DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సత్యసాయి కి జరపవలసింది జయంతి కాదు జన్మదినమే 

విశాఖపట్నం, నవంబర్ 23 , 2018 (డిఎన్ఎస్ DNS Online): ఉన్న కుగ్రామం నుంచి కదలకుండా ఖండాతరాల దేశాధినేతలు సైతం ఆలోచింపచేసే, కదిలించిన మహనీయులు సత్యసాయి బాబా గా ప్రసిద్ధి

కెక్కిన సత్యనారాయణ రాజు. ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి చాలా కుగ్రామం. 93 ఏళ్ళ క్రితం అక్కడ జన్మించిన సత్యసాయి పేరు వినని వారు ఈ భూమిపై

ఉండరు అంటే అతిశయోక్తి కాదు. దీనికి ప్రధాన కారణం ఆయన పాటించిన ధర్మం. సత్య ధర్మ, శాంతి ప్రేమ. ఈ నాలుగు మార్గాలని ఆయుధాలుగా చేసుకుని, ప్రపంచాన్ని జయించారు. విద్య,

వైద్యం, కరువు జిల్లాలు, మహానగరాల ప్రజలకు దాహార్తి తీర్చిన భగీరధుడుగా, సుదీర్ఘ మహమ్మారి రోగాలను ఆధునిక చికిత్సల ద్వారా రూపుమాపే ధన్వంతరిగా, à°¸à±‡à°µà°²à°‚దించి

ప్రపంచానికి మార్గదర్శకులయ్యారు.  à°ªà±à°°à°ªà°‚à°š వ్యాప్తంగా 166 దేశాలలో 10,000 సత్యసాయి సేవా సంస్థలు ఆధ్వర్యవంలో సత్య సాయి సేవా సంస్థల ప్రత్యక్ష పర్యవేక్షణ లో గాని, అనుబంధ

సేవా సంస్థల అధ్వర్యంలో గాని పెక్కు విద్యా, వైద్య , సేవా, దాన కార్యక్రమాలు నేటికీ  à°¨à°¡à±à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°¯à°¿. 

ప్రపంచ స్థాయి మేటి విద్య : కేజీ నుంచి పీజీ, పీహెచ్ డీ ల

వరకూ అన్ని స్థాయిల విద్యనూ అగ్రస్థాయిలో అందిస్తున్న ఏకైక సంస్థ నేతృత్వం లో  à°—ురుకులాల నుంచి  à°¸à°¤à±à°¯à°¸à°¾à°¯à°¿ హైయ్యర్ స్టడీస్ వరకూ, మహిళలకు ప్రత్యేక కళాశాలలు

కూడా,  à°¦à°¿à°—్విజయంగా నడుపబడుతున్నాయి. à°ˆ సంస్థల్లో సీటు లభించిందంటే వారి జీవితం సాఫల్యం చెందినట్టే అని ప్రపంచ మేధావులు ఉద్భోదిస్తుంటారు. 


అత్యాధునిక

వైద్యం పేదల చెంతకే : 
పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ (Sri Sathya Sai Institute of Higher Medical Sciences) 220 పడకలు గల ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. అప్పటి

ప్రధాని పి.వి.నరసింహారావుచే 1991 నవంబరు 22à°¨ ప్రారంభింపబడింది.  à°¬à±†à°‚గళూరులోని శ్రీ సత్యసాయి ఇనస్టిట్టూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అన్ని హంగులూ à°—à°² 333 పడకల ఆసుపత్రి.  à°‡à°¦à°¿ 2001

జనవరి 19à°¨ అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయిచే ప్రాంభింపబడింది.  à°‡à°µà°¨à±à°¨à±€ పేదవారికి ఉచితంగా వైద్య సదుపాయాలందిస్తున్నాయి.  à°à°ªà±à°°à°¿à°²à± 2004 నాటికి 2,50,000 మందికి బెంగళూరులో

ఉచిత చికిత్స లభించింది.  à°…లాగే బెంగళూరు వైట్‌ఫీల్డ్ల్‌లోని సత్యసాయి జనరల్ హాస్పిటల్ లక్షలాదిమందికి ఉచిత వైద్యం అందించింది.  à°‡à°‚à°•à°¾ ఎన్నో వైద్యశాలలు

గ్రామీణ పేదవారికి వైద్య సదుపాయాలు ఉచితంగా కలుగజేస్తున్నాయి. 

త్రాగు నీరు
అనావృష్టి ప్రాంతమైన అనంతపురం జిల్లాలో అనేక మంచినీటి ప్రాజెక్టులు

లక్షలాది ప్రజలకు త్రాగునీరు అందిస్తున్నాయి.  à°šà±†à°¨à±à°¨à±ˆ నగరానికి కూడా సత్యసాయి సంస్థల అధ్వర్యంలో 200కోట్ల రూపాయల పైన ఖర్చుతొ నిర్మించిన ఎంతో ఉపయోగకరమైన

ప్రాజెక్టులు త్రాగునీరు సరఫరా చేస్తున్నాయి   గోదావరి నదినుండి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు నీరు సరఫరా చేసే ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది.  à°‡à°‚à°•à°¾ మెదక్,

మహబూబ్ నగర్ జిల్లాలలోనూ, మహారాష్ట్ర లోని లాతూర్ జిల్లాలోను పెద్ద ప్రాజెక్టులు నిర్మించబడ్డాయి లేదా ప్రతిపాదనలో ఉన్నాయి. 

కోకొల్లలుగా వైద్య శిబిరాలు :
/> సత్యసాయి సేవ సంస్థల ఆధ్వర్యవంలో రమారమి నెలకో మారు ఉచిత వైద్య శిబిరాలు జరుగుతూనే ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లోని పేదల చెంతకే మేటి వైద్యులు స్వచ్చందంగా సేవలు

అందించేందుకు ముందుకు వస్తుంటారు. వీరిలో అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు తీసుకున్న వారు సైతం ఉండడం గమనార్హం. తదుపరి, అవసరమైన వారికి శాస్త్ర చికిత్సలు

సైతం ఉచితంగానే నిర్వహించిన ఘటనలూ ఉన్నాయి. 

లక్షలాదిగా సేవా కార్యక్రమాలు :
బాలల స్థాయిలో బాలవికాస్ పేరిటా చిన్నారులకు మంచి పౌరులుగా తయారయ్యే విధంగా

తగిన కధలు, కథానికలు, స్ఫూర్తిదాయక ప్రదర్శనలు అందిస్తుంటారు. యువతీ యువకులకు సేవాదళ్ పేరిట జరిగే శిక్షణా తరగతుల్లో ఆధ్యాత్మికత,  à°¦à±‡à°¶ భక్తి, సేవ తత్పరత తో కూడిన

అంశాలను తెలియచేస్తుంటారు. వీరిని సేవా కార్యక్రమాల్లో నేరుగా పాల్గొనేందుకు తగిన శిక్షణ, సూచనలు అందించడం జరుగుతుంది. 

నామ స్మరణ : సత్యసాయి ఆదేశం నామ

స్మరణే, ప్రతి పనిలోనూ స్వామి నామాన్ని తలుచుకుంటూ పని చెయ్యడం ద్వారా చేసే పనిలో చిత్తశుద్ధి కలగడం తో పాటు, ఆ పనికి పవిత్రత చేకూరుతుందన్నది సాయి సందేశం. ఆయన

సందేశాన్నీ ఆదేశం à°—à°¾ ప్రతి పలకరింపులోనూ సాయి నామాన్నే తలుస్తూ సాయి సంఘ కుటుంబ సభ్యుల కార్యాచరణ సాగుతుంది. 

ఒక్కరేంటి  à°¸à°¤à±à°¯à°¸à°¾à°¯à°¿ ని కలవని దేశాధినేతలు

లేరంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రాల్లోని కరువు ప్రాంతాల్లోని ప్రజల దాహార్తిని తీర్చేందుకు తగిన మంచినీటి సాధక ప్రోజక్టుల నిర్మాణం చేపట్టామని సత్యసాయి తలుపు

తట్టిన ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. వారి ఆకాంక్ష మేరకు అనంతపురం, చెన్నై, ఉభయ గోదావరి, తదితర ప్రాంతాల్లో నేటికీ నిరంతరం సత్యసాయి మంచినీటి పథకం కొనసాగుతూనే

ఉంది. 

సమాజ సేవే పరమావధిగా భక్తులకు మార్గదర్శకం చేసి, ప్రతి పనిలోనూ దర్శనం ఇచ్చే సత్యసాయి కి నిత్యం జరపవలసింది జన్మదినోత్సవాలే తప్ప జయంతులు

కాదు. 

 

 

#dns  #dnslive  #dns live  #dns media  #dns news  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #sathya sai  #birthday  #celebrations  #puttaparty  #mvp colony  #sathya sai higher education  #sathya dharma shanti prema

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam