DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ ఉత్సవ్ కు ఆర్భాటం గా ఏర్పాట్లు : సమీక్ష లో గంటా 

సీఎం, ఎఫ్ 2 సినిమా వాళ్ళే ప్రధాన ఆకర్షణ 
కార్లు, బైక్ లు బహుమతులు, 
అంతా ఈవెంటే, కోట్లాదిగా నిధుల వెచ్చింపు. 
విశాఖపట్నం, డిశంబర్ 13 , 2018 (DNS Online ): ప్రతీ ఏటా కోట్లాది

రూపాయలు ఖర్చు చేసి ఆర్భాటంగా జరిపే విశాఖ ఉత్సవ్ ను ఈ పర్యాయం డిశంబర్ 28 నుంచి 30 వరకు వైభవంగా మరింత ఘనంగా చేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.

దీనికి తగు ఏర్పాట్లకై రాష్ట్ర మానవ వనరుల శాఖామంత్రి గంట శ్రీనివాస్ శుక్రవారం విశాఖపట్నం మెట్రో రీజినల్ డెవెలెప్మెంట్ సంస్థ ( వి ఎం ఆర్ డి ఏ ) ప్రధాన కార్యాలయం

లో జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా గంట అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఈ వేడుకలకు రాష్ట్ర

ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు ముఖ్య అతిధిగా హాజరవుతారని తెలిపారు.  à°Žà°«à± 2 తెలుగు సినిమా బృందం లోని సినీ నటులు వెంకటేష్, వరుణ్ తేజ్, నిర్మాత దిల్ రాజు లతో పాటు నటీ

మణులు తమన్నా భాటియా, మెహ్రీన్ లు హాజరై  à°µà°¿à°¶à°¾à°– వాసులను ప్రత్యేక సందడి చేయనున్నారన్నారు. à°ˆ ఉత్సవాల్లో వివిధ స్టాల్స్ ను ఏర్పాటు చెయ్యడం జరుగుతుందని, వివిధ

విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఒక ఈవెంట్ మేనేజర్ కి అప్పగించారు. సూక్షంలో మోక్షం లాగా ఉన్న ఈ నిర్వహణలో

వివిధ పోటీలు నిర్వహిస్తామని, దానిలో గెలిచినా వారికి మొదటి ప్రైస్ గా ఒక కారు, ద్వితీయ బహుమతిగా బైక్ తదితర బహుమతులు అందించనున్నట్టు తెలిపారు. వీటిని వీఎం ఆర్ డి

ఏ  à°ªà±à°°à°§à°¾à°¨ కార్యాలయం వద్ద ప్రదర్శనలో పెట్టి, పోటీల్లో విజేతలకు 
అందించనున్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చే సందర్శకుల కోసం

జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేయనున్నట్టు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవణా సంస్థ ప్రాంతీయ మేనేజర్ సుధీష్ కుమార్ మంత్రి కి

తెలియచేసారు. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా, నగర పరిధిలోనూ  à°…న్ని పాఠశాలల్లోనూ నిర్వహించే పోటీల్లో విద్యార్థినీ విద్యార్థులు పాల్గొనే విధంగా తగు సూచనలు

చేసి, వారిని ప్రోత్సహించవలసిందిగా జిల్లా విద్య శాఖాధికారి లింగేశ్వర రెడ్డి కి సూచించారు. అదే విధంగా ఈ మూడు రోజుల పాటు ప్రత్యేక రాయితీలు కల్పించవలసినదిగా

నగర పరిధిలోని అన్ని హోటళ్లు, వస్త్ర వ్యాపార కేంద్రాలు, వాణిజ్య సంస్థలనూ ఆదేశించాల్సిదిగా వాణిజ్య శాఖా డిప్యూటీ కమిషనర్ నాగేంద్ర కు సూచించారు. అంతకు ముందు

ఈవెంట్ మేనేజర్ విశాఖ ఉత్సవ్ సందర్బంగా విశాఖ నగర పరిధిలో రామకృష్ణ బీచ్, జాతర, సెంట్రల్ పార్క్ తదితర ప్రాంతాల్లో నిర్వహించే ఈవెంట్లను పవర్ పాయింట్ ద్వారా

వివరించారు. 
à°ˆ సమీక్ష సమావేశం లో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, గాజువాక ఎమ్మెల్ ఏ పల్లా శ్రీనివాసరావు,  à°¸à°‚యుక్త కలెక్టర్ డాక్టర్ జి. సృజన, వి à°Žà°‚ ఆర్ à°¡à°¿ ఏ

కమిషనర్ బసంత్ కుమార్, సంయుక్త కలెక్టర్ 2 డాక్టర్ ఏ. సిరి, పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు రాధాకృష్ణ మూర్తి, రాష్ట్ర సమాచార శాఖా డిప్యూటీ డైరక్టర్ మణిరామ్, జిల్లా

పర్యాటక శాఖా అధికారిణి పూర్ణిమ దేవి, రాష్ట్ర దేవాదాయ శాఖా ఉప కమిషనర్ మూర్తి, పోలీసు ఉన్నతాధికారులు, గ్రేటార్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్

మూర్తి, తదితరులు పాల్గొన్నారు. 

 

#dns  #dns live #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #ganta srinivasa rao  #visakha utsav 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam