DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బషీర్ బాగ్ మరణ కాండ, అయిపోయిన చరిత్ర, దాంతో పనిలేదు, : సీపీఐ నారాయణ

విశాఖపట్నం, నవంబర్ 26, 2018 (డిఎన్ఎస్ DNS Online): బషీర్ బాగ్ మృత్యుఘోష అయిపోయిన చరిత్ర అని, దాంతో పని లేదంటూ భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ

చేసిన ప్రకటన సంచలనంగా మారింది. డిసెంబర్ లో జరుగనున్న పార్టీ జాతీయ సమావేశాల ఏర్పాట్లపై సోమవారం విశాఖ వచ్చిన అయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్బంగా బషీర్

బాగ్ ఘటనకు  à°•à°¾à°°à°£à°®à±ˆà°¨ చంద్రబాబు నాయుడు తో మళ్ళీ ఎందుకు జతకట్టారు అని DNS à°…à°¡à°¿à°—à°¿à°¨ ప్రశ్నకు అయన à°ˆ విధంగా జవాబిచ్చారు. బషీర్ బాగ్ ఘటన జరిగిపోయిందని, దాన్ని ఇప్పుడు

పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. దానికి కారణమైన చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేయడానికి కేంద్ర కమిటీ నిర్ణయించిందన్నారు. 

మాకు అధికారమే లక్ష్యం : 
/> గడిచిపోయినా ఘటనలు ఉద్యమాల నేపధ్యం ప్రస్తుతం అప్రస్తుతం అని, అధికారం లోకి రావడం కోసమే మహా కూటమి లో చేరినట్టు నారాయణ తెలిపారు. దీనిలో భాగంగానే తెలంగాణ లో

కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలతో జతకట్టామన్నారు. అదే కూటమి ఆంధ్రా లోనూ కొనసాగుతుందని, తెలిపారు. అయితే ఆంధ్ర లో జనసేన పార్టీతో సీపీఐ కి జోడీ ఉంది కదా, మరి

అతన్ని విడిచిపెట్టేస్తారా అన్న ప్రశ్నకు అయన తమకు అధికారమే లక్ష్యమని, ఈ కూటమితో నచ్చితే అయన కూడా రావచ్చని తెలిపారు. అయితే ఏ ప్రశ్నకు నారాయణ స్పష్టమైన సమాధానం

ఇవ్వకపోవడం గమనార్హం. 

 

ఆగస్టు 28 ,2000 లో బషీర్ బాగ్ ఘటన à°’à°• చీకటి రోజు :  

వామ పక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు రైతులు, కార్యకర్తలు  à°µà°¿à°¦à±à°¯à±à°¤à± పెంపుపై  à°†à°—స్టు 28 ,2000

లో  à°¨à°¿à°°à°¸à°¨ ర్యాలీ చేస్తున్న ఉద్యమకారులపై బషీర్ బాగ్ లో నాటి చంద్రబాబు నాయుడు క్రూరత్వానికి నిదర్శనంగా ముగ్గురు బలై పోయారు. à°ˆ ఘటనకు ప్రధానకారణం వామ పక్షాలు

ఇచ్చిన పిలుపు మేరకు రైతులు, కార్యకర్తలు à°ˆ ర్యాలీలో రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డిలు మృత్యువాతపడ్డారు. à°ˆ ఘటన దేశాన్నే కుదిపేసింది. ఉమ్మడి  à°†à°‚ధ్ర

ప్రదేశ్ చరిత్రలో అత్యంత దుర్భర మైన ఘటన బషీర్ బాగ్ లో ఉద్యమకారులపై జరిగిన మారణ కాండ.  à°ˆ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అలాంటి ఘటనకు కారణమైన సీపీఐ

పార్టీ నాటి ఘటనను కనీసం పట్టించుకున్నట్టు à°—à°¾ కూడా అనిపించడం లేదని ఈయన వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. 

 

డిసెంబర్ లో విశాఖలో జాతీయ సమావేశాలు :
భారతీయ

కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమావేశాలు డిసెంబర్ 18 నుంచి 21 వరకు విశాఖ వేదిక గా జరుగుతాయని నారాయణ తెలిపారు. వాటి ఏర్పాటుకై తానూ విశాఖ వచ్చినట్టు

వివరించారు.

 

 

#dnsnews   #dnsmedia  #dnslive  #dns news  #dns live  #dns media  #dns  #visakhapatnam  #vizag  #CPI  #Narayana  #Narendra Modi  #demonitisation


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam