DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అర్చకునిపై జరిగింది కచ్చితంగా మతోన్మాద హత్యే  : పరిపూర్ణానంద

రొచ్చులో నుంచి బయటకు రావాలని మీడియా కి సూచన :

ఆంక్షల మధ్యే అర్చకుని అంత్యక్రియలకు ....

పోలీసుల కళ్ళకి హంతకుడు సైకో లా కనపడ్డాడా ? 

వరంగల్, నవంబర్

2, 2018 (డిఎన్ఎస్  DNS Online) : à°ˆ దేశం లో హిందువులకు జీవించే హక్కు లేకుండా 
మతోన్మాదులు చేస్తున్నారని, వాళ్లకి ప్రభుత్వాలు రక్షణగా నిలిచాయని శ్రీ పీఠాధిపతులు స్వామి

పరిపూర్ణానంద తెలిపారు. శుక్రవారం స్థానికంగా నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన ఆవేదనాపూర్వక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఈ దేశం లో

హిందువులకి ఇళ్లల్లో కూర్చునే తమ ఆరాధనలు చేసుకునే అవకాశం కూడా లేకుండా ముస్లిం మతోన్మాదులు, పెట్రేగిపోతున్నారని మండిపడ్డారు. స్థానిక షిర్డీ సాయి ఆలయంలో గత

నెల 26 న ప్రార్ధనలు చేసుకుంటున్న అర్చకులు సత్యనారాయణ శర్మ ( 72 ఏళ్ళు ) పై ఎల్ బి నగర్ కు చెందిన ఒక మసీద్ ఇమాం సయ్యద్ సాదిక్ హుస్సేన్ భౌతికంగా దాడి చేసిన ఘటన లో ఆయన

 à°¤à±€à°µà±à°° గాయాలతో ఆసుపత్రిలో మృతి చెందడం జరిగిందన్నారు. 

ఈ దేశం లో హిందువులు ప్రశాంతంగా జీవించాలంటే హిందూ రక్షణ చట్టం రావాలని డిమాండ్

చేశారు. 

హిందువుకి నోరెత్తే అవకాశం లేదు :

ఈ దేశం లో హిందువులకు జీవించే హక్కు లేదని, ఈ అర్చకుని అంత్యక్రియలకు తానూ హైదరాబాద్ నుంచి కారు లో బయలు

దేరితే అడుగడుగునా పోలీసులు చెక్ పోస్ట్ ల పేరిట నానా హింస పెట్టి, అడ్డుకున్నారన్నారు. ఆఖరికి బస్సుల్లో అర్చకుని గ్రామానికి (మొగిళిచర్ల) చేరుకోవాల్సి

వచ్చిందన్నారు. తనను కదల నివ్వలేదని, అయితే ఒక హిందూ ధర్మ ప్రచార కర్తగా హిందువులకు అండగా నిలబడవలసిన కర్తవ్యమ్ తనపై ఉందన్నారు. అర్చకునికి అంత్య సంస్కారం లో

ఎటువంటి లోటు రాకుండా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. 

ఇది చిన్న విషయమా ?

అయితే ఈ విషయాన్ని స్థానిక పోలీసులు, ప్రభుత్వం చాలా చిన్న విషయంగా

తీసుకుందని, పైగా ఇమాం కు మతిస్థిమితం లేదని కేసుకూడా పెట్టిన దాఖలాలు లేవన్నారు. అయితే అతను ఒక మసీదులో ఇమాం గా చేస్తున్నాడు, అతనికి మతిస్థిమితం లేదని

పోలీసులు చెప్తున్నారు. అంటే మసీదుల్లో ఇమామ్ లు గా మతిస్థిమితం లేనివాళ్లనే పెట్టుకుంటున్నారా అని ప్రశ్నించారు. మైనారిటీలు గా ఉన్నవాళ్ళకి ప్రభుత్వాలు

అడుగులకు మడుగులు ఒత్తుతారా అని మండిపడ్డారు. వాళ్ళు తమ బాగోగులు చూసుకోవాలి, ప్రార్ధనలు చేసుకోవాలె తప్ప, ప్రక్క వాళ్ళని హత్య చేసే స్థాయికి పెట్రేగిపోతారా,

పైగా వీళ్ళకి ప్రభుత్వాలు వత్తాసు పలుకుతున్నాయన్నారు. దీనిలో మీడియా పాత్ర కూడా ఉందన్నారు. 

అమ్ముడు పోయిన మీడియా వాస్తవాలు తెలుసుకోవాలి :

వివిధ

వ్యక్తులు, శక్తులకు, అమ్ముడు పోయిన మీడియా వర్గాలు, ఇకనైనా వాస్తవాలు గ్రహించి, నిజాలను నిర్భయంగా వెలుగు లోకి తీసుకురావాలని స్వామిజి కోరారు. ఎక్కడో పరువు హత్య

జరిగితే నెలల తరబడి మరో పనేదీ లేకుండా ప్రచారం చేసిన ఈ వకాల్తా మీడియా చానెళ్లకు, ఈ అర్చకుని పై మతోన్మాదులు చేసిన హత్య కనపడక పోవటం చాలా సిగ్గు చేటన్నారు.

అర్చకుడు తన గుడిలో తన పరిధిలో ప్రార్ధనలు చేసుకుంటే పక్కవాళ్ళకి ఇబ్బందిగా ఉందంటూ వచ్చి హత్య చేసి వెళ్ళిపోతే ఎదో ఒక వీధి గొడవలాగా చూసిన ఈ మీడియా కి

జ్ఞానోదయం కలిగలని ఆశించారు.  

దీన్ని వదిలిపెట్టేది లేదు :

ఇక ఒక అర్చకునిపై దాడి మాత్రమే కాదని, ఇది హిందూ ధర్మం పై మతోన్మాదులు చేసిన కుట్రగానే

భావించామని, దీన్ని అంత సులభంగా వదిలి పెట్టె ప్రసక్తే లేదన్నారు. దీనిలో భాగస్వాములైన అందరినీ న్యాయపరంగా శిక్షించేవరకూ వదిలిపెట్టమన్నారు. ఇందులో పూర్తిగా

స్థానిక పోలీసుల ప్రమేయం కూడా ఉందని, వారి నిర్లక్ష్యం వల్లనే అర్చకులు మృతి చెందడం జరిగిందన్నారు. దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజనాధ్ సింగ్ కి ఫిర్యాదు

చేస్తామని తెలిపారు. à°ˆ ఘటన హిందూ వ్యతిరేక శక్తులు, వాళ్లకి మద్దతు పలుకుతున్న ప్రతి ఒక్కరికి హెచ్చరిక అని చెప్పారు. 

హిందువులకు అసహనం

కలుగుతోంది.:

ఎవడికో ఎదో తక్కువైందంటూ సాకు చూపించి, కుహనా మేధావులు, సినీ నటులు రచయితలూ ఈ దేశం లో అసహనం ప్రబలిపోతోంది అంటూ తమకు వచ్చిన అవార్డులు వెనక్కి

ఇచ్చేస్తున్నామంటూ చాలా కాలం నాటకాలుb ఆడారని, మరి వాళ్లకి ఈ అర్చకుని హత్య కనపడక లేదా అని ప్రశ్నించారు. మతోన్మాదులకు అండగా నిలిచే కుహనాదులకు గట్టిగా బుడ్డి

చెప్పాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. 
à°ˆ విలేకరుల సమావేశం లో బీజేపీ వరంగల్ శాఖ ప్రతినిధులు, సంఘ్ పరివార్ ప్రతినిధులు, పలు ఆలయాల అర్చకులు పాల్గొన్నారు. 

#dns 

#dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #warangal  #priest  #killed #islam #imam  #telangana  #government  #failure  #cbi  #swami paripoornananda

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam