో విధులు  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚చాలాoటే కనీస అర్హతలు  à°‰à°‚డాలన్నారు. అసలు  à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸à±‌ ఎవరి ప్రమేయంతో వచ్చాడో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. నిందితుడు వాడిన

పదునైన కత్తిని లోనికి తీసుకువచ్చినపుడు ఎందుకు గమనించలేకపోయారన్నారు. తాను ప్రత్యక్ష్యంగా చూసానని జగన్‌ మెడను క్ష్యంగా చేసుకొని దాడి చేసారని, అందరి

ఆశీస్సులు  à°œà°—న్‌పై ఉండటంతో అదృష్టవశాత్తు భుజానికి గాయమైందన్నారు. 1.10 గంటకు ఇక్కడ నుంచి విమానంలో బయుదేరి హైదరాబాద్‌ వెళ్లారన్నారు. జగన్‌ హైదరాబాద్‌

చేరకముందే డీజీపీ ప్రెస్‌మీట్‌ ఏ విధంగా పెట్టారని ప్రశ్నించారు. కేంద్రం భద్రతా విభాగం ఆధ్వర్యంలో నిందితుడు ఉంటే, డీజీపీ ఏ విధంగా ప్రకటన చేస్తారన్నారు.

సీఐఎస్‌ఎఫ్‌ నిందితుడుని పోలీసులకి అప్పగించకుండా ఏ విధంగా మాట్లాడతారన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకునికి రక్షణ కల్పించలేని ముఖ్యమంత్రి, డీజీపీ సామాన్యలకు

ఏ విధంగా రక్షణ కల్పిస్తారన్నారు. సాక్ష్యాత్తు ప్రతిపక్ష నాయకుడి మీద దాడి జరిగితే చిన్నగాయమే అని కొట్టిపారేయడం ఎంతవరకు సమంజసం అన్నారు. అలిపిరి ఘటనలో

గాయపడ్డ ముఖ్యమంత్రి చంద్రబాబును నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైయస్‌.రాజశేఖర్‌రెడ్డి పరామర్శించి, ధర్నా కూడా నిర్వహించారని గుర్తుచేశారు. కాని కనీసం జగన్‌ను

పరామర్శించకపోవడమే కాకుండా, ఢల్లీి వెళ్లి స్టేట్‌మెంట్‌ు ఇవ్వడం సమంజసం కాదన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

వ్యవహరిస్తున్నారన్నారు. à°“ ముఖ్యమంత్రిగా  à°‰à°¨à±à°¨ వ్యక్తి తప్పుగా మాట్లాడటం సరికాదన్నారు. తమ నాయకుడు రాజకీయం చేయాలనుకుంటే దీనిని సాకుగా చూసి అల్లకల్లోలం

 à°¸à±ƒà°·à±à°Ÿà°¿à°‚చవచ్చునన్నారు. కాని తమ నాయకుడు జగన్‌ నిబద్ధతకు కట్టుబడి అంతా శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారన్నారు. రాజకీయంగా బురద జల్లాలనే తప్ప, జగన్‌పై

హత్యాయత్నం కేసులో నిజాలను నిగ్గుతేల్చాలనే ఉద్ధేశ్యం ఈ ప్రభుత్వానికి లేదన్నారు.
 à°•à±à°¯à°¾à°‚టీన్‌ నిర్వహిస్తున్న హర్షవర్థన్‌ను సంఘటన జరిగిన వెంటనే ఎందుకు

పిలిపించలేదన్నారు.   హడావుడి చేస్తున్నారే తప్ప సమగ్రంగా దర్యాప్తు జరిపిస్తున్నారా అని ప్రశ్నించారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు

 à°…సహ్యించుకుంటారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రవర్తనతో రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. వైసీపీ విశాఖ పార్లమెంట్‌ అధ్యక్షుడు

తైనాల  à°µà°¿à°œà°¯à±‌కుమార్‌ మాట్లాడుతూ జగన్‌పై హత్యాయత్నం కేసు దర్యాప్తులో కుట్ర నేపథ్యాన్ని ఎందుకు పరిగణలోని తీసుకోవట్లేదన్నారు. కేవలo  à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸à±‌తోనే

కేసును ముగించేద్దామని పోలీసు భావిస్తున్నారన్నారు. అసలు  à°†à°¯à°¨à°•à°¿ ఉద్యోగం ఇచ్చింది ఎవరు, దాడి వెనుక ఎవరి ప్రమేయం ఉందా అన్న కోణంలో ఎందుకు దర్యాప్తు చేపట్టడం

లేదని ప్రశ్నించారు. à°ˆ ప్రభుత్వంపై తమకి పూర్తి అపనమ్మకం ఉందన్నారు. డీజీపీని తక్షణమే మార్పు చేయాలన్నారు. à°ˆ విలేకరుల  à°¸à°®à°¾à°µà±‡à°¶à°‚లో విశాఖ పార్లమెంట్‌ సమన్వయకర్త

à°Žà°‚.వి.వి.సత్యనారాయణ, తిప్ప నాగిరెడ్డి,కేకే రాజు  à°µà°‚శీకృష్ణశ్రీనివాస్‌,  à°°à°®à°£à°®à±‚ర్తి,అనుబంద సంఘాల అధ్యక్షులు  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± పాల్గొన్నారు.

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media 

#vizag  #visakhapatnam  #ysr congress  #malla vijay prasad  #mvv satyanarayana  #city  #parliament  #convenor  #YS Jagan Mohan Reddy

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam