DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాహుల్ లోక్ సభ సభ్యత్వం రద్దు చేయండి: రాష్ట్రపతి కి బీజేపీ వినతి 

విశాఖపట్నం, డిశంబర్ 18 ,2018 (DNS Online ): సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్, రఫెల్ డీల్ పై అవాకులు, చెవాకులు వ్యాఖ్యానించందాన్ని తప్పు

పడుతూ భారతీయ జనతా పార్టీ రాహుల్ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలనీ రాష్ట్రపతికి లేఖ రాసింది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నిరసనలు,

శాంతియుత ధర్నాలు చేపట్టి, ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారా రాష్ట్రపతికి వినతి పాత్రలను పంపించే కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా విశాఖ జిల్లా కేంద్రంలో

విశాఖ నగర బీజేపీ అధ్యక్షులు à°Žà°‚. నాగేంద్ర ఆధ్వర్యవం లో నగర, రాష్ట్ర కమిటీ ప్రతినిధులు నిరసనలు చేపట్టి, ఆర్ à°¡à±€ à°“ చంద్రశేఖర్ కు వినతి పత్రం అందించారు. 
అనంతరం

నాగేంద్ర మాట్లాడుతూ రఫెల్ ఒప్పందం పై ఇటీవల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ సుప్రీమ్ కోర్ట్ లో వేసిన పిటిషన్ పై సుప్రీమ్ కోర్ట్ స్పందిస్తూ రఫెల్

ఒప్పందంలో ఎటువంటి ఆర్థికపరమైన అవకతవకలు జరుగలేదని, నియమనిబంధనలు కేంద్ర ప్రభుత్వం పాటించింది అని పేర్కొందని తెలిపారు. అసత్య ఆరోపణల ఆధారంగా దేశ రక్షణ వంటి

సున్నితమైన అంశాలను  à°•à±‹à°°à±à°Ÿà± వద్దకు  à°¤à±€à°¸à±à°•à±à°°à°¾à°•à±‚డదని సందేశాన్నిచ్చింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ వేసిన పిటిషన్ ను కొట్టివేసి రఫెల్ యుద్ధ

విమానాలు దేశ రక్షణకు అవసరమని తెలియచేసింది. సుప్రీమ్ కోర్ట్ రఫెల్ ఒప్పందం పై సంతృప్తి చెందింది అని మరియు ఆర్థికపరమైన అనుమానాలకు తావులేకుండా పారదర్శకంగా

ఉంది అని పేర్కొంది. వ్యక్తిగత అభిప్రాయాలు పరిగణలోకి రావు అని తేల్చిచెప్పిందన్నారు. 
2001లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం లో ఉన్న సమయంలో యుద్ధ విమానాలు

కొనుగోలు చేయడం ఆలస్యం చేసిందని, భారతీయ జనతా పార్టీ కేంద్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ యుద్ధ విమానాల కొనుగోలు ప్రక్రియను

త్వరితగతిన  à°ªà±‚ర్తిచేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం యుద్ధ విమానాల కొనుగోలు ఆలస్యం చేసింది అని, ఇప్పుడు దేశ ప్రజలను తప్పుద్రోవ పట్టిస్తుంది అని లేఖ లో

పేర్కొన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ కేవలం రాజకీయ లబ్ది  à°•à±Šà°°à°•à± ఇటువంటి ఆరోపణలను చేస్తున్నారని, అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను

దిగజారుస్తున్నారు అని లేఖలో పేర్కొన్నారు. కేవలం రాజకీయ లబ్ది కొరకు దేశ రక్షణ వంటి సున్నితమైన విషయాల పై అసత్య ఆరోపణలు చేయడం వల్ల అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట

దెబ్బ తీశారు అని అందుకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ ని లోక్ సభ సభ్యునిగా తొలిగించాలని నగర అధ్యక్షులు M నాగేంద్ర గారు ఈ లేఖ ద్వారా డిమాండ్

చేసారు.à°ˆ కార్యక్రమంలో నగర, రాష్ట్ర కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #;viswanadha raju  #bjp  #rahul  #lok sabha  #membership  #cancel

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam