DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎన్నికల బరికి భాజాపా సిద్ధం, అభ్యర్థుల పేర్లు ప్రకటన 

విశాఖపట్నం, నవంబర్‌ 28, 2018 (డిఎన్‌ఎస్‌): అతి త్వరలో జరుగనున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభ నియోజకవర్గ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సన్నద్ధం అవుతోంది. దీనికై

ప్రతినిధులను ప్రకటించడం ద్వారా శ్రీకారం చుట్టింది. ముందస్తుగా విశాఖ నగర పరిధిలో విశాఖ ఉత్తరం, పశ్చిమం, తూర్పు, దక్షిణం, గాజువాక పరిధిలో పటిష్టత కల్గిన

అభ్యర్థులను ఎంపిక చేసింది. ప్రాధమిక అంచనాల ప్రకారం ఈ పేర్లను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అయితే రాను రాను జరిగే పరిణామాల ఆధారంగా ఈ అభ్యర్థులు ఎన్నికల బరిలో

నిలుస్తారా లేదా వీరి స్థానాల్లో కొత్తవారిని మారుస్తారా అన్నది తేలాల్సి యుంది. 
విశాఖపట్నం శాసన సభ నియోజకవర్గాలకు ఇంచార్జి లు, కన్వీనర్లు గా భారతీయ

జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ నిమయకాలు జరిపారు. రాష్ట్ర కార్యవర్గం తో సుదీర్ఘంగా చర్చలు జరిపిన అనంతరం బుధవారం రాత్రి ఈ నియామకాలను

ప్రకటించారు. దీనిలో భాగంగా విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం కన్వీనర్ à°—à°¾ విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం శాసన సభ్యులు పి విష్ణుకుమార్ రాజు,  à°‡à°‚చార్జి à°—à°¾ సీనియర్

నాయకులు పి వి నారాయణ రావు,  à°µà°¿à°¶à°¾à°–పట్నం తూర్పు నియోజకవర్గం కన్వీనర్ à°—à°¾ సారిపల్లి సత్యనారాయణ,  à°‡à°‚చార్జి à°—à°¾ ఏ. కేశవ కాంత్, విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం

కన్వీనర్ à°—à°¾ కొప్పుల రామ్ కుమార్,  à°‡à°‚చార్జి à°—à°¾ వల్లూరి మోహన్ రావు, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం కన్వీనర్ à°—à°¾ బుద్ధా చంద్రశేఖర్,  à°‡à°‚చార్జి à°—à°¾  à°•à±†à°µà°¿à°µà°¿

సత్యనారాయణ, గాజువాక  à°¨à°¿à°¯à±‹à°œà°•à°µà°°à±à°—à°‚ కన్వీనర్ à°—à°¾ పులుసు జనార్ధన రావు ( విశాఖ మాజీ మేయర్), ఇంచార్జి à°—à°¾ సంతోష్ కుమార్ఏ సింగ్ లను నియమిస్తూ అధికారికంగా ప్రకటన విడుదల

చేశారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #BJP

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam