DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జనవరి 2 నుంచి ఇంటర్ మీడియా స్పోర్ట్స్ 

విశాఖపట్నం, డిశంబర్ 27, 2018 (DNS Online): పాత్రికేయుల సంక్షేమ కార్యక్రమాలకు మారుపేరుగా నిలిచినా వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరమ్ (విజెఎఫ్) మరో మారు జనవరి 2 నుంచి క్రీడా సంబరాలు

నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు వైజాగ్‌ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు తెలిపారు. గురువారం విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన

విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ జనవరి 2 నుంచి 7 వరకు ఇంటర్ మీడియా స్పోర్ట్స్ ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విశాఖ పోర్ట్, రైల్వే మైదానం ల్లో క్రికెట్

పోటీలు జరుగుతాయన్నారు. ఫైనల్ పోటీలు జనవరి 7 న జరుగుతాయన్నారు. ఇండోర్ గేమ్స్ రెండు రోజులు జనవరి 2 , 3 తేదీల్లో జరుగుతాయని వివరించారు. ఈ పోటీల్లో పాల్గొనదలచిన

పాత్రికేయులు తమ పేర్లు విజెఎఫ్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యాలయం లో అందించాలన్నారు. ఈ విలేకరుల సమావేశం స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ దుర్గారావు మాట్లాడుతూ

పాత్రికేయులు క్రీడా స్పూర్తితో పాల్గొనాలని, మీడియా సంస్థలు తమ సంస్థ జట్లు ఉన్నట్టయితే ఈ పోటీల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పాత్రికేయుల సంక్షేమం కోసం

ప్రస్తుత కమిటీ శక్తి à°•à°¿ మించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని, వాటిని సంపూర్ణంగా వినియోగించుకోవాలని సూచించారు. à°ˆ కార్యక్రమంలో వీజెఎఫ్‌ ఉపాధ్యక్షులు ఆర్‌.

నాగరాజు పట్నాయక్‌, వి.జె.ఎఫ్‌. జాయింట్‌ సెక్రటరీ దాడి రవికుమార్‌, పాలకవర్గ సభ్యులు à°Žà°‚.ఎస్‌.ఆర్‌. ప్రసాద్‌, ఇరోతి ఈశ్వరరావు, శేఖరమంత్రి, మాధవరావు, గయాజ్‌,

వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #sports meet  #inter media


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam