DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రఫెల్ డీల్ పై అభాండాలు వేసిన రాహుల్ క్షమాపణ చెప్పాల్సిందే 

సుప్రీం తీర్పు హర్షణీయం,: సుహాసిని ఆనంద్  

విశాఖపట్నం, డిశంబర్ 14 , 2018 (డిఎన్ఎస్  DNS Online )  : అత్యంత ప్రతిష్టాత్మకమైన రఫెల్ డీల్ భారత్, ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య

జరిగిన నిష్పక్షపాతమైన ఒప్పందం పై అవాకులు చెవాకులు చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తక్షణం ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ ఆంధ్ర

ప్రదేశ్ శాఖా అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ డిమాండ్ చేశారు. ఈ ఒప్పందం భారత ప్రభుత్వం, ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య సుహృదయ వాతావరణం లో ఎటువంటి లంచాలు, పెర్సం

టేజీలు లేకుండా, అత్యంత స్పష్టంగా జరిగిన ఒప్పందం, ఇది స్కామ్ కాదు  à°…ని భారత అత్యున్నత న్యాయ స్థానం శుక్రవారం ఇచ్చిన తీర్పు హరణీయమని, దాన్ని

స్వాగతిస్తున్నామంటూ హర్షం వ్యక్తం చేశారు. ఒక బాధ్యతాయుతమైన పదవి లో ఉంది కూడా దేశ ప్రజలను తప్పుదారి పట్టించేలా రాహుల్, అతని పార్టీ చేసిన వ్యాఖ్యలపై తక్షణం

క్షమాపణ చెప్పాలన్నారు. భారత దేశాన్ని ప్రగతి పదం లో నడిపిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ పట్ల ప్రజల్లో ఉన్న అభిమానాన్ని చెడగొట్టాలి అనే సంకల్పం తోనే

కాంగ్రెస్ అండ్ కో తప్పుడు సంకేతాలిస్తోందన్నారు. గత ఆరున్నర దశాబ్దాల కాలం లో అధికారం లో ఉన్న కాలంలో స్కామ్ లు, వాటాలు, అలవాటు పడిన కాంగ్రెస్ పాలకులకు అందరూ

అలాగే ఉంటారనే అభిప్రాయం లోనే ఉన్నట్టుగా అనిపిస్తోందన్నారు. 2012 లో ప్రారంభమైన ఈ ఒప్పందం సంప్రదింపులు వాళ్ళ పాలనా కాలంలో నెరవేర్చకుండా నిద్రపోయి, ఇప్పుడు

భారతీయ జనతా పార్టీ సక్రమంగా నిర్వర్తిస్తుంటే భరించలేక పోతున్నారన్నారు. ప్రధానంగా మూడు అంశాలపై రాహుల్ తక్షణం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతీ విషయం లో

రచ్చచేయ్యడం అలవాటు పడిన రాహుల్ తన తప్పు తెలుసుకోవాలని హెచ్చరించారు.  
రఫెల్ డీల్ గురించిన సమాచారం,రాహుల్ కి ఎవరు ఇచ్చారు? ఎలా ఇచ్చారు,? దాని పై సమగ్ర వివరణ

ఇవ్వాలని డిమాండ్ చేశారు.  2004 లో మొదలైన à°ˆ చర్చలు, నాటి నుంచి 14 వరకూ ఎందుకు ఒప్పందం పూర్తి చెయ్యలేదు ? అప్పుడు అధికారం లో ఉన్నది కాంగ్రెస్ పార్టీయేనని, దీనిపై

రాహుల్ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. కమిషన్ తీసుకోకుండా కార్యాచరణ చేయడం కేవలం నరేంద్ర మోడీ పాలనా లోనే జరుగుతోందని, వాళ్లకి ఇది

నచ్చకపోవడంతోనే మోడీ పాలనలో అమలు చేస్తున్న ప్రతీ పధకం, విషయాన్నీ రచ్చ చేసేందుకు ప్రయత్నిస్తూ ప్రతీ విషయంలోనూ భంగ పడుతున్నారన్నారు. అదే విషయం ఈ రోజు సుప్రీం

కోర్టు బహిర్గతం చేసిందన్నారు. తాను దేశ ప్రజలను తప్పుడు దారి పట్టించినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

 

 

#dns  #dns live  #dns news  #dns media  #dnslive  #dnsmedia  #dnsnews  #bjp  #suhasini anand  #rafeal deal  #supreme court

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam