DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్వైన్ ఫ్లూ నిరోధానికి వైద్య పరమైన చర్యలు : కలెక్టర్ 

విశాఖపట్నం, అక్టోబర్ 30, 2018 (à°¡à°¿ ఎన్ ఎస్  DNS Online ) : విశాఖ జిల్లా వాసులను, వైద్య అధికారులను, కలవరపరుస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధి ని అదుపుచేసేందుకు అన్ని వైద్యపరమైన చర్యలు

తీసుకుంటున్నట్టు విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ జిల్లా లో

ఇప్పడివరకు ఎనిమిది స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయని తెలిపారు. వీరికి ప్రజా ఆసుపత్రి కింగ్ జార్జి ఆసుపత్రి, ఛాతీ ఆసుపత్రుల్లో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో

వైద్య చికిత్స జరుపుతున్నామన్నారు. ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పడి వరకు మొత్తం 38 కేసులు స్వైన్ ఫ్లూ కేసులు పాజిటివ్ గా నమోదయ్యాయన్నారు. ఈ వ్యాధి మొదటి దశలో

చిన్నపాటి జ్వరం, దగ్గు, ముక్కు కారడం వంటి లక్షణాలు ఉంటాయన్నారు. ఈ విధమైన గమనించినట్లయితే వెంటనే సమీపంలోని వైద్య శాలలకు వెళ్లి వైద్యులను సంప్రదించాలన్నారు.

దగ్గరలోని స్క్రీనింగ్ కేంద్రాల్లో పరీక్షలు చేయించుకోవాలన్నారు. పిల్లలు, వృద్దులు, డయాబెటిక్ పేషంట్లు కు త్వరగా చేరుతుందన్నారు. ప్రధాన ప్రజా రవాణా

కేంద్రాలైన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ కు చెందిన అన్ని ప్రధాన కేంద్రాల్లోనూ, రైల్వే స్టేషన్ లోనూ, ప్రసార సాధనాల్లో ఈ వ్యాధి పై ప్రజల్లో అవగాహనా

కలిగే విధంగా ప్రచారం చేయిస్తున్నామన్నారు. అదే విధంగా అర్బన్ ( పట్టణ ) ప్రాంతాల్లోను, గ్రామీణ ప్రాంతాల్లోనూ, ప్రచారం విస్తృతంగా చేస్తున్నామని తెలిపారు. ఈ

వ్యాధి పై సమగ్ర వివరాలు, ఇతర సమాచారాన్ని తెలుసుకోడానికి  à°œà°¿à°²à±à°²à°¾ అధికారి 9849902299 నెంబర్లలో సంప్రదించవచ్చన్నారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #collector  #praveen kumar  #swaine flu  #eradication  #APSRTC

Complex  #railway station

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam