DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శక్తివంచన లేకుండా పనిచేస్తున్నాం, ఇదిగో సాక్ష్యం : చంద్రబాబు 

అమరావతి, డిశంబర్ 31 ,2018 (DNS Online ) : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం శక్తివంచన లేకుండా పనిచేస్తోందని, దీనికి సాక్ష్యాలు ఇవిగో అంటూ ముఖ్యమంత్రి

చంద్రబాబునాయుడు ప్రకటించారు. సోమవారం అమరావతి లో నిర్వహించిన సమావేశంలో ఆయన తమ ప్రభుత్వ పాలన, పరిశ్రమలు,  à°‰à°ªà°¾à°§à°¿, నైపుణ్యాభివృద్ధి రంగాలలో నాలుగున్నరేళ్ళుగా

జరిగిన అభివృద్ధిపై శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లు, పర్యాటకం,

నైపుణ్యాభివృద్ధి, యువజన వ్యవహారాలలో మెరుగైన పురోగతి సాధించామని, సంపద సృష్టించేందుకు, తలసరి ఆదాయాన్ని పెంచేందుకు పరిశ్రమ, సేవల రంగాలే చోదకశక్తి గా

ఉన్నాయన్నారు. పరిశ్రమలు, సేవా రంగాల నుంచే అనేక దేశాలలో అత్యధిక వృద్ధి లభిస్తుందని, చారిత్రక కారణాల వల్లనే మన రాష్ట్రంలో సేవారంగం, పారిశ్రామిక రంగం వెనుకబడి

ఉన్నాయన్నారు. 12 శాతం వృద్ది రావాలని లక్ష్యంగా పెట్టుకుంటే 10.5 వృద్ధి సాధించామని, ఆశించిన వృద్ధి సాధించగలిగితే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిన రాష్ట్రం

అవుతుందన్నారు. 55 శాతం ఉపాధి మన రాష్ట్రంలో వ్యవసాయరంగం నుంచే వున్నారు. ఈ శక్తిని పారిశ్రామిక రంగానికి, సేవల రంగానికి మార్చగలిగితే మన తలసరి ఆదాయం పెరుగుతుందని

వివరించారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లో అభివృద్ధి సాధిస్తే తప్ప అభివృద్ది లక్ష్యానికి త్వరగా చేరుకోలేమని తెలిపారు. సర్వీస్ సెక్టారులో పర్యాటక రంగం

కీలకంగా మారిందని, హెల్త్ టూరిజం, ఎడ్యుకేషన్ టూరిజం ముఖ్యమన్నారు.  

జాతీయ సగటు కంటే ఏపీలో ఉత్పత్తి రంగం వృద్ధి రేటు 2014కు ముందు పదేళ్ల పాటు తక్కువగా ఉందని,

పరిశ్రమలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాల్లో భారీగా బ్యాక్ లాగ్. 2010-11 నుంచి పెండింగ్ లో ఉందని తెలిపారు. 

హోదా లేక పోవడంతోనే ఏపీ వెనుకంజ :

ప్రత్యేక కేటగిరీ

హోదా ఉన్న రాష్ట్రాలకు ఇచ్చిన ఆర్థిక ప్రోత్సాహకాలు ఆంధ్ర ప్రదేశ్‌కు దక్కలేదు, తద్వారా ఓక్స్ వాగన్, ప్రోటాన్ వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి వెనుకంజ

వేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నం- చెన్నై పారిశ్రామిక కారిడార్ కోసం కేంద్ర ప్రభుత్వం గ్రాంటు ఇవ్వలేదని, కనీసం పెట్టుబడి కూడా పెట్టలేదన్నారు.

ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడారులో మాత్రం పెట్టుబడి భారీ మొత్తం లోపెట్టుబడి పెట్టిందని వివరించారు. గ్రీన్ ఫీల్డ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ పెట్టాలన్న

హామీ కార్యరూపం దాల్చలేదని, à°•à°¡à°ª జిలాలో ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పాలన్న హమీకి కూడా అదే గతి పట్టిందని గుర్తు చేశారు.  

పబ్లిక్ సర్వీస్ డెలివరీ గ్యారంటీ

చట్టం 2017 : 
పబ్లిక్ సర్వీస్ డెవెలరీ గ్యారంటీ చట్టం 2017 ను అందుబాటులోకి తీసుకొచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన 74 సేవలను నిర్ణీత కాల వ్యవధిలో

అందజేయడానికి అవసరమైన చట్టం ఇదని, సింగిల్ డెస్క్ పోర్టల్ తీసుకొచ్చామని వివరించారు. 

ఈ పోర్టల్ తో విస్తృత సేవలు : మొత్తం 19 శాఖల నుంచి 69 రకాల సేవలను ఈ పోర్టల్

అందిస్తుందని తెలిపారు.  

అందించిన వివరాలు :

2009-14 మధ్య కాలంలో పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం సగటున ఏటా రూ. 312 కోట్లు మాత్రమే విడుదల చేసారు. 
2014 నుంచి

లెక్కిస్తే ఆ సగటు నాలుగు రెట్లు పెరిగి రూ. 1,218 కోట్లకు పెరిగింది.
జూన్ 2014 నుంచి ప్రభుత్వం మొత్తం 3,675 కోట్లను (28,083 క్లెయిములు) విడుదల చేశాం
వీటిలో రూ. 1,816 కోట్లు (26,597

క్లెయిములు) ఎంఎస్ఎంఈ యూనిట్లకు విడుదల చేశాం.
2014 నుంచి మొత్తం 30349 ఎంఎస్ఎంఈ యూనిట్లు స్థాపించారు. వీటితో రూ. 14,292 కోట్లు వచ్చాయి. 3.3 లక్షల మందికి ఉపాధి లభించింది.
/> రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల స్థాపించాలని నిర్ణయం తీసుకున్నాం.  à°µà±€à°Ÿà°¿à°²à±‹ 31 పార్కుల ఏర్పాటు 1,317. 97 ఎకరాల్లో రూ. 270.43 కోట్ల ఖర్చుతో

జరుగుతోంది.

ఎంఎస్ఎంఈల కోసం ప్రత్యేకంగా కార్పోరేషన్ ఏర్పాటు చేశామని, తెలిపారు. 2014-18 మద్య కాలంలో రూ. 82,097 కోట్ల మేరకు రుణాలకు ఎంఎస్ఎంఈ రంగానికి ఇచ్చామన్నారు.

వరుసగా మూడు సార్లు 2016, 2017, 2018 లలో భాగస్వామ్య సదస్సులను విశాఖపట్నంలో నిర్వహించామని, ఆశించిన వాటికంటే పెద్ద సంఖ్యలో స్పందన లభించిందని తెలిపారు. 

వీటిల్లో

భాగంగానే  à°«à±à°¡à± ప్రాసెసింగ్ రంగంలో సుమేరు, కాప్రికార్న్, లావజ్జా, అవంతి సీడ్స్, పోడారన్ అండ్ ఎవర్టన్, పతంజలి, జైన్ ఇరిగేషన్, పార్లే, జెర్సీ, ఇండస్ కాఫీ, ఫ్యూచర్

గ్రూప్, కాంటినెంటల్ కాఫీ, ఇంటర్నేషనల్ ఫ్లేవర్స్ అండ్ ఫ్రాగ్రెన్సెస్, గోద్రేజ్, ఎస్ హెచ్ గ్రూప్, టాటా ఫుడ్స్, ఐటీసీ, కాన్ఆగ్రో, మన్ పసంద్, 

జౌళి రంగంలో

టొరాయ్, టెక్స్ పోర్ట్, మోహన్ స్పింటెక్స్, ఇండియన్ డిజైన్, షాహి ఎక్స్ పోర్ట్స్, శ్రీ గోవింద రాజ టెక్స్ టైల్స్, ఎస్ఏఆర్ డెనిమ్, పేజ్ ఇండస్ట్రీస్ (జాకీ), అరవింద్

గ్రూప్, నిషా డిజైన్స్, గుంటూరు టెక్స్ టైల్ పార్క్, తారకేశ్వర టెక్స్ టైల్ పార్క్ వంటి సంస్థలు వచ్చాయన్నారు.

ఆటోమొబైల్ రంగంలో ఇసుజు, కియా మోటార్లు, అపోలో

టైర్లు, అశోక్ లేలాండ్, భారత్ ఫోర్జ్, హీరో గ్రూప్ వచ్చాయి.

ఐటీ, సెల్ ఫోన్ తయారీ రంగంలో ఫాక్స్ కాన్, సెల్కాన్, ఫ్లెక్స్ ట్రానిక్స్, డిక్సన్, రిలయన్స్, టీసీఎల్,

వోల్టాస్ వంటి సంస్తలు వచ్చాయని తెలియచేసారు. 

ఫార్మాస్యూటికల్స్ రంగంలో స్పైరా హెల్త్ కేర్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ల్యూపిన్, లారస్ ల్యాబ్స్, అరబిందో

ఫార్మా, వెస్ట్ ఫార్మా, దివిస్ ల్యాబ్స్, నాట్కో ఫార్మా

పర్యాటక రంగంలో విజయవాడలో నోవోటెల్ హోటల్,  à°¤à°¿à°°à±à°ªà°¤à°¿à°²à±‹ హాలిడేఇన్, తాజ్, గుంటూరులో ఐటీసీ మై ఫార్చ్యూన్,

విశాఖపట్నంలో జేడబ్ల్యూ మారియోట్, సన్ రే రిసార్ట్ వచ్చాయన డానికి  à°ˆ సదస్సులే నిదర్శనమన్నారు.

మొత్తం మూడు పారిశ్రామిక నోడ్లను అభివృద్ధి చేస్తున్నామని,

వాటిల్లో కృష్ణపట్నం (నెల్లూరుజిల్లా), ఓర్వకల్లు (కర్నూలు జిల్లా), హిందూపురం (అనంతపురం జిల్లా) ల్లో వస్తున్నామన్నారు.   కృఫ్ణపట్నం నోడ్‌ను 15,975 ఎకరాల్లో అభివృద్ధి

చేస్తున్నాం మాస్టర్ ప్లానింగ్ పుర్తయిందని,  à°¸à±€à°¬à±€à°à°¸à±€à°¨à°¿ జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి అమలు సంస్థ (ఎన్ఐసీడీఐటీ) పరిధిలో చేర్చారన్నారు.

నెల్లూరు,

ప్రకాశం జిల్లాల్లో మెగా ఫుడ్ పార్కులు, విజయనగరం, à°•à°¡à°ª, చిత్తూరు జిల్లాల్లో సమీకృత ఫుడ్ పార్కులు  à°°à°¾à°—à°¾, 
తిరుపతిలో రెండు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి క్లస్టర్లు

(ఈఎంసీ) వస్తున్నాయన్నారు. 

మొత్తం 175 నియోజకవర్గాలకుగానూ, 31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధి జరుగుతోందని, కర్నూలు జిల్లాలోని

ఓర్వకల్లు మెగా పారిశ్రామిక హబ్ కు 12,203 ఎకరాలు మెగా సీడ్ పార్కు కోసం 650 ఎకరాలు, కడపలోని మెగా పారిశ్రామిక పార్కు కోసం 6,553 ఎకరాలు కేటాయించగా, విశాఖపట్నంలో ఫిన్ టెక్

వ్యాలీ రూపొందిస్తున్నామన్నారు. 

పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని, 2014-15లో 1,784 మిలియన్ యూనిట్లుగా ఉన్న పారిశ్రామిక విద్యుత్ వినియోగం 2017-18

నాటికి దాదాపు రెట్టింపై 3,321 మిలియన్ యూనిట్లకు చేరుకుందన్నారు. 

పర్యాటక రంగంలో వృద్ధి ఫలితాలు బాగావున్నాయని, కర్నూలు ఎయిర్‌పోర్టుకు ఈరోజే చేరుకున్న

తొలి విమానం. ట్రయల్ రన్ విజయవంతంగా జరిగిందని, దగదర్తి, కుప్పం నుంచి కూడా త్వరలో విమాన రాకపోకలు సాగిస్తాయన్నారు. 

ఓర్వకల్లును ఫార్మా రంగంలో, నగరి

ప్రాంతాన్ని టెక్స్‌టైల్స్ రంగంలో అభివృద్ధి చేస్తున్నామని, జనవరి 9à°¨ రామాయపట్నం పోర్టు పనులకు శ్రీకారం, అదేరోజు పేపరుమిల్లు ఏర్పాటుకు పునాదిరాయి

పడుతుందన్నారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #bjp  #amaravati  #chandra babu

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam