DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజలకు ముంగిటకే విస్తృత తపాలా సేవలు : చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ సుబ్రహ్మణ్యన్.

విశాఖపట్నం, నవంబర్ 3, 2018 (డిఎన్ఎస్  DNS Online): ప్రజల చెంతకే తపాలా సేవలను విస్తృతంగా అందించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ పోస్ట్ మాస్టర్

జనరల్ సుబ్రహ్మణ్యన్ తెలిపారు. శనివారం నగరం లోని పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ మారుతున్న సాంకేతిక

విప్లవానికి అనుగుణంగా పోస్టల్ సేవలు అందిస్తున్నామన్నారు. 

బ్యాంకింగ్ సేవలు అద్భుతం :
à°—à°¤ అక్టోబర్ నెలలో  à°¦à±‡à°¶ వ్యాప్తంగా పోస్ట్ ఆఫీసుల్లో

బ్యాంకింగ్ సేవలను ప్రధాని నరేంద్ర మోడీ  à°ªà±à°°à°¾à°°à°‚భించారని, వీటి ద్వారా వివిధ బ్యాంకులు చేసే లావాదేవీలను ఇక పై తపాలా శాఖా సైతం నిర్వహిస్తుందన్నారు. ప్రతీ నగరం

లోనూ ఈ తపాలా బ్యాంకు లను నెలకొల్పే ప్రక్రియ జరుగుతోందన్నారు. విశాఖ నగరం లో మూడు కేంద్రాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయన్నారు. మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్

ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలను కూడా జరుపుకోవచ్చని, నగదు విత్ డ్రా చేయవచ్చన్నారు. మొబైల్ ద్వారా ఆపరేషన్స్ జరిపినట్లయితే పోస్టల్ సిబ్బంది ఈ నగదును ఇంటికి

తీసుకువచ్చి ఇచ్చే ఏర్పాటు కూడా ఉందన్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఏటీఎం లు అందుబాటు లో ఉండవని, ఉన్నా వాటిల్లో నగదు అరకొర ఉంటుందన్నారు. ఆ

విధమైన పరిస్థితుల్లో ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు పోస్టల్ బ్యాంకు ద్వారా నగదు విత్ డ్రా సదుపాయం కల్పించామన్నారు. 

తపాలా ద్వారా, పాస్ పోర్ట్ లను

ప్రజలకు ఇళ్లకే అందించడం, రవాణా శాఖ సంబంధిత విలువైన పత్రాలు, వివిధ బ్యాంకులు అందించే డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, తదితర అత్యవసర పాత్రలను అత్యంత

భద్రంగా ఖాతాదారులకు చేరవేస్తుందన్నారు. 

తపాలా శాఖా కేవలం డెలివరీ మాత్రమే చేస్తుంది :

అన్ని ప్రభుత్వ విభాగాలు ప్రజలకు అందించే విలువైన పత్రాలను

తపాలా విభాగం ద్వారానే చేరవేస్తుందన్నారు. పాత్రలను తాము తయారు చెయ్యమని, ఆయా విభాగాలు పోస్టల్ శాఖ ద్వారా బుక్ చేసిన కవర్లను చేరవేస్తుందన్నారు. ఈ క్రమం లో

జాప్యం జరగదని, à°ˆ వస్తువు ఎక్కడ ఉందో ఆన్ లైన్ ద్వారా ట్రాకింగ్ చేయవచ్చన్నారు. 

త్వరలోనే మరిన్ని నియామకాలు :
సామాన్యులకు అందుబాటులో ఉండే ప్రజా రవాణా

సంస్థ భారతీయ తపాలా సంస్థలో త్వరలోనే మరిన్ని నియామకాలు చేపడుతున్నట్టు తెలిపారు. గతం లో కొన్ని సేవలకు పరిమితమైన ఈ శాఖా లో ఇతర ప్రభుత్వ సంస్థలకు ధీటుగా సేవలను

అందించేందుకు అదనపు సిబ్బంది సహకారం తీసుకుంటున్నామన్నారు. 

ఇతర దేశాలకు రవాణా : 
భారతీయ తపాలా శాఖా ద్వారా కేవలం దేశం లోని ప్రాంతాలకే కాకుండా సుమారు 150

దేశాలకు అంతర్జాతీయ రవాణా సదుపాయం ఉందన్నారు. సమీపం లోని తపాలా కార్యాలయం లో పార్సిల్ ను బుక్ చేయవచ్చన్నారు. అవసరమైన వాటికి తపాలా శాఖే ప్యాకింగ్ కూడా

చేస్తుందని తెలిపారు. సురక్షితంగా మీరు కోరిన విదేశీ ప్రాంతానికి చేరుస్తుందన్నారు. ఆయా దేశాల సమయాలను బట్టి పార్సిల్ చేరుతుందన్నారు. 

ఫిర్యాదులకు :

పోస్టల్ ఫిర్యాదులను 1924 టోల్ ఫ్రీ నంబర్  à°²à±‹ సంప్రదించవచ్చని తెలిపారు. 

ఈ విలేకరుల సమావేశం లో అసిస్టెంట్ డైరక్టర్ అరవింద్ పాండా, సీనియర్ పోస్టల్

సూపరింటెండెంట్ కె ఎస్ వెంకటేశ్వరావు, నాగేశ్వర రావు,  ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు à°“ ప్రయివేట్ సంస్థకు చెందిన ప్రత్యేక కవర్ ను ఆయన

ప్రారంభించారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns media  #dns news  #dnsmedia  #vizag  #visakhapatnam  #postal department  #chief post master general  #post office  #SSPN  #venkateswara rao  #post bank

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam