DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆత్మ గౌరవం కోసమే అందరితో జతకట్టాం : మంత్రి అయ్యన్న

స్వలాభం కంటే రాష్ట్ర ప్రయోజనమే ముఖ్యం : 

నర్సిపట్నం, నవంబర్ 3, 2018 (డిఎన్ఎస్  DNS Online): ఆంధ్రుల ఆత్మ గౌరవాన్నినిలబెట్టడం కోసమే అందరితో 
 ( రాజకీయంగా విభేదించే

వారితో సైతం ) జతకట్టామని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. శనివారం నర్సీపట్నం లోని క్యాంపు కార్యాలయం లో నిర్వహించిన

విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న చంద్ర బాబు నాయుడు ను తక్కువ అంచనా వెయ్యరాదన్నారు. నరేంద్ర మోడీ తెలుగు వారి ఆత్మ గౌరవం

మీద దెబ్బ కొట్టారని అందుకే ఆయనకి వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్ష పార్టీలతో కలిసి పోరాడుతున్నామని తెలిపారు. అతి కష్టమైనప్పడికీ రాజాకీయంగా విభేదాలు ఉన్న

పార్టీలతో సైతం కలిసి పనిచేసేందుకు సిద్దపడ్డామన్నారు. దీనిలో కేవలం ఆంధ్ర ప్రదేశ్ ప్రజల అభివృద్దే ఉందన్నారు. 

ఎంతో చర్చించే నిర్ణయించారు :

దివంగత

నేత ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగు ఆత్మగౌరవం బాటలోనే చంద్రబాబు పయనిస్తూ దేశ రక్షణకు, భారతీయుల సంక్షేమానికి ముందడుగే సారన్నారు. మోడీ చేసిన నోట్ల రద్దు లో

గందరగోళం సృష్టించిందని, జిఎస్టి అయితే ఇప్పటికీ ఎవరికీ అర్థంకాని పరిస్థితి ఉందని చెప్పారు. తనకు వ్యతిరేకంగా ఉన్న వారిపై దాడులు చేయించడం, ఐటి అధికారుల

ద్వారా భయపెట్టడం, బెదిరించడం చేస్తున్నారన్నారు. పైగా రాష్ట్ర విభజన సమయం లో ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడిగినందుకు అడుగడుగునా శిక్షించారని ఆవేదన వ్యక్తం

చేశారు. ఢిల్లీ గద్దెకు గట్టిగా బుద్ది చెప్పేందుకు తగిన పరిష్కార మార్గాలను అందరితో కలిసి చర్చించిన తదుపరే  à°°à°¾à°œà°•à±€à°¯ పరంగా విభేదాలున్న కాంగ్రెస్ పార్టీతో

జతకట్టేందుకు సైతం ఎన్నో మెట్లు దిగవలసి వచ్చిందని మంత్రి తెలిపారు. 

ఇందిర కూడా ఇంతగా కక్ష సాధించలేదు :

భారతీయ ఉక్కు మహిళగా పేరు పొందిన మాజీ ప్రధాని

ఇందిరాగాంధీ కూడా తన శత్రువుల పై కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఇంత లా వాడుకో లేదని అధికారులే చెప్తున్నారన్నారు. రాష్ట్రం విడిపోయి, పూర్తిగా నష్టపోయి కష్టాల్లో

ఉన్నప్పుడు మనకు సహాయం చేసి గట్టెక్కిస్తా రని నమ్మి రాష్ట్రం మేలు కొరకు బీజేపీ తో  à°¸à±à°¨à±‡à°¹à°‚ చేశామన్నారు. మోడీ మాట తప్పారని, హామీలు మరిచారని, విభజన చట్టంలో ఉన్న

నిధులను కూడా ఇవ్వడం లేదని, హామీలు సక్రమంగా అమలు చేయడం లేదని అన్నారు. రాను రాను రాష్ట్రం పై కక్ష కట్టారు అన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడంతో 100%

నిధులు కేంద్రమే ఇవ్వాల్సి ఉండగా, నిధులు ఇవ్వకుండా చేయడం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం చేస్తున్నారన్నారు. అమరావతి ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు నీకంటే

సుందరమైన నగరాన్ని నిర్మించాలని చెప్పారని ఆనికి ఏం నిధులు ఇచ్చారని నిలదీశారు. 

బలవంతుని పై విజయానికి సమష్టి పోరాటమే చెయ్యాలి :

ప్రస్తుతం మోడీ బలమైన

వ్యక్తి అని ఆయన విషసర్పం ల తయారీ రాక్షసునిగా వ్యవహరిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. ఆయన ప్రభావం తగ్గించాలన్నా, పక్కకి తప్పించాలన్నా అన్ని పార్టీలు కలిసి

పని చేయాలన్నారు.  à°•à°¾à°‚గ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ప్రజలు బట్టలూడదీసి కొడతారని ఇదివరలో చెప్పారు కదా అని విలేకరులు à°…à°¡à°¿à°—à°¿à°¨  à°ªà±à°°à°¶à±à°¨à°•à± బదులిస్తూ నిజమే కానీ

ప్రస్తుత పరిస్థితుల్లో అనివార్యమైందని, ఈ విషయమై ముఖ్యమంత్రి తనతో చర్చించారని, ఆయన వాదనతో తాను ఏకీభవించినట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

ఇదివరలో కూడా జాతీయ స్థాయిలో సమన్వయకర్తగా నాయకుడిగా వ్యవహరించారని గుర్తుచేశారు. ఆయన వలననే జాతీయ స్థాయిలో అన్ని పార్టీలు ఏకం అయ్యాయన్నారు. అందుకు బహుజన

సమాజ్ పార్టీ నాయకురాలు మాయావతి ని ఉదాహరణగా ఆయన చెప్పారు.

 

#dns  #dnslive #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #narsipatnam  #minister ayyanna  #ayyanna patrudu  #andhra pradesh  #telugudesam party  #tdp

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam