DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రభుత్వానికి సిగ్గు లేదు, మాకు బుధ్ధి లేదు : తెలుగు దండు.

ప్రభుత్వానికి సిగ్గు లేదు, మాకు బుధ్ధి లేదు : తెలుగు దండు.

ఉత్తుత్తి కబుర్లు, గాలి రాతల్లో బాబు à°•à°¿ పోటీ లేదు. 

విశాఖపట్నం, నవంబర్ 1, 2018 (à°¡à°¿ ఎన్ ఎస్  DNS Online ) :

తెలుగు భాష అభ్యున్నతికి కృషి చేస్తున్నామని, మీడియాల్లో ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వానికి సిగ్గు లేదని, వాళ్ళ మాటలు నమ్మిన తెలుగుదండు ప్రతినిధునాలు

బుద్ది లేదని తెలుగుదండు ప్రతినిధులు మండిపడ్డారు. నవంబర్ 1 , ఎందరో మహనీయుల త్యాగఫలంగా ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. గత నాలుగేళ్ల వరకూ ఆంధ్ర ప్రదేశ్

అవతరణ దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకునేవారు. అయితే 2014 లో ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపోయిన తదుపరి ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు భాషను మృత భాషగానే మార్చేసింది

తెలుగుదేశం ప్రభుత్వం అని తెలుగుదండు ఆవేదన వ్యక్తం చేసింది. గురువారం ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం లోని మద్దిలపాలెం జాతీయ రహదారి

కూడలి వద్ద గల తెలుగుదండు సంస్థ ఆధ్వర్యవం లో తెలుగుతల్లి విగ్రహానికి అభిషేకం చేసి, ఘనమైన నివాళి అర్పించారు. ఈ సందర్బంగా తెలుగు భాష ను ఈ రాష్ట్రం లో అంతం

చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు కంకణం కట్టుకున్నాయని వ్యవస్థాపక అధ్యక్షులు పరవస్తు ఫణిశయన సూరి మండిపడ్డారు. ప్రముఖ రచయిత పరవస్తు చిన్నయ సూరి నాల్గవ తరం

వారసునిగా గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు భాష ప్రభావాన్ని పునరుజ్జీవం కల్పించేందుకు వాడ వాడాలా కృషి చేస్తున్నట్టు తెలిపారు. తెలుగు భాషకు తామే కృషి

చేస్తున్నామని, కోట్లు ఖర్చు చేస్తున్నామని, తెలుగు భాష మా వల్లే అభివృద్ధి చెందింది, అనే కల్లిబొల్లి కబుర్లు, గాలి మెడలు కట్టడం లో తెలుగుదేశం అధ్యక్షుడు

చంద్రబాబు ను మించిన వాడు లేదని ఎద్దేవా చేశారు. 

చంద్రబాబు కి చిత్తశుద్ధి లేదు :

ప్రముఖ సినీ నటుడు ఎన్ టి రామారావు తెలుగు భాషపై అభిమానం కొద్దీ తానూ

ప్రారంభించిన రాజకీయ పార్టీకి తెలుగు దేశం పార్టీ అని పేరు పెట్టారని, పేరుకు తగ్గట్టు ఆయన తెలుగు భాష కోసం కృషి చేశారన్నారు. అనంతర కాలం లో తెలుగు దేశం

చంద్రబాబు చేతిలోకి వెళ్ళాక తెలుగు భాషను పూర్తి గా విస్మరించి, భ్రష్టుపట్టించే విధంగా ప్రవర్తించారన్నారు. కొన్ని ఏళ్లుగా తెలుగు భాష ప్రాభవానికి నిరసనలు,

ఆమరణ దీక్షలు చేసిన మీదట, ప్రస్తుతం అధికారం లో ఉన్న చంద్రబాబు నాయుడు తెలుగు భాషా ప్రాధికార సంస్థ ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారన్నారు. ఇది కేవలం గాలిలో

రాతల్లాగానే ఉందన్నారు. ప్రతి పాఠశాలలో తెలుగు భాష గేటు బయటే ఉండిపోయిందన్నారు. వీళ్ళకి తెలుగు వాళ్ళ ఓటు మాత్రమే కావాలని, భాష అవసరం లేదన్నారు. 

పొరుగు

వారిని చూసినా సిగ్గు రాదా ?
తెలుగు ప్రాంతానికి ఇరుగు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఆయా ప్రాంతీయ భాషలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, ఆయా

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను అత్యంత వైభవంగా చేస్తున్నారని, ఇదే రోజు కర్ణాటక రాష్ట్రం కూడా ఆవిర్భవించిందని, అక్కడ ఈ రోజు రాజ్య దివస్ గా ఘనంగా సంబరాలు

చేసుకుంటుంటే. . .ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో లక్ష్మణా అంటూ ఆవేదన చెందుతుందన్నారు. అధికారం లో ఉన్న వారికి చిత్తశుద్ధి లేకపోవడమే దీనికి కారణమన్నారు. 


/> టిడిపి, బీజేపీ. వైకాపా, జనసేనల కు వ్యతిరేకంగా ప్రచారం 

మరో ఆరు నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున తెలుగుదండు రాష్ట్ర

వ్యాప్తంగా పర్యటించి, తెలుగు భాషకు అన్యాయం చేసిన తెలుగుదేశం పార్టీ, కనీసం తెలుగు ను పట్టించుకోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేన, ముందే మరిచిపోయి, తెలుగు

రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన భారతీయ జనతా పార్టీలకు వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తామన్నారు. ఈ యాత్రలో తెలుగు భాష అభిమానులను ఏక త్రాటిపైకి తీసుకు వచ్చి

తెలుగు భాష అభ్యున్నతికి  à°Žà°µà°°à± కృషి చేస్తారో వారికే ఓటు వెయ్యమని ప్రచారం చేస్తామన్నారు. అయితే తాము రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా రావడం లేదని, అయితే à°ˆ రాష్త్ర

ప్రజల్లో తెలుగు పట్ల చైతన్యం కల్పిస్తామన్నారు. à°ˆ కుహనా పార్టీలకు గట్టిగా బుద్ది చెప్తామన్నారు. 

ఈ వేడుకల్లో తెలుగు అధ్యాపకులు, ఆచార్య విశ్వేశ్వరం,

ప్రముఖ ప్రజా గాయకుడూ వంగపండు ప్రసాదరావు, టి ఎస్ కె అరుణ్ కుమార్, శంకర్ నీళ్లు, శ్రీ లక్ష్మి, ఉదయశ్రీ, పాత్రికేయులు నాగేశ్వరరావు, కవిదాసు, కృష్ణ చైతన్య, ఆంధ్ర

విశ్వ కళాపరిషత్ తెలుగు విభాగం విద్యార్థిని విద్యార్థులు, తెలుగు భాష అభిమానులు, పాత్రికేయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #telugu

dandu  #telugu talli  #andhra pradesh formation day  #november 1  #andhra pradesh  #government  #TDP  #telugu desam  #BJP  #Janasena

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam