DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రేషన్ సరఫరాలో మరింత చిత్తశుద్ధి వహిస్తాం : రామకృష్ణ రెడ్డి 

విశాఖపట్నం, నవంబర్ 30 ,2018 (డి ఎన్ ఎస్ DNS Online ): ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ప్రతి నెల అందించే బియ్యం, పప్పు, నూనె, చిరు ధాన్యాలు క్రమం తప్పకుండా

ప్రజలకు అందిస్తున్నట్టు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ చల్ల రామకృష్ణ రెడ్డి తెలిపారు. శుక్రవారం నగరం లోని ఓ హోటల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన

మాట్లాడుతూ అత్యంత విలువైన నిత్యావసర సరకులను అతి తక్కువ ధరకే పౌర సరఫరాల శాఖా స్థానిక రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు అందిస్తోందన్నారు. సరకుల రవాణా, పంపిణీ తదితర

అంశాలను తెలియచేసారు. నిరుపేదల ఆకలి తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని ఈ పధకం అమలు లో ప్రతి ఒక్కరు శ్రద్ద వహించి నాణ్యత, తూకంలో

నిబద్దత ఉండి ఎటువంటి లోపాలు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రాష్ట్రం లో మొత్తం 1 44 36 000 కార్డులు, 29 వేల డీలర్లు, 268 ఎం ఎల్ ఎస్ పాయింట్లు ఉన్నాయని, 220 వేల

మెట్రిక్ టన్నుల బియ్యం మరియు అందుకు అనుగుణంగా పంచదార, నూనె, చిరుధాన్యాలైన రాగులు, జొన్నలు, అతి తక్కువ ధరకే అర్హులందరికీ అందిస్తున్నట్టు వివరించారు. ఈ సరఫరా

లో ఎటువంటి జాప్యం, లోపాలు జరిగినట్లయితే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పడికే ఆదేశాలు జారీ చేశారన్నారు. తమిళ నాడు సాల్ట్

కార్పొరేషన్ నుంచి ఆరోగ్యానికి దోహదం చేసే ఉప్పును దిగుమతి చేసుకుని 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు అందిస్తున్నామన్నారు. మధుమేహం వంటి వ్యాధులు రాకుండా ఉండే

విధంగా చిరుధాన్యాలను మంచి నాణ్యత కలిగినవి అందిస్తున్నామని తెలిపారు. సరకులను ఆయా ఎం ఎల్ ఎస్ పాయింట్లు కు సక్రమంగా చేరే విధంగా అధికారులు సిబ్బంది

చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. క్వాలిటీ కాంట్రా విభాగాన్ని పటిష్టం చేస్తున్నట్టు వివరించారు. పాత్రికేయుల సూచనల మేరకు గొనె సంచులపై పౌర సరఫరాల సంస్థ ముద్ర

ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #challa ramakrishna reddy  #civil supplies

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam