DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాముడి పై లేని కంగారు అయ్యప్ప పై వచ్చిందా?  : విహెచ్ పి

రామ జన్మభూమి హిందువులదే, మందిరం కట్టాల్సిందే : విహెచ్ పి 

విశాఖపట్నం, నవంబర్ 19, 2018 (డిఎన్ఎస్ DNS Online ) : అయోధ్యలో రామ జన్మ భూమి పై సర్వాధికారాలు హిందువులవే నని, రామ

జననం జరిగిన రామ జన్మభూమిలో శ్రీరామ మందిరం కట్టాల్సిందే నని అఖిల భారత సంయుక్త ప్రధాన కార్యదర్శి వై. రాఘవులు డిమాండ్ చేశారు. సోమవారం నగరం లో నిర్వహించిన

విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం దేశ వ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్వహించాలని విశ్వ హిందూ పరిషత్ నిర్ణయించింది.

స్వాతంత్య్రం వచ్చిన ఏడూ దశాబ్దాల తర్వాత కూడా హిందూ సమాజం రామ మందిరం కోసం ఎదురు చూడాల్సిరావడం చాలా విచారకరం అన్నారు. అయితే న్యాయాధీశుల తీర్పు కోసం

శాశ్వతంగా ఎదురు చూస్తూ కూర్చోడవడం కంటే చట్ట సభల మీద ఒత్తిడి తీసుకురావడం ద్వారా అయోధ్యలో రామ మందిరం చట్టం ద్వారా సాధించే ప్రయత్నాన్ని గట్టిగా

ప్రారంభిస్తున్నామన్నారు. 
ఇటీవల కాలంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులు హిందువుల మనోభావాలు పూర్తిగా దెబ్బతీసేవిధంగా ఉన్నాయని మండిపడ్డారు. దశాబ్దాల తరబడి

కోట్లాది మంది పోరాడుతున్న రామ మందిరం పై ఇవ్వవలసిన తీర్పును మురగబెట్టారని,  à°¶à°¬à°°à°¿à°®à°² లో అయ్యప్ప ఆలయం లోకి కొన్ని వయసుల మహిళలకు ప్రవేశం లేదంటూ à°’à°• ముస్లిం వేసిన

పిటిషన్ ను అర్ధరాత్రి తప్పుడు నిర్ణయాలు ఇచ్చేసిందన్నారు. అసలు హిందూ ఆలయ వ్యవస్థల్లో ఇతర మతాలు, కోర్టుల జోక్యాన్ని తప్పు పట్టారు. 

మందిర నిర్మాణ వ్యవహారం

పై అన్ని వర్గాలతోనూ సంప్రదింపుల కాలం  1991 లోనే పూర్తి అయినా న్యాయాధీశుల నిర్ణయం కోసం ఇంకా ఎదురుచూపులు చూడాల్సివస్తూందని మండిపడ్డారు. à°ˆ నేపథ్యంలో రామభక్త

ప్రభుత్వమే అధికారం లో ఉన్నందున సానుకూల నిర్ణయాన్ని ఆశిస్తున్నామన్నారు. సంత్ ఉచ్చాధికర సమితి 2018 అక్టోబర్ 5 à°µ  à°¤à±‡à°¦à±€à°¨ న్యూఢిల్లీ లో సమావేశమై అన్ని కోణాల్లో

సమస్యను పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి రామ జన్మభూమిపై చట్టాన్ని ఆమోదింపచేయాలని కోరింది. ఆ చట్టం ద్వారా రామ జన్మ భూమికి ఉన్న అన్ని అడ్డంకులను తొలగించి

మందిర నిర్మాణాన్ని వెంటనే ప్రారంభింపచేయాలని కోరింది. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు అక్టోబర్ లో దేశ వ్యాప్తంగా సభలు, సమావేశాలు, నిర్వహించి రామ మందిర

సందేశాన్ని ప్రజలకు చేరయవేయడం జరిగిందన్నారు. నవంబర్ నెలలో పార్లమెంట్ సభ్యులందరినీ కలిసి రామజన్మ భూమికి మద్దతు తెలియచేయాల్సిందిగా విజ్ఞప్తి

చేస్తున్నామన్నారు. పార్లమెంట్ లో రామజన్మ భూమి అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు అనుకూలంగా వ్యవహరించాలని, మద్దతు ప్రకటించాల్సిందిగా ఎంపిలను కోరడం

జరుగుతోందన్నారు. ప్రతినిధి వర్గం ద్వారా ఈ మేరకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు కు రామ జన్మభూమి తీర్మాన ప్రతులను వినతి పత్రాల రూపంలో

అందించనున్నామని తెలిపారు. ఇక డిసెంబర్ నెలలో రామ మందిర నిర్మాణ ఉద్యమాన్ని ప్రజలు, రామ భక్తుల్లోకి తీసుకు వెళ్లే ఉద్దేశ్యంతో ఆలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాల

వద్ద యజ్ఞాలు, రామనామ సంకీర్తనలు, భజనలు పెద్ద ఎత్తున నిర్వహించాలని తీర్మానించడం జరిగిందన్నారు. ప్రతి ఆరాధన స్థలం వద్ద ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగేలా

చర్యలు తీసుకున్నామని తెలిపారు. 
విదేశీ అక్రమణదారుడైన బాబర్ శ్రీ rama  à°œà°¨à±à°® భూమి మందిరాన్ని 1526 లో కూలగొట్టి అక్కడ మసీదు నిర్మాణం చేశాడన్నారు. à°ˆ ఘటన జరిగిన  490

సంవత్సరాలు నుంచి నేటి వరకూ à°ˆ జన్మభూమి స్థలం కోసం రామభక్తులు ఉద్యమాలు, యుద్దాలు నిరంతరం చేస్తూనే ఉన్నారన్నారు. ఇప్పడి వరకూ జరిగిన  à°‰à°¦à±à°¯à°®à°¾à°²à±, 76 యుద్దాల్లో

సుమారు మూడు లక్షల మంది రామభక్తులు బలిదానం చేసారని ఆవేదన వ్యక్తం చేశారు. నానాటికి ఉద్యమం తీర్వతరం అవుతూనే ఉందని, ఈ ఉద్యమం దేశానికే పరిమితం కాకుండా

అంతర్జాతీయ స్థాయికి చేరిపోయిందన్నారు. వివిధ దేశాల్లోని రామ భక్తులు ఉద్యమం లో పాల్గొంటున్నారన్నారు. ఈ వాస్తవాలను ప్రజా ప్రతినిధులు గమనించాలని తెలిపారు.

వీటిని గుర్తించి పార్లమెంట్ లో రామ జన్మభూమి చట్టాన్ని చేసే విధంగా ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నారు. రామ జన్మభూమి లో శ్రీ రామ మందిర నిర్మాణం చట్టప్రకారం,

ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జరగాలని ఆశిస్తున్నారు. 
ఈ విలేకరుల సమావేశం లో విశాఖ జిల్లా విశ్వ హిందూ పరిషత్ ప్రాంత సహా కార్యదర్శి జి. సుబ్రహ్మణ్యం, ప్రాంత

సహా సంఘటన కార్యదర్శి శివశంకర్, విశాఖ జిల్లా అధ్యక్షులు నీలకంఠం, బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యులు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. 

 

#dnsnews  #dnsmedia  #dnslive  #dns news  #dns live  #dns media  #dns  #vizag 

#visakhapatnam  #vhp  #ayodhya  #rama janmabhumi #rama mandiram

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam