DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పెథాయ్ తుఫాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి

: జాయింట్ కలెక్టర్ సృజన ఆదేశాలు

తీర ప్రాంత మండలాల్లో పర్యటన
ఏర్పాట్లను పరిశీలించి అప్రమత్తం చేసిన జెసి
ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరాలని సూచన
/> పాయకరావుపేటలో అధికారులతో సమీక్షా సమావేశం

విశాఖపట్నం, à°¡à°¿à°¸à±†à°‚బర్ 16, 2018 (DNS Online) : పెథాయ్ తుఫాను వలన ఏర్పడే ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు

ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి.సృజన అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆమె జిల్లా ప్రజలను, అధికారులు అప్రమత్తం

చేస్తూ ముందస్తు చర్యల్లో భాగంగా పాయకరావుపేట నియోజకవర్గంలో తీర ప్రాంతాలైన బంగారమ్మ పాలెం, రేవుపోలవరం, తీనార్ల, రాజయ్యపేట, బంగారయ్య పేట, తదితర గ్రామాల్లో

నక్కపల్లి, ఎస్ రాయవరం మండల కేంద్రాలలో పర్యటించారు. పాయకరావుపేట ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ వెంట

రెవిన్యూ పోలీసు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. తుఫాన్ సమయంలో ప్రజలు తల దాచుకునేందుకు గల తుఫాన్ షెల్టర్ భవనాలను, అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.

బాధితులకు తాగునీరు. ఆహారం అందించే విషయంలో ఎటువంటి లోటు పాట్లు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైన నిత్యావసర వస్తువులు, మందులు

సిద్ధంగా ఉంచాలన్నారు. తుఫాను రక్షక అధికారుల సూచనలను తగు ఏర్పాట్లను చేస్తూ ఉండాలన్నారు. వైద్య సిబ్బందికి, రెవెన్యూ మరియు పోలీసులకు పలు సూచనలు చేశారు.

/> అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆగ్నేయ బంగాళా ఖంలో ఏర్పడిన అల్పపీడనం క్రమేపి తుఫానుగా పరివర్తన చెంది ఉత్తర, ఆగ్నేయ దిశగా పయనిస్తుందని

పేర్కొంటూ దిశ మార్చుకోవడం వలన తూర్పు గోదావరి విశాఖపట్నం జిల్లాల మధ్య తీరం దాటే అవకాలు ఉన్నట్లు వాతవరణ శాఖ సూచనలు ఉన్నాయని తెలిపారు. రానున్న మూడు రోజులు

పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి ప్రాణ నష్టం సంబవించకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆమె పేర్కొన్నారు. వరద,తుఫాను ప్రభావం ఉన్న గ్రామాల ప్రజలను ఖాళీ చేయించి

సురక్షిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని అన్నారు. వరదలు,తుఫానుల వలస తక్షణం తాగు నీరు, ఆహారం, విద్యుత్ వ్యవస్థల పునరుద్ధరణ అవసరమని అందుకు

తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. తాగు నీటి ప్యాకెట్లు, నీటి పదకాల మడకనిర్వహణకు జనరేటర్లు సిద్ధంగా ఉంచాలని అన్నారు. పడిపోయిన చెట్లను తొలగించేందుకు

పవర్ సాస్ (విద్యుత్ రంపాలు) తదితర అవసరమైన సామాగ్రి, వాహనాలు సిద్ధంగా ఉంచాలన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని, . ప్రజలందరూ అధికారుల పిలుపు అందిన తక్షణం

స్పందించుటకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రత్యేక అధికారులు, మండల అధికారులు, మండల, గ్రామ స్థాయి సిబ్బంది స్థానికంగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
తరువాత

ఎలమంచిలి నియోజకవర్గంలోని రాంబిల్లి మండలంలో తీర ప్రాంతాలను తుఫాను షెల్టర్ కూడా పరిశీలించారు.
జిల్లాలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసినట్టు జాయింట్

కలెక్టర్ చెప్పారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో , రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయాల్లో కంట్రోలు రూములు పనిచేస్తున్నాయని తెలిపారు . ఈ కార్యక్రమంలో

నర్సీపట్నం ఏఎస్పీ అరీఫ్ హఫీజ్, నర్సీపట్నం రెవిన్యూ డివిజనల్ అధికారి వి విశ్వేశ్వరరావు, అనకాపల్లి ఆర్డీవో సూర్య మణి, ఎస్ డి సి భాస్కర రెడ్డి పాయకరావుపేట

ప్రత్యేక అధికారిణి పుష్పమణి, ఎంపీడీవోలు, తాసిల్దార్ లు, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు
అనంతరం అచ్యుతాపురం మండలం పూడిమడక

గ్రామాన్ని సందర్శించారు. అక్కడ ఉన్న తుఫాన్ షెల్టర్ కేంద్రాన్ని పరిశీలించారు. గ్రామంలో ఉన్న పాఠశాలలో కూడా వసతి ఏర్పాట్లు చేయాలని sdc గోవిందరాజులును

ఆదేశించారు. అన్ని గ్రామాలలో వైద్య సేవలు అందించేందుకు ఏఎన్ఎం లను సిద్ధంగా ఉంచాలని, అవసరమైన మెడికల్ కిట్స్ సరఫరా చేయాలని వైద్య అధికారులను ఆదేశించారు.

కొవ్వొత్తులు జనరేటర్లు కిరోసిన్ మొదలైనవన్నీ సిద్ధంగా ఉంచాలన్నారు. పటిష్టంగా లేని గృహాలు భవనాలు వద్దకు వెళ్లకుండా, తుఫాను సమయంలో బయట తిరగకుండా ప్రజలకు

అవగాహన కల్పించాలన్నారు.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #tycoon  #pethai  #joint collector  #Srujana

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam