DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ధనుర్మాస ఉత్సవాలకు ఉపమాక ఆలయం సిద్ధం 

18  à°¨ వైకుంఠ ఏకాదశి పర్వదినోత్సవం 
విశాఖపట్నం, డిశంబర్ 15 , 2018 (డిఎన్ఎస్  DNS Online ): విశాఖ జిల్లా ఉపమాక గ్రామం లో à°—à°² శ్రీవేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం లో ఆదివారం (

డిశంబర్ 16 , 2018 ) సాయంత్రం నుండి ధనుర్మాసం ఉత్సవములు ప్రారంభం మవుతాయని, ఆలయ ప్రధాన అర్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు తెలిపారు. శనివారం DNS కు ఈ ఉత్సవాల

వైభవాన్ని తెలియచేస్తూ. . . మానవాళి శ్రేయస్సుకై ఉత్తమోత్తమ వ్రతం ఈ ధర్మానుర్మాస వ్రతామని, దీన్ని ఆచరించిన గోదాదేవి ( ఆండాళ్) తన చిరకాల కోరిక అయినా శ్రీరంగనాథుని

తో వివాహం చేసుకుందని, తదుపరి అయనలో ఐక్యం అయ్యిందని తెలిపారు. ఇది ఈ కలియుగం లోనే జరిగిన ప్రత్యక్ష నిదర్శనం అన్నారు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యత

కల్గిన అమ్మవారు ఆండాళ్ అని, ఆమె ఆచరించిన వ్రతాన్ని, ప్రజలందరికీ లభించాలని సంకల్పంతోనే అన్ని శ్రీ వైష్ణవ ఆలయాల్లోనూ నెలరోజుల పాటు ఈ ధనుర్మాస వ్రతాన్ని

ఆచరింపచేస్తారని తెలిపారు. ఈ కాలంలోనే అధ్యయనోత్సవాలు కూడా జరుగుతాయని వివరించారు. తమ ఆలయంలో ఆదివారం సాయంత్రం గరుడాద్రి కొండపై గల మూలవిరాట్ వద్ద విష్వక్సేన

పూజ, పుణ్యాహ వాచనం,  à°ªà±à°°à°¤à±à°¯à±‡à°•  à°…భిషేకం నిర్వహించిన తరువాత ధనుర్మాసం ఉత్సవములు ప్రారంభ సూచికగా  à°—à°‚,, 05-27ని,,లకు  à°˜à°‚టానాధం చేయడంతో నెలరోజులు జరుగు à°ˆ ఉత్సవములు

ప్రారంభం అవుతాయన్నారు. దీనిలో ముఖ్యంగా  à°ˆà°¨à±†à°² 18వతేదీన ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తెల్లవారుజామున 2-03గంటలకు కొండపై à°—à°² మూలవిరాట్ కు ప్రత్యేక అభిషేకం

నిర్వహించిన తరువాత భక్తులందరికీ దర్శనాలు ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సిద్దం చేసినట్టు తెలియచేసారు.   
అదేరోజు సాయంత్రం విశేష

ఉత్సవములలో భాగంగా శ్రీవేంకటేశ్వర స్వామి వారికి రంగనాధుని అలంకరణ చేసి పుణ్యకోటి వాహనం లోను వెనుక ఏడువాహనాలలో  à°†à°²à°¯à°‚లో à°—à°² వివిధ ఉత్సవమూర్తులతో గ్రామ

తిరువీధి సేవ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు నుండి అధ్యయన ఉత్సవములలో భాగంగా రాపత్తు నాలాయిర సేవాకాలంతో పదిరోజుల పాటు శ్రీస్వామి వారి తిరువీధి సేవలు

నిర్వహిస్తారని, వివరించారు.   ధనుర్మాసం ఉత్సవములలో ప్రతిరోజూ ఉదయం శ్రీదేవీ భూదేవి సమేతంగా శ్రీ వేంకటేశ్వర స్వామి ఒక్కొక్క వాహనంలోనూ,గోదాదేవి అమ్మేవారు

పల్లకీలోనూ తిరువీధి సేవలు నిర్వహిస్తారు. అలాగే జనవరి 14వతేదీ ఉదయం స్వామి వారి పుష్పతోటలో  à°—ోదా రంగనాధుల కళ్యాణం నిర్వహిస్తారు.  15వతేది సంక్రాంతి సందర్భంగా

స్వామి వారి  à°ªà±à°°à°¤à±à°¯à±‡à°• తిరువీధిసేవ జరుగుతుందని తెలిపారు. జనవరి 16à°µ తేది కనుమ పండుగఉత్సవములో భాగంగా సాయంత్రం ఐదు గంటలకు స్వామి వారికి *రాజాధిరాజ* అలంకారం తో

గరుడాద్రి పర్వతం చూట్టు *గిరిప్రదక్షిణ* నిర్వహించడం జరుగుతుంది. అనంతరం బంధురసరస్సు వద్ద గల లంకవారి మండపం లో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు అందరికీ

 à°¤à±€à°°à±à°§ ప్రసాదాలు అందజేస్తారు. అనంతరం గ్రామ తిరువీధి సేవ నిర్వహించడం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకుడు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు చెప్పారు. 
/> ఈఉత్సవములకు సంబందించి  à°¤à°¿à°°à±à°®à°² తిరుపతి దేవస్థానం వారిచే ఆలయంలో పూల అలంకరణలు, విద్యుత్ లైటింగ్ ఏర్పాట్లు భక్తులు అందరికీ ఉచితంగా పంపిణీ చేయడం కొరకు

ప్రసాదములు, స్వామి వారి వాహన సేవలకు సంబందించి వివిధ వాహనములు సిధ్దంగా చేయడం జరిగిందని ఆలయ  à°‡à°¨à°¸à±à°ªà±†à°•à±à°Ÿà°°à± చంద్రశేఖర్ తెలియచేసారు.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews 

#visakhapatnam  #vizag  #upamaka  #dhanurmasam  #andal  #tiruppavai

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam