DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సాహితీ రంగానికి పట్టాభిషేకం. . . మోపిదేవి జాతీయ పురస్కారాలు 

విశాఖపట్నం, డిశంబర్ 23, 2018 (DNS Online ):  à°¤à±†à°²à±à°—ు సాహితీ రంగానికి పట్టాభిషేకం చెయ్యడం హర్షణీయమని, 
ఆంధ్ర విశ్వ కళాపరిషత్ డాక్టర్ జి. నాగేశ్వర రావు అన్నారు. విశాఖనగరం

లోని ద్వారకానగర్ లో గల పౌర గ్రంధాలయం లో అఖిల భారతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యవం లో ఆదివారం నిర్వహించిన సాహితీ సభలో తమ తల్లిదండ్రులు మోపిదేవి రామమూర్తి, జానకిల

పేరిట జాతీయ సాహిత్య పురస్కారాలు అందించడం హర్షణీయమన్నారు. పురాతన కాలం నుంచి తెలుగు భాషకు, పద్య, కవితా సాహిత్యానికి,  à°…త్యంత ప్రాభవం లభించిందని, అది నేటికీ

కొనసాగుతోందని అనడానికి నేటి సభే నిదర్శనం అన్నారు. తెలుగుభాష కు మాత్రమే ఉన్న వైభవం అవధానం అని, దాన్ని అనుసంధానించడం అత్యంత క్లిష్టమైనదన్నారు.

తల్లిదండ్రులను విస్మరిస్తున్న నేటి కాలంలో తమ తల్లిదండ్రుల గౌరవార్ధం సాహిత్యకారులు గౌరవిస్తున్నమానసిక వైద్యులు డాక్టర్ మోపిదేవి విజయ్ గోపాల్  à°…ందరికీ

ఆదర్శం అన్నారు. 
  
ఆధునిక కాలంలో విభిన్న ఆలోచనలతో వినూత్నంగా రచనలు చేసే రచయితలను ప్రోత్సహించే కార్యక్రమం లో భాగంగా రచయితలకు మోపిదేవి రామమూర్తి, జానకి

జాతీయ సాహిత్య పురస్కారాలను  à°…ందిస్తున్నట్టు à°…à°–à°¿à°² భారతీయ సాహిత్య పరిషత్, విశాఖపట్నం కార్యదర్శి డాక్టర్ మోపిదేవి విజయ్ గోపాల్ తెలిపారు. 
 à°ˆ పురస్కారాలకై

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తో పాటు ఇతర ప్రాంతాలకు  à°šà±†à°‚దిన తెలుగు రచయితలకే 2014 నుంచి 2018 వరకు వివిధ ప్రచురణలో ప్రచురించబడిన కవితా సంపుటిలను ఆహ్వానించామని

తెలిపారు.
    à°ˆ ఆహ్వానానికి స్పందించి రెండు తెలుగు రాష్ట్రాలు, చెన్నై, కర్ణాటక, బరంపురం నుంచి సుమారు 90 మంది రచయితలూ, కవుల నుంచి సుమారు 100 రచనలు పురస్కార కమిటీకి

అందాయని, రచనలను పరిశీలించిన న్యాయ మూర్తులు మూడు బహుమతులను ప్రకటించారన్నారు. రచయితల స్పందన, ఉత్సాహం గమనించి రెండు ప్రోత్సాహక పురస్కారాలను అదనంగా

ఇచ్చినట్టు తెలిపారు. 
సాహిత్య రత్నాకర డాక్టర్  à°¦à°¾à°®à±†à°° వెంకట సూర్యారావు అధ్యక్షత వహించారు.  
గౌరవ అతిధిగా పాల్గొన్న ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల

నియోజకవర్గ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ ఒక ప్రక్క మానసికంగా ప్రజలకు సక్రమమైన మార్గం చూపిస్తూ మరో ప్రక్క మానవాళి ఎదిగే విధంగా సాహిత్య రంగాన్ని కూడా

అనుసంధానం చేస్తున్న డాక్టర్ విజయ్ గోపాల్ అభినందనీయులన్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల రచయితలని కాక, ఇతర ప్రాంతాలకు చెందిన వారిని ప్రోత్సహిస్తూ నగదు

పురస్కారం ఇవ్వడం హర్షణీయమన్నారు. 
ఆత్మీయ అతిధులుగా జాగృతి జాతీయ వార పత్రిక సంపాదకులు గోపరాజు నారాయణ రావు, విశాఖ సాహితీ అధ్యక్షులు డాక్టర్ కోలవెన్ను

మలయవాసినిలు హజయ్యారన్నారు. 
మోపిదేవి రామమూర్తి, జానకి జాతీయ పురస్కారాల్లో మొదటి బహుమతి à°•à°¿  15 వేల రూపాయలు నగదు పురస్కారం,  à°°à±†à°‚à°¡à°µ బహుమతిగా 10  à°µà±‡à°² రూపాయలు నగదు

పురస్కారం, మూడవ బహుమతి గా రూ. 5 వేల నగదు పురస్కారం ప్రకటించామన్నారు. వీటికి అదనంగా రెండు ప్రోత్సాహక పురస్కారాలను ( రూ. 2500 ఒక్కొక్కటి) కూడా

అందిస్తున్నామన్నారు.  

విజేతలు వీరే :
మొదటి బహుమతి :  à°¹à±ˆà°¦à°°à°¾à°¬à°¾à°¦à± కు చెందిన మౌన శ్రీ మల్లిక్  à°°à°šà°¿à°‚à°šà°¿à°¨ " సప్త స్పృహ ", రెండవ బహుమతి :  à°°à°¾à°œà°®à°¹à±‡à°‚ద్ర వరం కు చెందిన

పద్య కవి తిలక ఎస్ వి రాఘవేంద్ర రావు  à°°à°šà°¿à°‚à°šà°¿à°¨ " కాలుష్యపు కోరలలో ",  à°®à±‚à°¡à°µ బహుమతి : రేపాక కు చెందిన చిత్తలూరు సత్యనారాయణ à°°à°šà°¿à°‚à°šà°¿à°¨ "నల్ల చామంతి " లకు పురస్కారం

అందించామన్నారు.  
ప్రోత్సాహక పురస్కారాలను : నెల్లూరు కు చెందిన పాతూరి అన్నపూర్ణ  à°°à°šà°¿à°‚à°šà°¿à°¨ " మనసు తడి ", ముమ్మిడివరం కు చెందిన శివనాగరాజు à°°à°šà°¿à°‚à°šà°¿à°¨ " తల్లి నిను

దలంచి à°–à°‚à°¡ కావ్యం" లకు అందించామన్నారు. 

అటల్ జీ కి అద్భుతమైన నివాళి :
సభలో ముందుగా మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారి వాజపేయి పై చేసిన కవితా సంకలనం

కవిరాజ్ అటల్ జీ పుత్సకావిష్కరణ చేశారు. మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారి వాజపేయి పై సాహితీ వేత్తలు స్వచ్చందంగా వాట్సాప్ లోను, పేస్ బుక్ తదితర సోషల్

మీడియాల్లో చేసిన రచనలు స్ఫూర్తిగా à°’à°• సంకలనానికి శ్రీకారం చుట్టామన్నారు. పిలుపు మేరకు సుమారు 50 మంది రచయితలూ పంపిన రచనలను చేర్చి  " కవిరాజ్ అటల్ జీ" పేరిట à°’à°•

సంకలనం చేసి,  à°ˆ సభలో ఆవిష్కరించామని తెలిపారు.  à°ˆ సభలో ప్రముఖ సాహితీ వేత్త డాక్టర్  à°ªà±‡à°°à°¿ రవికుమార్ పద్య పరిచయం చేయగా, గరిమెళ్ళ నాగేశ్వర రావు వచన కావ్యాల

పరిచయం చేయడం జరిగిందని తెలిపారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #mopidevi  #literay awards  #sahitya  #Atalji  #Atal Bihari Vajpeyi

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam