DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం, టెస్ట్ జట్టులో 7 ఏళ్ళ బాలుడు 

విశాఖపట్నం, డిశంబర్ 24, 2018 (DNS Online ):  à°ªà±à°°à°ªà°‚à°š క్రికెట్ చరిత్రలో బుధవారం అరుదైన రికార్డు నమోదు కానుంది. డిశంబర్ 26 à°¨ భారత్ తో జరుగనున్న మూడవ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ లో

(బాక్సింగ్ డే టెస్ట్) క్రికెట్ ఆస్ట్రేలియా ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. కేవలం ఏడు సంవత్సరాల ఆర్చీ షిల్లర్ ను టెస్ట్ క్రికెట్ జట్టులోకి తీసుకుంటూ

ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించడం తో యావత్ క్రికెట్ ప్రపంచం హర్షం వ్యక్తం చేసింది. దీనికి ప్రధాన కారణం ఇటీవలే ఈ బాలుడు మూడవ సారి హృద్రోగ చికిత్సను

చేయించుకున్నాడు. మేక్ ఏ విష్ ఆస్ట్రేలియా అభ్యర్ధన మేరకు ఈ బాలున్ని ఫైనల్ 15 మందిలో సభ్యునిగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియా చీఫ్ కోచ్

జస్టిన్ లంగర్ ఈ విషయాన్ని నేరుగా బాలునికి చెప్పడం గమనార్హం. అనంతరం ఆస్ట్రేలియా జట్టులో చేరి, తన లెగ్ స్పిన్ ద్వారా అందరినీ ఆకట్టుకున్నాడు. ఇరు జట్ల

కెప్టెన్లతో పాటు పాల్గొని, టెస్ట్ సిరీస్ కప్ ను పట్టుకున్నాడు. బుధవారం నుంచి జరుగనున్న ఈ మూడవ టెస్ట్ మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నప్పటికీ క్రికెట్ చరిత్రలో ఒక

రికార్డు à°—à°¾ మారనుంది. ఆస్ట్రేలియా తీసుకున్న à°ˆ నిర్ణయం పట్ల భారత జట్టు, క్రికెట్ అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. 

 

pix courtesy: to whom so ever it may

concern.

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #cricket  #australia  #india  #boxing day  #test match  #archie schiller

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam